ఇండియన్ ఫుడ్.. ఢిల్లీ కంటే లండనే బెటర్
లండన్: 'బి ఏ రోమన్ ఇన్ రోమ్' అనే సామెత ఆధునిక కాలంలో చాలాసార్లు తిరగబడుతుంది. ప్రపంచం కుగ్రామమైనవేళ ఏ మూలకు వెళ్లిన తమవైన రుచులు ఆస్వాదించగలిగే వీలుండటం అందరికీ అనుభవమే.
కానీ ఆ స్థాయిని మించి.. అంటే ఆయా దేశాల విశేష వంటకాలు మాతృభూమిలో కంటే మిన్నగా వండివార్చడంలో కొన్ని నగరాలది అందెవేసిన చేయి. అలాంటిదే ఇంగ్లాండ్ రాజధాని లండన్. 'ప్రపంచ పాకశాస్త్ర రాజధాని'గా ఇప్పటికే తనకున్న పేరును మరిత ఇనుమడింపజేసుకుంటున్నది ఆ నగరం.
భారతీయ వంటకాల విషయంలో రాజధాని ఢిల్లీ నగరంలో లభించేవాటికన్నా డెలీషియస్, వెరైటీ డిష్లను సర్వ్ చేస్తున్నది లండన్ నగరం. బీబీసీ ఛానెల్ 'సండే కిచెన్' హోస్ట్ వివేక సింగ్ ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నారు.
'పదార్థం తాయారీ కోసం చేసే ప్రయోగాలు కానివ్వండి, నాణ్యత, రుచి విషయంలో కానివ్వండి.. ఇండియన్ ఫుడ్ ఢిల్లీ నగరంలో కంటే లండన్లోనే బెటర్గా ఉంటుంది' అంటున్నారాయన. ప్రస్తుతం ప్రఖ్యాత సినెమెన్ క్లబ్, సినెమెన్ కిచెన్, సోషోల్లో ప్రధాన చెఫ్ గా సేవలందిస్తున్న వివేక్ పక్కా ఎన్నారై.