మీ వంటకాలు మాకొద్దు..! | South African chef removed as Virat Kohli and co demand Indian food | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 12:12 PM | Last Updated on Sun, Feb 18 2018 12:12 PM

South African chef removed as Virat Kohli and co demand Indian food - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ స్థానిక వంటకాలపై అసృంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వంటకాలు మేం తినలేమని, మాకు భారతీయ వంటకాలు కావాలని కోరడంతో దక్షిణాఫ్రికా బోర్డు భారతీయ రెస్టారెంట్‌ నుంచి ఫుడ్‌ తెప్పించే ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు ఇరు జట్లకు ఒకే క్యాటర్స్‌ ఆహారం అందించింది. అయతే కోహ్లి సేన భారతీయ ఫుడ్‌ ఇష్టపడటంతో ప్రిటోరియాలోని భారత్‌కు చెందిన గీత్‌ రెస్టారెంట్‌ నుంచి రుచికరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంది.

‘లోకల్‌ క్యాటర్‌ అందిస్తున్న ఫుడ్‌పై ఆటగాళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డు మా రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది. ఆటగాళ్లు మా ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. కేవలం భారత ఆటగాళ్ల, సిబ్బందికి మాత్రమే మా హోటల్‌ ఆహారాన్ని అందిస్తున్నాం’ అని రెస్టారెంట్‌ మేనేజర్‌ తెలిపారు. మిగతా వేడుకల్లో స్థానిక చెఫ్‌లను కాకుండా భారతీయ చెఫ్‌లను ఉపయోగిస్తున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌  స్పష్టం చేసింది.

ఇక మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు దక్షిణాపర్యటనుకు వెళ్లిన కోహ్లి సేన.. టెస్ట్‌ సిరీస్ ‌2-1తో కోల్పోయి వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల్లో భాగంగా నేడు తొలి టీ20 జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement