తనను విమర్శించిన నెటిజన్‌కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడిన మీరు సిగ్గుపడాలంటూ చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నాటి నుంచి జాంటీ రోడ్స్ భారత పర్యటనలో ఉన్నాడు.
ఇందులో భాగంగా ఈ లెజండరీ ఫీల్డర్.. గోవా, ఢిల్లీ, బెంగళూరులో పర్యటిస్తూ తన ప్రయాణానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినపుడు.. టాక్సీ డ్రైవర్ సలహా మేరకు రోడ్‌సైడ్ ఫుడ్ తిన్నానంటూ ‘ఎక్స్’ ట్వీట్ చేశాడు జాంటీ రోడ్స్.
మంగళూరు బన్, మసాలా దోశ, ఛాయ్ రుచి అదిరిపోయిందంటూ బెంగళూరు రుచులపై రివ్యూ ఇస్తూ ఐ లవ్ ఇండియా అంటూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో జాంటీ రోడ్స్ భోజనం రుచి చూస్తుండగా.. పక్కనే కూర్చున్న వ్యక్తి గడ్డానికి చేతులు ఆనించుకుని.. అతడి వైపే తదేకంగా చూస్తున్నాడు.
అయితే, ఆ వ్యక్తిని టాక్సీ డ్రైవర్‌గా పొరబడ్డ ఓ ఎక్స్ యూజర్.. ‘‘మీ టాక్సీ డ్రైవర్ కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాల్సింది. సెలబ్రిటీ అయిన మీ స్థాయికి ఇది ఎంతమాత్రం తగదు’’ అంటూ జాంటీ రోడ్స్‌ను విమర్శించారు. ఇక రెండోరోజుల క్రితం నాటి తన పోస్ట్‌పై ఈ విధంగా స్పందించిన సదరు వ్యక్తికి జాంటీ రోడ్స్ దిమ్మతిరిగేలా కౌంటర్ వేశాడు.
‘‘టేబుల్ దగ్గర నా ఎదురుగా కూర్చున్న జెంటిల్‌మ్యాన్ ఎవరో నాకు తెలియదు. ఆ ఫొటోను మా డ్రైవర్ తీశాడు. నిజానికి తను ఏమీ తినాలనుకోలేదు. తనకిష్టమైన రెస్టారెంట్‌లో తనకిష్టమైన భోజనాన్ని రుచి చూడాలని నన్ను కోరాడు.
నా కోసం తను ఫుడ్ ఆర్డర్ చేశాడు. తను కేవలం టీ మాత్రమే తాగాడు. నేను అతడి టీ బిల్లును చెల్లించాను. కాస్త సిగ్గుపడండి(#shameonyou)’’ అంటూ జాంటీ రోడ్స్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ అందుకున్న జట్టులో జాంటీ రోడ్స్ సభ్యుడు. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ(ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీగా చలామణిలో ఉంది)ని రోడ్స్ ముద్దాడాడు.
I have been sitting on this reply for a couple of days. The gentleman at my table is a stranger to me, and my driver was taking the picture. He did not eat, just ordered for me some of his favourite food. He just had tea, and yes, I did pay for it #shameonyou https://t.co/JPXphe60I3
— Jonty Rhodes (@JontyRhodes8) November 24, 2023
Comments
Please login to add a commentAdd a comment