South Africa Cricket Board
-
Ind vs SA: అతడు పట్టిందల్లా బంగారమే!.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 73 కోట్లు!
టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.అదొక్కటి సానుకూలాంశంఅయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం. మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్‌వాష్‌కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.ఒక్కో మ్యాచ్‌తో రూ. 73 కోట్లు! నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్‌లతో భారత టీమ్‌ను ఎంపిక చేశారు.టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది! ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్‌బర్గ్- రాత్రి గం.8:30లకుజట్లుసౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.భారత్‌అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ.ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్‌లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది. -
న్యూజిలాండ్‌కు ఇది అవమానమే.. ఆఖరికి పాక్ కూడా అలాగే: స్టీవ్ వా
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరును ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా తప్పుబట్టాడు. జాతీయ జట్టు కంటే వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువైపోయిందంటూ మండిపడ్డాడు. తనే గనుక న్యూజిలాండ్ క్రికెట్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా జట్టు యాజమాన్యానికి తగిన విధంగా బుద్ధి చెప్పేవాడినంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోని 14 మంది సభ్యుల్లో దాదాపు అందరూ కొత్త వారే. కెప్టెన్ నీల్ బ్రాండ్ కూడా పెద్దగా పరిచయం లేని పేరు. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు అనామక ఆటగాళ్లను కివీస్ పర్యటనకు పంపేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి సహా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌కు చరమగీతం పాడేలా చర్యలకు పూనుకుంటున్న సౌతాఫ్రికా క్రికెట్‌ను హెచ్చరించాల్సిన అవసరం మీకు లేదా అంటూ ప్రశ్నించాడు. ‘‘సౌతాఫ్రికాకు టెస్టు గురించి పట్టదు. భవిష్యత్తులో తమ ఆటగాళ్లు కేవలం సొంతగడ్డపై జరిగే లీగ్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ నేనే గనుక న్యూజిలాండ్ స్థానంలో ఉండి ఉంటే.. ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడిని. అసలు కివీస్ జట్టు ఈ అనామక టీమ్‌తో ఆడేందుకు ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. టెస్టు క్రికెట్ అంతం కాబోతోందనడానికి ఇలాంటివి సంకేతాలు. ఐసీసీతో పాటు ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఏం చేస్తున్నాయి? వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలి. చరిత్ర, సంప్రదాయానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా? కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే.. సర్ డాన్ బ్రాడ్‌మన్, గ్రేస్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ వంటి దిగ్గజాల లెగసీని కొనసాగించేవారెవరు? టెస్టు క్రికెట్ ఫీజుల విషయంలో ఆయా బోర్డులు ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. అందుకే చాలా మంది ఆటగాల్లు టీ10, టీ20 లీగ్‌ల వైపు చూస్తున్నారు’’ అని సిడ్నీ హెరాల్డ్‌తో స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ.. అనామక జట్లను విదేశీ పర్యటనలకు పంపిస్తున్నాయని స్టీవ్ వా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా జాతీయ జట్టు టూర్లపై ప్రభావం పడటం ఇది రెండోసారి. గతేడాది టీ20 లీగ్ కారణంగా తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు చేసుకోవాలని భావించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు లేకుండానే సిరీస్‌ను ముగించేసింది. ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బాక్సిండే టెస్టులో భారత జట్టును చిత్తు చేసిన ప్రొటిస్ బుధవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్‌లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ -
వన్డే కెప్టెన్‌గా మార్క్రమ్
జొహన్నెస్‌బర్గ్: భారత్‌తో సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో జరిగే సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌కు సారథిగా వ్యవహరించిన తెంబా బవుమా, పేసర్ కగిసో రబాడలకు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కలి్పంచింది. దాంతో ప్రస్తుతం టి20 టీమ్ కెప్టెన్‌గా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. తొలి రెండు టి20లకు మాత్రమే అందుబాటులో ఉండే కొయెట్జీ, జాన్సెన్, ఎన్గిడిలతో పాటు బవుమా, రబాడ టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సఫారీ బోర్డు వెల్లడించింది. డేవిడ్ బెడింగమ్, ట్రిస్టన్ స్టబ్స్, నాండ్ర్ బర్జర్కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం లభించగా... కీపర్ కైల్ వెరీన్, పేసర్ ఎన్గిడి టెస్టుల్లో పునరాగమనం చేశారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. దక్షిణాఫ్రికా జట్లు: టి20: మార్క్రమ్ (కెప్టెన్), హెన్డ్రిక్స్, బ్రీజ్కే, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, బర్జర్, జాన్సెన్, కొయెట్జీ, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్, ఎన్గిడి. వన్డే: మార్క్రమ్ (కెప్టెన్), జోర్జి, హెన్డ్రిక్స్, వాన్‌డర్ డసెన్, వెరీన్, క్లాసెన్, మిల్లర్, బర్జర్, ముల్డర్, ఎంపొంగ్వానా, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్. టెస్టు: బవుమా (కెప్టెన్), బెడింగమ్, బర్జర్, కొయెట్జీ, జోర్జి, ఎల్గర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, ముల్డర్, ఎన్గిడి, పీటర్సన్, రబాడ, స్టబ్స్, వెరీన్. -
T20 WC 2022: జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. గాయంతో స్టార్ బ్యాటర్ దూరం
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టును టెంబా బవుమా నడిపించనుండగా.. గాయంతో స్టార్ ఆటగాడు వాండర్ డుసెన్ దూరమయ్యాడు. డుసెన్ దూరమయినప్పటికి పించ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబర్న్ జట్టులోకి రాగా.. క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రూపంలో నాణ్యమైన బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబడా,అన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి, కేశవ్ మహరాజ్, తబ్రెయిజ్ షంసీ ఉండగా.. వీరితో పాటు డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, రిలీ రోసౌలు కూడా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్ ప్లేయర్స్‌గా మార్కో జాన్సెన్, జోర్న్ ఫోర్టున్, పెక్యుల్వాయోలు ఉన్నారను. కాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన మూడో జట్టుగా ప్రొటిస్ నిలిచింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఇక సూపర్ 12కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లలో సౌతాఫ్రికా కూడా ఉంది. ఇక గ్రూఫ్-2లో ఉన్న సౌతాఫ్రికా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ దశలో మ్యాచ్‌లు ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, రిలీ రోసౌ, డి ప్రిటోరియస్, డబ్ల్యు పార్నెల్, తబ్రెయిజ్ షమ్సీ, కేశవ్ మహారాజ్ రిజర్వ్: బ్జోర్న్ ఫార్టుయిన్, మార్కో జాన్సెన్ మరియు ఆండిలే ఫెహ్లుక్వాయో PROTEAS WORLD CUP SQUAD 🇿🇦 1⃣5⃣ players 🧢 World Cup debut for Tristan Stubbs 🤕 Rassie van der Dussen misses out due to injury#BePartOfIt #T20WorldCup pic.twitter.com/0Pzxm4uDQJ — Cricket South Africa (@OfficialCSA) September 6, 2022 -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్ట్ క్రికెటర్ మృతి
డర్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్టు క్రికెటర్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాన్ వాట్కిన్స్ (98) మృతి చెందారు. ఆయన కరోనాతో మరణించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 1949లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాన్ వాట్కిన్స్ 15 టెస్టులు ఆడారు. తన కెరీర్లో 679 పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా... 1952-53 మధ్యకాలంలో ఆస్ట్రేలియా పర్యటనలో కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు సాధించారు. ఈ సిరీస్‌లో జాన్ వాట్కిన్స్ 408 పరుగులు, 16 వికెట్లు తీశారు. కాగా వాట్కిన్స్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం -
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మూకుమ్మడి రాజీనామా
జొహన్నెస్‌బర్గ్: గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ)లో చోటు చేసుకున్న వివాదాల కారణంగా 10 మంది క్రికెట్ బోర్డు డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తాత్కాలిక పరిపాలన విభాగానికి ఎటువంటి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండటం కోసమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లు రాజీనామాకు పూనుకున్నారు. ఇటీవల సీఎస్ఏపై ఆ దేశపు స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్, ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్సీఓసీ) విచారణకు రంగం సిద్ధం చేసింది. బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన అరోపణలపై ఎస్ఏఎస్సీఓసీ విచారణ చేపట్టింది. నల్లజాతీయులపై వివక్ష, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం.. సఫారీ బోర్డును రద్దు చేసింది. (వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం నిజమయ్యేనా?) దాంతో సీఎస్ఏ అధికారులెవరూ రోజువారీ కార్యకలాపాల్లో తలదూర్చడానికి వీలులేదు. సీఎస్ఏ మాజీ సీఈఓ తబంగ్ మోన్రో గత నెల క్రికెట్ బోర్డు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫొరెన్సిక్ నివేదికలు కూడా ఇవే ధ్రువీకరిస్తున్నాయని మండిపడ్డారు. తదనంతర పరిణామాలతో బోర్డు తాత్కాలిక సీఈఓ జాక్వెస్ ఫాల్, అధ్యక్షుడు క్రిస్ నెంజానిలు రాజీనామా చేశారు. తాజాగా మొత్తం బోర్డులోని అధికారులంతా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం సమావేశం అనంతరం తాత్కాలిక బోర్డు అధ్యక్షుడు బెరెస్ఫోర్డ్ విలియమ్స్‌తో పాటు ఆరుగురు రాజీనామాలు సమర్పించారు. అంతకుముందు నలుగురు సభ్యులు రాజీనామాలు చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రయోజనాల లక్ష్యంగా తాము రాజీనామాల నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎస్ఏ ఒక ట్వీట్లో పేర్కొంది. బోర్డు సభ్యుల రాజీనామాలను తమకు అందిన విషయాన్ని సభ్యుల కౌన్సిల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక పరిణామాల కారణంగా రద్దైన బోర్డు స్థానంలో తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేయనున్నారు. -
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ల రాజీనామా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం పది మంది డైరెక్టర్లు ఉండగా... ఆరుగురు సభ్యులు ఆదివారమే సీఎస్ఏ నుంచి వైదొలగగా... మిగిలిన నలుగురు సోమవారం తప్పుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్ఏ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గతంలో బోర్డుపై అవినీతి, జాతి వివక్ష, పరిపాల దుర్వినియోగం, ఆటగాళ్ల జీతాల చెల్లింపుల్లో అవకతవకలు వంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆ దేశపు క్రీడా మంత్రి నాతి మెథ్వా స్వయంగా రంగంలోకి దిగారు. అయితే బోర్డు డైరెక్టర్ల నుంచి çసహకారం అందకపోవడంతో ఆగ్రహించిన మెథ్వా... తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా ఈ నెల 27లోపు వాదనలు వినిపించాలని సీఎస్ఏ డైరెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా బోర్డును రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దాంతో ఆదివారం సమావేశమైన సీఎస్ఏ డైరెక్టర్లు... తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి రిహాన్ రిచర్డ్స్‌ను నియమించిన దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫడరేషన్, ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్సీఓసీ)... త్వరలోనే సీఎస్ఏ స్థానంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమిస్తామని ప్రకటించింది. -
సఫారీ క్రికెట్ బోర్డుపై విచారణ
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)పై ఆ దేశపు స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్, ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్సీఓసీ) విచారణ జరపనుంది. బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన అరోపణలపై విచారణ చేపట్టామని ఎస్ఏఎస్సీఓసీ తెలిపింది. నల్లజాతీయులపై వివక్ష, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం సఫారీ బోర్డును గురువారం రద్దు చేసింది. దీంతో ఇప్పుడు సీఎస్ఏ అధికారులెవరూ రోజువారీ కార్యకలాపాల్లో తలదూర్చడానికి వీలులేదు. సీఎస్ఏ మాజీ సీఈఓ తబంగ్ మోన్రో గత నెల క్రికెట్ బోర్డు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫొరెన్సిక్ నివేదికలు కూడా ఇవే ధ్రువీకరిస్తున్నాయని మండిపడ్డారు. తదనంతర పరిణామాలతో బోర్డు తాత్కాలిక సీఈఓ జాక్వెస్ ఫాల్, అధ్యక్షుడు క్రిస్ నెంజానిలు రాజీనామా చేశారు. మేటి ఆటగాళ్లు కూడా సీఎస్ఏ పనితీరుపై విమర్శలు చేశారు. ఈ నెల 5న జరగాల్సిన సీఎస్ఏ సర్వసభ్య సమావేశం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని ఆటగాళ్లు తప్పుబట్టారు. -
డివిలియర్స్ జట్టుకు స్వర్ణం
సెంచూరియన్: విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సారథ్యంలోని జట్టు మిగతా రెండు ప్రత్యర్థి జట్లను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది... క్రికెట్లో ఈ తరహా ఫలితం గురించి విని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే. కరోనా దెబ్బ తర్వాత ఎలాగైనా క్రికెట్‌ను మొదలు పెట్టేందుకు దక్షిణాఫ్రికా బోర్డు తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్ 3టీమ్ క్రికెట్ (3టీసీ) సాలిడారిటీ కప్ మ్యాచ్ ఫలితం ఇది. ‘నెల్సన్ మండేలా డే’ అయిన శనివారం ఈ టోర్నీ జరిగింది. డివిలియర్స్ నాయకత్వంలో ‘ఈగల్స్’, తెంబా బవుమా సారథిగా ఉన్న ‘కైట్స్’, రీజా హెన్డ్రిక్స్ కెప్టెన్సీ చేసిన ‘కింగ్‌ఫిషర్స్’ జట్లు బరిలోకి దిగాయి. నిబంధనల ప్రకారం ప్రతీ జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లే ఉంటారు. మూడు జట్లు కలిపి ఒకే సారి 36 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తలపడతాయి. రెండు భాగాలుగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఒక్కో జట్టు 6 + 6 ఓవర్ల చొప్పున 12 ఓవర్లు ఆడుతుంది. ప్రతీ జట్టు తొలి భాగంలో ఒక ప్రత్యర్థిని, రెండో భాగంలో మరో పత్య్రర్థిని ఎదుర్కొంటుంది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్దనే నిలబడతారు. చివరకు ఒక్కో జట్టు చేసిన మొత్తం పరుగులను బట్టి విజేతను నిర్ణయిస్తారు. డివిలియర్స్ ‘ఈగల్స్’ టీమ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి స్వర్ణం గెలుచుకుంది. డివిలియర్స్ తనదైన శైలిలో చెలరేగి 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 3 వికెట్లకు 138 పరుగులు సాధించిన కైట్స్‌కు రజతం, 5 వికెట్లకు 113 పరుగులు చేసిన కింగ్ ఫిషర్స్‌కు కాంస్య లభించాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా (సుమారు 82 వేలు) ఉన్న గాటెంగ్ ప్రావిన్స్‌లో ప్రజల కు భరోసా కల్పించే ఉద్దేశంలో అక్కడే మ్యాచ్ ను నిర్వహించారు. -
మీ వంటకాలు మాకొద్దు..!
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ స్థానిక వంటకాలపై అసృంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వంటకాలు మేం తినలేమని, మాకు భారతీయ వంటకాలు కావాలని కోరడంతో దక్షిణాఫ్రికా బోర్డు భారతీయ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించే ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు ఇరు జట్లకు ఒకే క్యాటర్స్ ఆహారం అందించింది. అయతే కోహ్లి సేన భారతీయ ఫుడ్ ఇష్టపడటంతో ప్రిటోరియాలోని భారత్‌కు చెందిన గీత్ రెస్టారెంట్ నుంచి రుచికరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంది. ‘లోకల్ క్యాటర్ అందిస్తున్న ఫుడ్‌పై ఆటగాళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డు మా రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది. ఆటగాళ్లు మా ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. కేవలం భారత ఆటగాళ్ల, సిబ్బందికి మాత్రమే మా హోటల్ ఆహారాన్ని అందిస్తున్నాం’ అని రెస్టారెంట్ మేనేజర్ తెలిపారు. మిగతా వేడుకల్లో స్థానిక చెఫ్‌లను కాకుండా భారతీయ చెఫ్‌లను ఉపయోగిస్తున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు దక్షిణాపర్యటనుకు వెళ్లిన కోహ్లి సేన.. టెస్ట్ సిరీస్ 2-1తో కోల్పోయి వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల్లో భాగంగా నేడు తొలి టీ20 జరగనుంది. -
విజ్ఞప్తి + హెచ్చరిక
బీసీసీఐకి లేఖ రాసిన దక్షిణాఫ్రికా బోర్డు ముంబై: రాబోయే డిసెంబర్లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించడంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ), బీసీసీఐకి లేఖ రాసింది. బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని ఉద్దేశించి రాసిన ఈ లేఖలో డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ఆడే విధంగా భారత్ తమ పర్యటనను ఖరారు చేయాలని సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ కోరారు. అయితే ఈ విజ్ఞప్తికి మరో హెచ్చరికను కూడా సీఎస్ఏ జోడించింది. ఈ సిరీస్‌లో పాల్గొంటేనే వచ్చే ఐపీఎల్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను అనుమతి ఇస్తామన్నట్లుగా కూడా పరోక్షంగా హెచ్చరించింది. అయితే దీనిని జోహ్రి తేలిగ్గా కొట్టి పారేశారు. లేఖ తమకు అందిందని నిర్ధారించిన ఆయన సరైన సమయంలోనే దానికి స్పందిస్తామన్నారు. ‘మేం దానిని అసలు పట్టించుకోం. ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మేం భావించడం లేదు. మే 8 వరకే ఈ ఐపీఎల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటారనేది అందరికీ తెలుసు. వాళ్లంతా వెళ్లిపోయారు. ఈ సమయంలో రచ్చ అనవసరం’ అని జోహ్రి వ్యాఖ్యానించారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ పాల్గొనే సిరీస్‌ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సీఎస్ఏ కోరుతున్న సిరీస్ ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడాల్సి ఉండగా... ఆ జట్టు స్థానంలో న్యూజిలాండ్ భారత పర్యటనకు రావచ్చు. -
భారత్ టూర్‌ను కుదిస్తే... దక్షిణాఫ్రికాకు రూ.200 కోట్లు నష్టం!
జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా రద్దు చేసుకోకున్నా ఈ పర్యటనను కుదించుకునే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఇదే జరిగితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) రోజుకు 2.5 మిలియన్ ర్యాండ్ (రూ.కోటీ 65 లక్షలు)లు నష్టపోతుందని స్థానిక బీల్డ్ అనే పత్రిక పేర్కొంది. ఓవరాల్‌గా 300 మిలియన్ ర్యాండ్ (దాదాపు రూ.200 కోట్లు)ల ఆదాయం కోల్పోయినట్టేనని, ఇది ప్రధానంగా టీవీ రైట్స్ రూపంలో ఉంటుందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని సఫారీ బోర్డు కోర్టులో తేల్చుకోలేని పరిస్థితి ఉందని, ఎందుకంటే ఐసీసీ ఎఫ్‌టీపీపై భారత్ ఇంకా సంతకం చేయలేదని చెప్పింది. భారత్ ఇక్కడ మూడు టెస్టులు, ఏడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడుతుందని బీసీసీఐతో సంప్రదించకుండానే సీఎస్ఏ గతంలో ప్రకటించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న భారత బోర్డు విండీస్, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లను ప్రకటిస్తూ దక్షిణాఫ్రికా పర్యటనపై సందేహాస్పదంగా వ్యవహరిస్తోంది.