మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది.
శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్‌లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్‌లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్‌కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్‌లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment