Indian food
-
భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మన భారతీయ మూలాలున్న మహిళనే పరిణయమాడారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ వంటకాలతో బాగా సుపరిచయం ఉంది. అందువల్ల ఇటీవల వ్యాన్స్ వెల్నెస్ నిపుణుడు జో రోగన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కూడా భారతీయ వంటకాలపై ఉన్న ఇష్టాన్ని సవివరంగా తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శాకాహార వంటకాల గురించి చాలా గమ్మత్తైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో చూద్దామా..!. వాన్స్ భారతీయ రుచులకు ఫిదా అవ్వడమే గాక వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు వాటి ప్రయోజనాలపై ప్రసంసల జల్లు కురిపించాడు. తాను ఇంట్లో వండిన భారతీయ భోజనమే తింటానని చెప్పారు. అంతేగాదు దానిలో ఉండే పోషక ప్రయోజనాలను హైలెట్ చేసి మరి వివరించారు. అయితే ల్యాబ్‌లో కృత్రిమంగా చేసే మాంసాన్ని చెత్తగా అభివర్ణించాడు. అందుకు బదులు భారతీయ శాకాహారమే చాలా మంచిదని అన్నారు. తన భార్య ఉషా చాలా రుచికరమైన భారతీయ వంటకాలను తయారు చేస్తుందని, ముఖ్యంగా పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు..మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే గాక శరీరానికి కావాల్సిన పోషకాల అందుతాయి. అంతేగాదు అమెరికన్లు 2020-2025 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్యం పెంపొందించుకునేలా కొత్త ఆహార మార్గదర్శకాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో శాకాహారానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతుంది.బాడీ మాస్ ఇండెక్స్‌ను 0.96 తగ్గిస్తాయి. ఈ ఆహారాలు మధుమేహం మందులను తగ్గించడానికి కూడా అనుమతిస్తాయి. మాంసాహార ఆహారాలతో పోలిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని సుమారు 10 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. భారతీయ ప్రధాన ఆహారాల్లో.. పెరుగు, సలాడ్, రోటీ, పప్పులు, బియ్యం, గోధుమపిండి తదితరాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు ఏ, సీ, కే, ఫోలిక్ ఆమ్లాలు, కాల్షియం వంటి ఇతర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, దీర్ఘాకాలిక వ్యాధులను నివారించడానికి తోడ్పడతాయి. (చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?) -
ప్రపంచంలో భారత ఆహారమే బెస్ట్..
సాక్షి, అమరావతి: ప్రతి దేశంలో విభిన్న ఆహార అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. మానవుల ఆరోగ్యంతోపాటు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలోనూ భారత ఆహార (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, సాగు విధానాలే భేషైనవని తేల్చి చెబుతున్నాయి. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూమండలానికే డేంజర్ అని కూడా ఆ సంస్థలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో భారత ఆహారం కీలక పాత్ర పోషిస్తోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) కూడా తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో తాజాగా వెల్లడించింది. ఎక్కువ శాకాహారం, తక్కువ మాంసాహారం ఉండే భారత విధానం అత్యుత్తమమైనదని తెలిపింది. తక్కువ రసాయన ఎరువులతో ఆరోగ్యకరమైన భారత దేశ సాగు విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది. ఈ పంటల ఉత్పత్తి విధానాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. తద్వారా 2050 నాటికి పర్యావరణ కాలుష్యానికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండొనేసియా, చైనాలో ఆహార పద్ధతులు భేషైనవని పేర్కొంది. అమెరికా, అర్జెంటీనా, ఆ్రస్టేలియా వంటి దేశాల ఆహార పద్ధతులు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది. తృణధాన్యాలతో ఎంతో మేలు భారతదేశ సంప్రదాయ ఆహారంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణకు తృణ ధాన్యాలు (మిల్లెట్లు) మేలైనవని చెప్పింది. ఉత్తర భారత దేశంలో తృణ ధాన్యాలు, గోధుమ ఆధారిత రోటీలు, అప్పుడప్పుడు మాంసం వంటకాలు, దక్షిణాదిలో ప్రధానంగా అన్నం, ఇడ్లీ, దోస వంటి బియ్యం ఆధారిత ఆహారం, పశ్చిమ,, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల చేపలతో పాటు జొన్న, సజ్జలు, రాగి, గోధుమలు వంటి పురాతన మిల్లెట్లతో అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవ్వు, చక్కెర పదార్థాల వినియోగం పెరగడం వల్ల స్తూలకాయులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ భూమి వినియోగించాలి.. మేలైన పంటల సాగు ద్వారా వ్యవసాయ భూమిని గణనీయంగా తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. ఇందుకు కూడా భారత విధానాలే ఉత్తమమైనవని తెలిపింది. భారత విధానాలను ఇతర దేశాలు అనుసరిస్తే 2050 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తికి ఒక భూమి (ఎర్త్)లో 0.84 కంటే తక్కువ అవసరం ఉంటుందని వివరించింది. ఇతర దేశాల్లోని విధానాలే పాటిస్తే మన భూగ్రహం సరిపోదని, ఒకటి కంటే ఎక్కువే అవసరమవుతాయని హెచ్చరించింది. ఉదాహరణకు అర్జెంటీనా ఆహార పద్ధతులను అవలంభిస్తే ఆహార ఉత్పత్తులకు ఏడు భూగ్రహాలు కూడా సరిపోవని వివరించింది. పప్పులు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారం, మాంసానికి ప్రత్యామ్నాయంగా అధిక పోషక విలువలు ఉండే ఆల్గే (నీటిలో పెరిగే మొక్కలు) వినియోగించాలని కోరుతోంది. -
భారత ఆహారమే బెస్ట్
సాక్షి, అమరావతి: ప్రతి దేశంలో విభిన్న ఆహార అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. మానవుల ఆరోగ్యంతోపాటు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలోనూ భారత ఆహార (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, సాగు విధానాలే భేషైనవని తేల్చి చెబుతున్నాయి. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూమండలానికే డేంజర్ అని కూడా ఆ సంస్థలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో భారత ఆహారం కీలక పాత్ర పోషిస్తోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) కూడా తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో తాజాగా వెల్లడించింది. ఎక్కువ శాకాహారం, తక్కువ మాంసాహారం ఉండే భారత విధానం అత్యుత్తమమైనదని తెలిపింది. తక్కువ రసాయన ఎరువులతో ఆరోగ్యకరమైన భారత దేశ సాగు విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది.ఈ పంటల ఉత్పత్తి విధానాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. తద్వారా 2050 నాటికి పర్యావరణ కాలుష్యానికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండొనేసియా, చైనాలో ఆహార పద్ధతులు భేషైనవని పేర్కొంది. అమెరికా, అర్జెంటీనా, ఆ్రస్టేలియా వంటి దేశాల ఆహార పద్ధతులు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది. తృణధాన్యాలతో ఎంతో మేలు భారతదేశ సంప్రదాయ ఆహారంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణకు తృణ ధాన్యాలు (మిల్లెట్లు) మేలైనవని చెప్పింది. ఉత్తర భారత దేశంలో తృణ ధాన్యాలు, గోధుమ ఆధారిత రోటీలు, అప్పుడప్పుడు మాంసం వంటకాలు, దక్షిణాదిలో ప్రధానంగా అన్నం, ఇడ్లీ, దోస వంటి బియ్యం ఆధారిత ఆహారం, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల చేపలతో పాటు జొన్న, సజ్జలు, రాగి, గోధుమలు వంటి పురాతన మిల్లెట్లతో అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవ్వు, చక్కెర పదార్థాల వినియోగం పెరగడం వల్ల స్తూలకాయులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ భూమి వినియోగించాలి.. మేలైన పంటల సాగు ద్వారా వ్యవసాయ భూమిని గణనీయంగా తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. ఇందుకు కూడా భారత విధానాలే ఉత్తమమైనవని తెలిపింది. భారత విధానాలను ఇతర దేశాలు అనుసరిస్తే 2050 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తికి ఒక భూమి (ఎర్త్)లో 0.84 కంటే తక్కువ అవసరం ఉంటుందని వివరించింది. ఇతర దేశాల్లోని విధానాలే పాటిస్తే మన భూగ్రహం సరిపోదని, ఒకటి కంటే ఎక్కువే అవసరమవుతాయని హెచ్చరించింది. ఉదాహరణకు అర్జెంటీనా ఆహార పద్ధతులను అవలంభిస్తే ఆహార ఉత్పత్తులకు ఏడు భూగ్రహాలు కూడా సరిపోవని వివరించింది. పప్పులు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారం, మాంసానికి ప్రత్యామ్నాయంగా అధిక పోషక విలువలు ఉండే ఆల్గే (నీటిలో పెరిగే మొక్కలు) వినియోగించాలని కోరుతోంది. -
కరకర @ 50,000 కోట్లు!
కరకరలాడే సేవ్ భుజియా, వేయించిన పల్లీలు, బఠానీలు, మిక్చర్, జంతికలు ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ చిరుతిళ్లను ఇప్పుడు ఐదు, పది రూపాయల ప్యాకెట్లలో భారతీయులు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. పొటాటో చిప్స్ ఇతరత్రా పాశ్చాత్య స్నాక్స్ హవాకు సాంప్రదాయ, బ్రాండెడ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ గండికొడుతున్నాయి. విదేశీ, దేశీ కంపెనీలు మారుమూల ప్రాంతాల జనాలకు సైతం ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీయంగా సాల్టెడ్ స్నాక్స్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.50,800 కోట్లకు ఎగబాకాయి. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ స్నాక్స్ వాటా క్రమంగా జోరుందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం స్నాక్స్ మార్కెట్లో సాంప్రదాయ రుచుల వాటా 56 శాతానికి చేరుకోవడం దీనికి నిదర్శనం. ఐదు, పది రూపాయల చిన్న ప్యాకెట్ల రూపంలో రకరకాల దేశీ రుచులన్నీ లభించడంతో పాటు విదేశీ స్నాక్స్ రకాలతో పోలిస్తే కొంత ఎక్కువ పరిమాణం కూడా ఉంటుండటం దేశీ స్నాక్స్ జోరుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘భారతీయులు ఎక్కువగా సాంప్రదాయ రుచులనే ఇష్టపడతారు. ఇప్పుడిది స్నాక్స్ మార్కెట్లో కూడా ప్రతిబింబిస్తోంది’ అని బికనీర్‌వాలా ఫుడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేశ్ గోయెల్ పేర్కొన్నారు. ఈసంస్థ దేశవ్యాప్తంగా సాంప్రదాయ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు బికానో బ్రాండ్‌తో స్నాక్స్ ప్యాకెట్లను కూడా విక్రయిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వాటిదే జోరు... మొత్తం దేశీ స్నాక్స్ మార్కెట్లో బంగాళదుంప చిప్స్, కుర్కురే, ఫింగర్ స్టిక్స్ వంటి పాశ్చాత్య స్నాక్స్ వాటా రెండు దశాబ్దాల క్రితం మూడింట రెండొంతుల మేర ఉండేది. దీన్ని కూడా పెప్సీ ఫ్రిటో లేస్, ఐటీసీ ఫుడ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలే శాసిస్తూ వచ్చాయి. ‘గతంలో బడా కంపెనీలు విక్రయించే పాశ్చాత్య స్నాక్స్ ఇంటింటా తిష్ట వేశాయి. ఇప్పుడీ ట్రెండ్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయ స్నాక్స్ తయారీదారులు తమ పంపిణీ వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా పల్లెటూర్లకు కూడా చొచ్చుకుపోతున్నాయి’ అని గోయెల్ చెప్పారు. కొత కొన్నేళ్లుగా సాంప్రదాయ స్నాక్స్ విభాగం భారీగా అమ్మకాలను కొల్లగొడుతోంది. ఇక మార్కెట్ వాటా విషయానికొస్తే, సాల్టెడ్ స్నాక్స్‌లో హల్దీరామ్స్, పెప్సీ, బాలాజీ, ఐటీసీ, బికాజీ వంటి పెద్ద కంపెనీలకు 60 శాతం మార్కెట్ వాటా ఉండగా.. మిగతా 40 శాతాన్ని చిన్నాచితకా కంపెనీలు, ప్రాంతీయ సంస్థల చేతిలో ఉండటం విశేషం. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ గ్రాములను అందిస్తుండటం, మరిన్ని స్థానిక రుచులతో ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటం వాటికి కలిసొస్తోంది. ‘ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలు సాంప్రదాయ స్నాక్స్‌లో జోరు పెంచుతుండగా.. ప్రాంతీయంగా పేరొందిన కంపెనీలు సైతం క్రమంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి’ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు బుద్ధ చెబుతున్నారు. ఇలా అందరూ స్థానిక సాంప్రదాయ రుచులను అందించేందుకు పోటీపడుతుండటంతో వాటి అమ్మకాలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తోందని, దీంతో అన్‌బ్రాండెడ్ సంస్థల నుంచి మార్కెట్ క్రమంగా సంస్థాగత కంపెనీల చేతికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.హల్దీరామ్స్ హవా...ప్రస్తుతం దేశంలో ఏ మారుమూలకెళ్లినా హల్దీరామ్స్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మిక్చర్ పొట్లం, పల్లీల ప్యాకెట్ నుంచి రకరకాల ఉత్తరాది, దక్షిణాది రుచులతో సాంప్రదాయ స్నాక్స్‌కు పర్యాయపదంగా మారిపోయింది ఇది. హల్దీరామ్స్ దాదాపు 25% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2023–24లో కంపెనీ విక్రయాలు 18% ఎగసి రూ.12,161 కోట్లకు చేరాయి. పెప్సికో స్నాక్స్ అమ్మకాలు 14% పెరిగి రూ. 7,336 కోట్లుగా నమోదయ్యాయి. గుజరాత్‌కు చెందిన బాలాజీ వేఫర్స్ సేల్స్ 12% వృద్ధితో రూ.5,931 కోట్లకు దూసుకెళ్లడం విశేషం. భారతీయ స్నాక్స్ మార్కెట్ జోరుతో విదేశీ కంపెనీల ఇక్కడ ఫోకస్ పెంచాయి. హల్దీరామ్స్ను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ రంగంలోకి దిగినట్లు టాక్. 51% మెజారిటీ వాటా కోసం బ్లాక్‌స్టోన్ రూ. 40,000 కోట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం. హల్దీరామ్స్ విలువను రూ.70,000–78,000 కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒట్టు... మను బాకర్ భోజనమే చేయలేదు!
గెలుపు, ఓటములకు అతీతంగా కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట అంటే ‘గెలుపు’ లేదా ‘ఓటమి’ మాత్రమే కాదు. గెలుపుకు ముందు, గెలిచిన తరువాత, ఓటమికి ముందు ఓటమికి తరువాత విషయాలు కూడా పసందుగా ఉంటాయి. ‘షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భోజనం చేయలేదు’ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరె మనకు పతకాలు తెచ్చిన అమ్మాయి భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు?పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్ సృష్టించింది షూటర్ మను బాకర్. ‘ఇది మను ఒలింపిక్స్’ అంటూ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 25 మీటర్ల విభాగంలో మూడో పతకం కొద్దిలో చేజారింది.హిస్టారిక్ మెడల్ హాట్రిక్ మిస్ అయిన తరువాత ఆమె ఏం ఆలోచించిందనే విషయానికి వస్తే... మొదటిది... నాలుగు సంవత్సరాల తరువాత లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ గురించి. రెండోది... భోజనం గురించి. మొదటి విషయం సరే, రెండో విషయమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఆడి ఆడి అలిసిపోయిన మను బాకర్‌ను విశ్రాంతి గురించి అడిగినప్పుడు... ‘నేను చేసే మొదటి పని ఇంటి భోజనం చేయడం. ఇన్ని రోజులు నేను భోజనం చేయలేదు. విలేజ్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, షూటింగ్ రేంజ్‌కు వచ్చేదాన్ని. అక్కడ స్నాక్స్ తినేదాన్ని. విలేజ్‌లో మధ్నాహ్న భోజనం ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత 3 లేదా 5 గంటల మధ్య మాత్రమే తిరిగి భోజనశాలకు రావడానికి వీలయ్యేది. ఆ సమయానికి మధ్యాహ్న భోజనం అయిపోయేది. దాంతో సాయంత్రం ఏదో తినేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మను బాకర్.మను మధ్యాహ్న భోజనానికి దూరమైన విషయం ఆమె తల్లి సుమేధకు కూడా తెలిసి పోయింది.కుమార్తె విజయం కోసం రోజూప్రార్థనలు చేసిన ఆమె ఇలా అన్నది...‘మను ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి ఆలూ పరోట తినిపిస్తాను. మనుకు ఆలూ పరోట అంటే ఎంతో ఇష్టం’ ‘కుమార్తె గెలుపు వార్త మాత్రమే వినాలి... తన ఓటమిని చూడలేను’ అనుకుందో ఏమో మను బాకర్ లైవ్ మ్యాచ్‌లు చూడడానికి ఇష్టపడేది కాదు సుమేధ.‘మా అమ్మ నన్ను ఛాంపియన్ చేయడం కోసం ఎంతో కష్టపడింది. అమ్మా... నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటున్న మను బాకర్ అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తోంది.‘ఏదైనా సరే, మా ఇంట్లో అమ్మ చేతివంట తినడం అంటే ఎంతో ఇష్టం. ఐ రియల్లీ లవ్ ఆలూ పరోటా. ఆలూ పరోటా తినక నాలుగు నెలలు అవుతోంది’ అంటుంది మను బాకర్ మనకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ విజయాల వెనుక ఎన్ని సర్దుబాట్లు ఉంటాయో చెప్పడానికి మను బాకర్ ఒక ఉదాహరణ.ఒకటి రెండు రోజులంటే ఫరవాలేదుగానీ ఎన్నో రోజులు మధ్నాహ్న భోజనం లేకుండా గడిపింది మను. ఆ సమయంలో ఆమెకు కోపం రాలేదు. ఎందుకంటే మను బాకర్ ‘గెలుపు’ ఆకలితో ఉంది. రెండు పతకాలతో ఆ ఆకలి తీరింది.డైట్ రొటీన్భోజనానికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు. క్రీడాకారిణిగా వేరు. శాకాహారి అయిన మను బాకర్ ‘డైట్ రోటిన్’ విషయానికి వస్తే... హెల్తీ ఫ్యాట్స్. లో–జీఐ కార్బోహైడ్రేడ్స్తో కూడిన సింపుల్ డైట్కుప్రాధాన్యత ఇస్తుంది. అలసట, గాయాలకు దూరంగా ఉండడానికి డైట్లో హైడ్రేషన్‌కు అధికప్రాధాన్యత ఇస్తుంది. మను డైట్లో రకరకాల పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. హై–ఎనర్జీ, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటుంది.ఆహారానికి ఎంతప్రాధాన్యత ఇస్తుందో కంటినిండా నిద్రకు అంతేప్రాధాన్యత ఇస్తుంది. యోగా, జిమ్ తరువాత ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటుంది. మైండ్ ఫోకస్డ్గా ఉండడానికి క్రియేటివ్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతుంది మను బాకర్. -
ఆహార సేవల రంగం రూ.7.76 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆహార సేవల రంగం మార్కెట్ విలువ ఏటా 8.1 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2028 మార్చి నాటికి రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని జాతీయ రెస్టారెంట్స్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆహార సేవల రంగం మార్కెట్ విలువ రూ.5.69 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. దేశ ఆహార సేవల రంగంపై ఒక నివేదికను విడుదల చేసింది. ఆహార సేవల్లో సంఘటిత రంగం వాటా 13.2 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి ఈ రంగం బయటకు వచి్చందని పేర్కొంది. 2020 మార్చి నాటికి రూ.4.24 లక్షల కోట్లుగా ఉన్న మార్కె ట్, కరోనా దెబ్బకు 2021 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. 2022 మార్చి నాటికి తిరిగి రూ.4.72 లక్షల కోట్లకు చేరుకోగా, 2023 మార్చి నాటికి రూ.5.3 లక్షల కోట్లు, ఈ ఏడాది మార్చి చివరికి రూ.5.69 లక్షల కోట్లకు విస్తరించినట్టు ఎన్ఆర్ఏఐ నివేదిక వెల్లడించింది. 2025 మార్చి నాటికి రూ.5.69 లక్షల కోట్లను తాకుతుందని అంచనా వేసింది. టాప్ –3 మార్కెట్ భారత ఆహార సేవల రంగం 2028 మార్చి నాటికి జపాన్ను అధిగమించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని ఎన్ఆర్ఏఐ నివేదిక తెలిపింది. కరోనా ప్రతికూలతల నుంచి ఆహార సేవల మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందని, ఇది ఈ రంగం బలమైన సామర్థ్యాలను తెలియజేస్తోందని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఈ పరిశ్రమ చూపించే ప్రభావాలను గుర్తించి, ఈ మార్కెట్ వృద్ధికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆహార సేవల రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద విభాగమని, 85.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఎన్ఆర్ఏఐ నివేదిక తెలిపింది. 2028 నాటికి ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు 1.03 కోట్లకు చేరతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ నుంచి రూ.33,809 కోట్ల పన్ను ఏటా ప్రభుత్వానికి వస్తండగా, 2028 మార్చి నాటికి రూ.55,594 కోట్లకు చేరుతుందని తెలిపింది. -
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్లో కాస్త రిలాక్స్ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్‌కాస్ట్‌లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్‌లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్‌ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు. -
సమ్మర్ సీజన్ వేడిలో.. వడియాలకై కాచుకోండి!
మార్చి మూడు వంతులు గడిచింది. ఆహారం ఎండబెట్టే కాలం వచ్చింది. ఏడాదికి సరిపడా నిల్వ చేయాలి. వానల్లో వెచ్చగా వేయించుకు తినాలి. చలిలో కరకరలాడే రుచిని ఆస్వాదించాలి. ఏప్రిల్ నెలకు ఎండ తీవ్రత పెరుగుతుంది. వడగాలి వచ్చి దుమ్మెత్తి పోయకముందే... వడియాలకు దినుసులు సిద్ధం చేద్దాం. ఎండబెట్టమని సూర్యుడికి పని చెబుదాం. బియ్యప్పిండి వడియాలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు కప్పు ఎండుమిర్చి – 2 జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానం: ఒక పాత్రలో బియ్యప్పిండి వేసి అందులో రెండు గ్లాసుల నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో సగ్గుబియ్యం వేసి మునిగేలా నీటిని పోసి పక్కన పెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చిని గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మెత్తగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద పాత్రలో ఆరుగ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఉప్పు కలపాలి. నీరు మరగడం మొదలైన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి మూత పెట్టాలి. సగ్గుబియ్యం ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టిన బియ్యప్పిండిని పోసి కలపాలి. పిండి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పిండి ఉడికేటప్పుడు ఎండుమిర్చి పొడి, జీలకర్ర వేసి కలిపి దించేయాలి. వడియాల పిండి వేడి తగ్గేలోపు నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని స్పూన్‌తో వడియాలుగా పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత క్లాత్‌కు వెనుకవైపు నీటిని చల్లి వడియాలను వలిచి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలు చాలా త్వరగా వేగుతాయి. నూనెలో వేసిన తర్వాత పొంగి పువ్వుల్లా విచ్చుకోవడం మొదలవుతుంది. అప్పుడు చిల్లుల గరిటెతో నూనెలో ముంచినట్లయితే రెండు వైపులా సమంగా వేగుతాయి. వీటిని తెల్లగా ఉండగానే నూనెలో నుంచి తీసేయాలి. తీయడం ఆలస్యమైతే ఎరుపురంగులోకి మారిపోయి చేదు వస్తుంది. బియ్యం..సగ్గుబియ్యం వడియాలు కావలసినవి: బియ్యం – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు గ్లాసు పచ్చిమిర్చి – 2 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి తయారీ విధానం: బియ్యం, సగ్గుబియ్యాన్ని కడిగి మంచినీటిలో నానబెట్టాలి. ఆరు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసి, తగినంత నీటిని పోస్తూ, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. దోసెల పిండిలాగ మెత్తగా గరిటె జారుడుగా రుబ్బుకోవాలి. మరొక జార్లో పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పెద్ద పాత్రలో ఐదు గ్లాసుల నీటిని పోసి మరిగిన తర్వాత బియ్యప్పిండి మిశ్రమాన్ని పోసి గరిటెతో కలపాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి కలపాలి. మిశ్రమం బాగా దగ్గరయ్యి సంగటిలా ముద్దగా అవుతుంది. పాత్రను స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. పాలిథిన్ షీట్ మీద వడియాల్లాగ పెట్టాలి. ఈ వడియాలను స్పూన్‌తో పెట్టడం కుదరదు. చేత్తోనే పెట్టాలి. కాబట్టి వేడి తగ్గిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని పిండి కొద్దికొద్దిగా పడేటట్లు మునివేళ్లతో పేపర్ మీద పెట్టాలి. ఈ వడియాలు ఒక్కరోజులోనే ఎండిపోతాయి. ఉదయం పెడితే సాయంత్రానికి ఎండతాయి. వేళ్లతో కదిలించగానే పేపర్ మీద నుంచి ఊడి వచ్చేస్తాయి. లోపల కొద్దిపాటి పచ్చి ఉన్నప్పటికీ అదే రోజు వలిచి పేపర్ మీద ఆరబోసి రెండవ రోజు ఎండలో పెట్టాలి. ఈ వడియాలను వేయించేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. నూనె వేడెక్కిన తర్వాత వడియాలను నూనెలో వేసిన వెంటనే చిల్లుల గరిటెతో నూనెలో ముంచి కొద్ది సెకన్లపాటు ఉంచితే లోపల కూడా బాగా కాలి పువ్వులా విచ్చుకుంటాయి. రవ్వ వడియాలు కావలసినవి: బొంబాయి రవ్వ – కేజీ పచ్చిమిర్చి– పది జీలకర్ర: టేబుల్ స్పూన్ అల్లం – 50 గ్రాములు ఉప్పు– టేబుల్ స్పూన్ లేదా రుచిని బట్టి నీరు – 8 లీటర్లు సగ్గుబియ్యం – పావు కేజీ నూనె – వేయించడానికి తగినంత తయారీ విధానం: రవ్వను ఒక పాత్రలో వేసి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి మిక్సీ జార్లో వేయాలి, అందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి. పెద్ద పాత్రలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఆ తరవాత సగ్గుబియ్యాన్ని, నానబెట్టిన రవ్వను వేసి కలియబెట్టాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఒక నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి వడియాలు పెట్టాలి. మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని టీ స్పూన్‌తో ఒక్కో స్పూన్ మిశ్రమాన్ని వస్త్రం మీద వేయాలి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. మంచి ఎండల్లో ఒక రోజుకే ముప్పావు వంతు ఎండిపోతాయి. లోపల ఉన్న పచ్చి రెండవ రోజుకు ఎండిపోతుంది. ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన తరవాత ఒక రోజు ఎండబెట్టాలి. ఇలా తయారైన వడియాలు ఏడాదంతా నిల్వ ఉంటాయి. భోజనానికి పదిమినిషాల ముందు నూనెలో వేయించుకుంటే కరకరలాడే వడియాలు రెడీ. గమనిక: 1. వడియాల మిశ్రమం వేడి తగ్గిన తర్వాత పూర్తిగా చల్లారే లోపు వడియాలు పెట్టేయాలి. మరీ చల్లారితే మిశ్రమం గట్టి పడిపోయి స్పూన్‌తో తీసి వస్త్రం మీద పెట్టేటప్పుడు స్పూన్‌ను వదలకుండా ఇబ్బంది పెడుతుంది. 2. వడియాలు పెట్టడానికి నూలు వస్త్రం లేకపోతే పాలిథిన్ షీట్ మీద పెట్టవచ్చు. మినప్పప్పు వడియాలు కావలసినవి: చాయ మినప్పప్పు – అర కేజీ పచ్చిమిర్చి – 4 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ఇంగువ – పావు స్పూన్ నూనె – వేయించడానికి సరిపడినంత తయారీ విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి మంచినీటిలో నాలుగు గంటలసేపు నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి పప్పును వెట్గ్రైండర్లో రుబ్బాలి (మిక్సీలో గ్రైండ్ చేస్తే వడియం గట్టిగా వస్తుంది, రుచిగా ఉండదు). పప్పు మెదిగేలోపు అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేయాలి. మెత్తగా మెదిగిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే వడియాల మిశ్రమం రెడీ. నూలు వస్త్రాన్ని తడిపి దానిమీద వడియాల మిశ్రమాన్ని టీ స్పూన్‌తో పెట్టాలి. రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన వడియాలను మళ్లీ ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేయాలి. గమనిక: మినప వడియాలను వేయించేటప్పుడు ఒకింత జాగ్రత్త అవసరం. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడియాలను వేసి మంట మీడియంలోకి మార్చాలి. అప్పుడు వడియం లోపల కూడా చక్కగా సమంగా ఎర్రగా వేగుతుంది. మంట తగ్గించకపోతే... వడియం బయటి వైపు ఎర్రగా వేగినప్పటికీ లోపల పచ్చిదనం తగ్గదు. లోపల కూడా వేగేవరకు ఉంచితే వడియం అంచులు మాడిపోతాయి. మరో విషయం... ఈ వడియాలను వేయించి అలాగే తినవచ్చు, కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది. మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట. ‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు. తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు. ‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది. బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది. బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది. 50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు. రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055 -
ఇడ్లీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్‌కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్‌లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా?
పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా . డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్లో షేర్ చేసిన వివరాలు ►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. ► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. ► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. ► భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది. ► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ► కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. -
కాస్తైనా సిగ్గుపడు.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన జాంటీ రోడ్స్
తనను విమర్శించిన నెటిజన్‌కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడిన మీరు సిగ్గుపడాలంటూ చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నాటి నుంచి జాంటీ రోడ్స్ భారత పర్యటనలో ఉన్నాడు. ఇందులో భాగంగా ఈ లెజండరీ ఫీల్డర్.. గోవా, ఢిల్లీ, బెంగళూరులో పర్యటిస్తూ తన ప్రయాణానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినపుడు.. టాక్సీ డ్రైవర్ సలహా మేరకు రోడ్‌సైడ్ ఫుడ్ తిన్నానంటూ ‘ఎక్స్’ ట్వీట్ చేశాడు జాంటీ రోడ్స్. మంగళూరు బన్, మసాలా దోశ, ఛాయ్ రుచి అదిరిపోయిందంటూ బెంగళూరు రుచులపై రివ్యూ ఇస్తూ ఐ లవ్ ఇండియా అంటూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో జాంటీ రోడ్స్ భోజనం రుచి చూస్తుండగా.. పక్కనే కూర్చున్న వ్యక్తి గడ్డానికి చేతులు ఆనించుకుని.. అతడి వైపే తదేకంగా చూస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తిని టాక్సీ డ్రైవర్‌గా పొరబడ్డ ఓ ఎక్స్ యూజర్.. ‘‘మీ టాక్సీ డ్రైవర్ కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాల్సింది. సెలబ్రిటీ అయిన మీ స్థాయికి ఇది ఎంతమాత్రం తగదు’’ అంటూ జాంటీ రోడ్స్‌ను విమర్శించారు. ఇక రెండోరోజుల క్రితం నాటి తన పోస్ట్‌పై ఈ విధంగా స్పందించిన సదరు వ్యక్తికి జాంటీ రోడ్స్ దిమ్మతిరిగేలా కౌంటర్ వేశాడు. ‘‘టేబుల్ దగ్గర నా ఎదురుగా కూర్చున్న జెంటిల్‌మ్యాన్ ఎవరో నాకు తెలియదు. ఆ ఫొటోను మా డ్రైవర్ తీశాడు. నిజానికి తను ఏమీ తినాలనుకోలేదు. తనకిష్టమైన రెస్టారెంట్లో తనకిష్టమైన భోజనాన్ని రుచి చూడాలని నన్ను కోరాడు. నా కోసం తను ఫుడ్ ఆర్డర్ చేశాడు. తను కేవలం టీ మాత్రమే తాగాడు. నేను అతడి టీ బిల్లును చెల్లించాను. కాస్త సిగ్గుపడండి(#shameonyou)’’ అంటూ జాంటీ రోడ్స్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ అందుకున్న జట్టులో జాంటీ రోడ్స్ సభ్యుడు. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ(ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీగా చలామణిలో ఉంది)ని రోడ్స్ ముద్దాడాడు. I have been sitting on this reply for a couple of days. The gentleman at my table is a stranger to me, and my driver was taking the picture. He did not eat, just ordered for me some of his favourite food. He just had tea, and yes, I did pay for it #shameonyou https://t.co/JPXphe60I3 — Jonty Rhodes (@JontyRhodes8) November 24, 2023 -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
ఇండియన్ ఫుడ్‌కు భారీ డిమాండ్.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
జీ20 నేతలకు మెనూ సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు. ‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్‌కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు. ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్‌ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్‌కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు. -
భారతీయ వంటకాలపై మనసులో మాట చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విటర్ పోస్ట్ వైరల్
Elon Musk: భారతదేశం గొప్ప కట్టడాలకు, కళలకు మాత్రమే కాదు వంటకాల్లో కూడా గొప్ప ఖ్యాతి పొందింది. రాజులు పరిపాలన కాలంలోనే మన దేశాన్ని సందర్శించిన కొంత మంది విదేశీయ యాత్రికులు భారతీయులు భోజన ప్రియులని, అక్కడి వంటాకాలు అద్భుతంగా ఉంటాయని తమ గ్రంధాల్లో రాసినట్లు చరిత్రలో చదువుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 'కింగ్ చార్లెస్ 111'కి కూడా భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని ఒక సందర్భంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులలో ఒకడైన 'ఎలాన్ మస్క్' కూడా ఒప్పుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ రిప్లై.. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ ఫాలోవర్ ఒకరు మన దేశంలోని వంటకాలను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ చేసింది. ఇందులో భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని, బేసిక్ ఫుడ్స్ అంటే మరింత ఇష్టమని పేర్కొంది. దీనికి ఎలాన్ మస్క్ నిజమే అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటికే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్, 21,400కి పైగా లైక్‌లు & 1206 పైగా రీట్వీట్లు వచ్చాయి. (ఇదీ చదవండి: ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్ బంపరాఫర్) True — Elon Musk (@elonmusk) May 16, 2023 ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన వారిలో ఒకరు మస్క్ టేస్ట్ చాలా బాగుందని, ఇండియాకు వచ్చినప్పుడు భారతీయ వంటకాలు రుచి చూడాలని అన్నాడు. అంతే కాకుండా 28 రాష్ట్రాలలో ఉన్న వివిధ వంటకాలను రుచి చూడటమే కాకుండా విభిన్న సంస్కృతులు, విభిన్న ఆహారాలు, విభిన్న భాషలు, విభిన్న వ్యక్తులు ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు ఆనందించవచ్చంటూ కామెంట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఈ హాలీవుడ్ హీరోయిన్‌కి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమట..
Wonder Woman Gal Gadot Loves Indian Food: 'వండర్ వుమెన్' గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రేయాన్ రెనాల్డ్స్ కలిసి నటించిన 'రెడ్ నోటీస్' మూవీ సక్సెస్‌లో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని ఆనందిస్తున్న గాల్ గాడోట్ ఇటీవల తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పుకొచ్చింది. ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంకా ఆ వీడియోలో 'నాకు మసాల చికెన్ టిక్కా అంటే చాలా ఇష్టం. కానీ వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా చాలా చాలా ఇష్టం. పెరుగు కూడా ఇష్టమే. నేను భారీతీయ వంటకాలను ఇష్టపడతాను.' అని చెప్పింది. 'రెడ్ నోటీస్'ను ఇంతలా ఆదరించినందుకు సినిమా నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు. రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన 'రెడ్ నోటీస్' నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అలాగే నవంబర్ 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. 'రెడ్ నోటీస్' అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌ను పట్టుకోడానికి ఇంటర్‌పోల్ జారీ చేసే గ్లోబల్ హెచ్చరిక. మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ దొంగగా గాల్ గాడోట్ అద్భుతంగా నటించారు. డిస్నీ సంస్థలో రాబోయే లైవ్-యాక్షన్ అడాప్టేషన్ మూవీ 'స్నో వైట్'లో గాడోట్ ఈవిల్ క్వీన్‌గా నటించనుంది. బ్రదర్స్ గ్రిమ్ అద్భుత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నిజంగా మా అదృష్టం: తైవాన్ అధ్యక్షురాలు
తైపీ: భారతీయ వంటకాలంటే తమ ప్రజలకు ఎంతో ఇష్టమని, తాను కూడా అందుకు అతీతం కాదని తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్-వెన్ అన్నారు. భారత రెస్టారెంట్లు తమ దేశంలో ఉండటం నిజంగా అదృష్టం అంటూ కొనియాడారు. ఛాయ్ తాగినపుడు భారత్‌లో తనకు ఉన్న అందమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయంటూ అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘ఎన్నెన్నో ఇండియన్ రెస్టారెంట్లకు తైవాన్ నివాసంగా ఉండటం అదృష్టం. తైవాన్ ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడతారు. నేనైతే ఎల్లప్పుడూ చనా మసాలా, నాన్ తీసుకుంటాను. ఇక ఛాయ్ తాగితనప్పుడల్లా, ఇండియా ప్రయాణం తాలూకు విశేషాలన్నీ జ్ఞాపకం వస్తాయి. విభిన్నమైన, రంగులతో కూడిన దేశం’’ అని ట్వీట్ చేశారు. అంతేగాక.. ‘‘మీకిష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి?’’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఇక త్సాయి ఇంగ్- వెన్ ట్వీట్‌కు స్పందించిన భారత నెటిజన్లు.. ఆమెకు ధన్యవాదాలు చెబుతూనే, ఇండియన్ ఫుడ్ నచ్చనివారు ఎవరూ ఉండరు అంటూ తమ స్పందన తెలియజేస్తున్నారు. (చదవండి: తైవాన్ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్) అదే విధంగా, తైవాన్ ప్రజలు సైతం ప్రెసిడెంట్‌కు ఇష్టమైన భోజనం తమకు కూడా నచ్చుతుందని, వారానికి రెండుసార్లైనా ఇండియన్ రెస్టారెంట్లను సందర్శిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తైవాన్ నేషనల్ డే సందర్భంగా కూడా అత్యధిక సంఖ్యలో భారత ప్రజలు సోషల్ మీడియా వేదికగా త్సాయి ఇంగ్- వెన్, తైవాన్ పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక గత నాలుగేళ్లుగా చైనా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, తన ఉనికి చాటుకుంటున్న తైవాన్ ప్రభుత్వం, ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా అండతో విమర్శలకు పదునుపెడుతూ, డ్రాగన్ దేశానికి కంటిలో నలుసులా తయారైంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనాకు దీటుగా బదులిస్తున్న తైవాన్, అక్టోబరు 10న నేషనల్ డే సందర్భంగా డ్రాగన్‌తో ఉపయుక్తమైన చర్చలకు సిద్ధమని చెబుతూనే, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అటు అమెరికాతోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహ బంధాన్ని పెంపొందించుకుంటూ చైనాకు సవాల్ విసురుతోంది. #Taiwan is lucky to be home to many Indian restaurants, & Taiwanese people love them. I always go for chana masala and naan, while #chai always takes me back to my travels in #India, and memories of a vibrant, diverse & colourful country. What are your favourite Indian dishes? pic.twitter.com/IJbf5yZFLY — 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 15, 2020 -
హిందూ మీల్‌పై ఎమిరేట్స్ యూటర్న్..
దుబాయ్ : దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన విమానాల్లో హిందూ మీల్‌ను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిందూ భోజనాన్ని మెనూలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. హిందూ వినియోగదారుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఆప్షన్‌ను తాము కొనసాగించాలని నిర్ణయించినట్టు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ఉత్పత్తులు, సేవల సమీక్షలో భాగంగా హిందూ మీల్ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని హిందూ ప్రయాణీకులు ఇక శాకాహార, మాంసాహార వంటకాలను హిందూ మీల్లో భాగంగా ఎంచుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాకాహార ప్రయాణీకులు జైన్ మీల్, ఇండియన్ వెజిటేరియన్ మీల్, కోషల్ మీల్, నాన్ బీఫ్, నాన్ వెజిటేరియన్ ఆప్షన్లనూ ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. శాకాహారుల కోసం ఇండియన్ వెజిటేరియన్ మీల్‌ను అందిస్తుందని ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
మీ వంటకాలు మాకొద్దు..!
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ స్థానిక వంటకాలపై అసృంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వంటకాలు మేం తినలేమని, మాకు భారతీయ వంటకాలు కావాలని కోరడంతో దక్షిణాఫ్రికా బోర్డు భారతీయ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించే ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు ఇరు జట్లకు ఒకే క్యాటర్స్ ఆహారం అందించింది. అయతే కోహ్లి సేన భారతీయ ఫుడ్ ఇష్టపడటంతో ప్రిటోరియాలోని భారత్‌కు చెందిన గీత్ రెస్టారెంట్ నుంచి రుచికరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంది. ‘లోకల్ క్యాటర్ అందిస్తున్న ఫుడ్‌పై ఆటగాళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డు మా రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది. ఆటగాళ్లు మా ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. కేవలం భారత ఆటగాళ్ల, సిబ్బందికి మాత్రమే మా హోటల్ ఆహారాన్ని అందిస్తున్నాం’ అని రెస్టారెంట్ మేనేజర్ తెలిపారు. మిగతా వేడుకల్లో స్థానిక చెఫ్‌లను కాకుండా భారతీయ చెఫ్‌లను ఉపయోగిస్తున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు దక్షిణాపర్యటనుకు వెళ్లిన కోహ్లి సేన.. టెస్ట్ సిరీస్ 2-1తో కోల్పోయి వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల్లో భాగంగా నేడు తొలి టీ20 జరగనుంది. -
ఆయిల్ వద్దంటే అనర్థమే!
సాక్షి, హైదరాబాద్: ‘నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యకరం’ అని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అన్నారు. ‘ప్రతీ మనిషికి సాధారణం గా రోజుకు 2 వేల కేలరీలు కావాలి. కష్టపడి పని చేసే వారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అందులో 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి. అంటే 50 నుంచి 65 గ్రాము ల వరకు ఫ్యాట్స్ అవసరం’అని తెలిపారు. శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌బీఎన్ ప్రసాద్.. నూనెలు వాడటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సమాన నిష్పత్తిలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఆయిల్స్‌లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడు సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసిం ది. ఈ నిష్పత్తిలో బ్యాలెన్స్ తప్పితే అనారోగ్య సమస్యలు ముంచెత్తుతాయి. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని నూనెల ద్వారానే తీసుకోవాలి. ఇవి ఎక్కువున్నా, తక్కువున్నా సమస్యలే. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుం డాలి. ఒమెగా–3 ఆమ్లాలు.. కేవలం సోయాబీన్, ఆవ నూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉం టాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. ఒమెగా–3 ఉన్న నూనెలను వాడని వారు తప్పనిసరిగా వేయించిన అవిసె గింజలు రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి కూడా ఒమెగా–3 లభిస్తుంది. ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 75 శాతం ఉంటాయి. ఇక సన్ ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఆ నూనెలు అత్యంత ప్రమాదకరం జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి తయారు చేసే నూనెలు అత్యంత ప్రమాదకరం. వాటిలో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. తినుబండారాలు తయారు చేసే కేంద్రాల్లో ఉపయోగించే అవకాశముంది. తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి వ్యాపారస్తులు వారికి అంటగడుతుంటారు. వృక్షాల నుంచి తయారయ్యే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక నూనెలను పలుమార్లు వాడకూడదు. ఎక్కువ సార్లు వేడి చేసినప్పుడు పెరా క్సైడ్ వంటి విష పదార్థాలు తయారవుతాయి. విడిగా కొనవద్దు.. - ఆయిల్‌ను విడిగా కొనవద్దు. ప్యాకింగ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు అనిపిస్తే.. బ్రాండెడ్ నూనెలైనా సరే కొనకూడదు. - ప్యాకింగ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. - న్యూట్రీషియన్ సమాచారం, ప్రమాణాల ప్రకారం 3 ఫ్యాటీ ఆమ్లాల సమాన నిష్పత్తి ఆధారంగానే నూనెలను ఎంపిక చేసుకోవాలి. - గుండెకు మేలు జరుగుతుందంటూ ప్యాకింగ్‌లపై రాస్తారు. అయితే సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకుని మాత్రమే కొనాలి. అనుమానమొస్తే ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. - పత్తి గింజల నుంచి నూనె తీస్తుంటారు. పత్తి పంటలో రసాయనాలు కలుపుతుండటం వల్ల నూనె కూడా విషంగా మారుతుందని అనుకోవడం అశాస్త్రీయం. రిఫైనింగ్‌లో అంతా సవ్యంగానే ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు రిఫైనింగ్‌ను సరిగానే చేస్తుంటాయి. మహారాష్ట్రలో పత్తి నూనెను అధికంగా వాడతారు. -
‘నవ’ ధాన్యాలు
1. గోధుమలు: పలు పాశ్చాత్య దేశాలతో పాటు ఉత్తర భారతీయుల ఆహారంలో ప్రధానమైనవి గోధుమలే. వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. బీ కాంప్లెక్స్‌లో బి-12 మినహా మిగిలిన విటమిన్లు, విటమిన్-ఈ, విటమిన్-కేతో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. 2. వరి: పలు తూర్పు దేశాలతో పాటు దక్షిణ భారతీయులు వరి ధాన్యం నుంచి వేరు చేసిన బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. వరిలో రకరకాల వంగడాలు ఉన్నా, వాటిలోని పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. బియ్యంలో దాదాపు 80 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్లు, కొవ్వులు, బి1, బి2, బి3, బి5, బి6 విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. 3. కందులు: కందులను దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు. ఎక్కువగా పొట్టు తీసేసి పప్పుగా మార్చి వినియోగిస్తారు. కందులలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బి1, బి2, బి3, బి5, బి6, బి9 సీ, ఈ, కే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 4. పెసలు: పెసలను కూడా అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. పొట్టుతీయని గింజలను నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినడంతో పాటు పొట్టుతీసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. పెసలలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 5. శనగలు: పెసల మాదిరిగానే శనగలను కూడా నానబెట్టి మొలకెత్తిన తర్వాత నేరుగా తినడంతో పాటు పొట్టుతీసేసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. శనగల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగాను, కొవ్వులు నామమాత్రంగాను ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 6. బొబ్బర్లు: కందులు, పెసలు, శనగల మాదిరిగా బొబ్బర్లను అంత విరివిగా వాడకపోయినా, మన దేశంలో వీటిని తరచుగానే ఉపయోగిస్తారు. బొబ్బర్లను నానబెట్టి ఉడికించి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బొబ్బర్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. 7. నువ్వులు: నువ్వులు ప్రధానంగా నూనెగింజల జాతికి చెందుతాయి. నువ్వులను, నువ్వుల నూనెను కూడా మన దేశంలో విరివిగా వినియోగిస్తారు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వులలో ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 8. మినుములు: మినుముల వాడుక మన దేశంలో పురాతన కాలం నుంచి ఉంది. మినుములను లేదా పొట్టుతీసిన మినప్పప్పును నానబెట్టి వివిధ రకాల అల్పాహార వంటకాలకు ఉపయోగిస్తారు. మినప్పుప్పును పిండిగా చేసి అప్పడాలు, సున్నుండలు వంటివి తయారు చేస్తారు. మినుముల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 9. ఉలవలు: ఉలవల వాడకం మన దేశంలో పురాతన కాలం నుంచే ఉన్నా, మిగిలిన పప్పుధాన్యాలతో పోలిస్తే వీటి వాడుక చాలా తక్కువ. ఉలవల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బి1, బి2, బి3, బి5, బి6, బి9 విటమిన్లతో పాటు విటమిన్-సీ, విటమిన్-ఈ, విటమిన్-కే వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఉలవలను నానబెట్టి నేరుగా తింటే, మధుమేహం అదుపులోకి వస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది. ఉషశ్రీ సీనియర్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పిల్లల కోసం ‘నవ’ సూచనలు 1 ఐదేళ్ల వయసొచ్చే వరకు తలిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా చూడాలి 2 ఐదేళ్లు వచ్చాక వారికి మంచి, చెడు చెప్పే ప్రయత్నం చేయాలి. నయానా భయానా దారికి తెచ్చుకోవాలి. వారి మంచిలోనూ, చెడులోనూ అన్ని సందర్భాలలోనూ వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించాలి 3 వారిని విమర్శించడం, వ్యాఖ్యానించడం, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చడం చేయకూడదు 4 పిల్లల శారీరక, మానసిక స్థితిగతులను బట్టి పెద్దయ్యాక వారు ఏమి కావాలన్న దానిపై ఒక ఆలోచన చేయాలి కానీ ముందు నుంచే వారిపై ఆశలు పెట్టుకుని, మోయలేనంత భారం మోపకూడదు 5 శారీరకంగా బలంగా అంటే బొద్దుగా, ముద్దుగా ఉన్నారు కదా అని మురిసిపోకూడదు. మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడాలి. 6 భార్యాభర్తల కీచులాటలు, అత్తాకోడళ్ల తగవులు, ఇరుగుపొరుగుతో కయ్యాలు వంటివి లేకుండా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. 7 ఎప్పుడూ చదువు.. చదువు.. అని వారిని సాధించకుండా, వారికి నైతికవిలువలను, నీతినిజాయితీలను ప్రబోధించే కథలు చెబుతుండాలి. నిజాయితీగా ఉన్నందుకు చిన్న చిన్న బహుమతులిచ్చి ప్రోత్సహించాలి 8 క్రమశిక్షణ పేరుతో వారిని తీవ్రంగా మందలించడం, మీతో మాట్లాడాలంటేనే భయపడేలా చేయకూడదు. అలాగని అతి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకూడదు. క్రమశిక్షణకు క్రమశిక్షణే, చనువు చనువే అన్నట్లు వ్యవహరించాలి 9 చివరగా ఒక్క మాట.. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వండి. అవసరమైతే వారి ఆలోచనలను, అభిప్రాయాలను సరిదిద్దుతూ, సూచనలు, సలహాలు ఇస్తుండండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నొస్టిక్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఇండియన్ ఫుడ్.. ఢిల్లీ కంటే లండనే బెటర్
లండన్: 'బి ఏ రోమన్ ఇన్ రోమ్' అనే సామెత ఆధునిక కాలంలో చాలాసార్లు తిరగబడుతుంది. ప్రపంచం కుగ్రామమైనవేళ ఏ మూలకు వెళ్లిన తమవైన రుచులు ఆస్వాదించగలిగే వీలుండటం అందరికీ అనుభవమే. కానీ ఆ స్థాయిని మించి.. అంటే ఆయా దేశాల విశేష వంటకాలు మాతృభూమిలో కంటే మిన్నగా వండివార్చడంలో కొన్ని నగరాలది అందెవేసిన చేయి. అలాంటిదే ఇంగ్లాండ్ రాజధాని లండన్. 'ప్రపంచ పాకశాస్త్ర రాజధాని'గా ఇప్పటికే తనకున్న పేరును మరిత ఇనుమడింపజేసుకుంటున్నది ఆ నగరం. భారతీయ వంటకాల విషయంలో రాజధాని ఢిల్లీ నగరంలో లభించేవాటికన్నా డెలీషియస్, వెరైటీ డిష్‌లను సర్వ్ చేస్తున్నది లండన్ నగరం. బీబీసీ ఛానెల్ 'సండే కిచెన్' హోస్ట్ వివేక సింగ్ ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నారు. 'పదార్థం తాయారీ కోసం చేసే ప్రయోగాలు కానివ్వండి, నాణ్యత, రుచి విషయంలో కానివ్వండి.. ఇండియన్ ఫుడ్ ఢిల్లీ నగరంలో కంటే లండన్‌లోనే బెటర్‌గా ఉంటుంది' అంటున్నారాయన. ప్రస్తుతం ప్రఖ్యాత సినెమెన్ క్లబ్, సినెమెన్ కిచెన్, సోషోల్లో ప్రధాన చెఫ్ గా సేవలందిస్తున్న వివేక్ పక్కా ఎన్నారై. -
భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!
కోల్‌కతా: భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు తాజా ఎడిషన్ అద్దం పట్టింది. సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఈ నిఘంటువు తొమ్మిదో ఎడిషన్‌లో 'కైమా', 'పాపడ్', 'కర్రీ లీఫ్'(కరివేపాకు) తదితర పదాలకు చోటు దక్కింది. ఈసారి రికార్డు స్థాయిలో 240కిపైగా భారతీయ ఇంగ్లిష్ పదాలు చేరాయి. వీటిలో 60 హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి. భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండడంతో వాటికి సంబంధించిన పదాలు చేర్చామని ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యావేత్త ప్యాట్రిక్ వైట్ చెప్పారు. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ప్రస్తుతం వెయ్యి భారతీయ పదాలు ఉన్నాయి.