డర్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్టు క్రికెటర్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాన్ వాట్కిన్స్ (98) మృతి చెందారు. ఆయన కరోనాతో మరణించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 1949లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జాన్ వాట్కిన్స్ 15 టెస్టులు ఆడారు. తన కెరీర్‌లో 679 పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టారు.
అదే విధంగా... 1952-53 మధ్యకాలంలో ఆస్ట్రేలియా పర్యటనలో కెరీర్‌లో అత్యత్తుమ గణాంకాలు సాధించారు. ఈ సిరీస్‌లో జాన్ వాట్కిన్స్ 408 పరుగులు, 16 వికెట్లు తీశారు. కాగా వాట్కిన్స్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment