
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో కాస‍్త రిలాక్స్ అయ్యారు.
పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్‌కాస్ట్‌లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.
భారత్‌లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్‌ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment