భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు! | Indian kitchen goes global, 'keema', 'papad' now English words | Sakshi
Sakshi News home page

భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!

Jan 19 2015 11:52 PM | Updated on Sep 2 2017 7:55 PM

భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!

భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!

భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు తాజా ఎడిషన్ అద్దం పట్టింది.

 కోల్‌కతా: భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు తాజా ఎడిషన్ అద్దం పట్టింది.  సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఈ నిఘంటువు తొమ్మిదో ఎడిషన్‌లో 'కైమా', 'పాపడ్', 'కర్రీ లీఫ్'(కరివేపాకు) తదితర పదాలకు చోటు దక్కింది. ఈసారి రికార్డు స్థాయిలో 240కిపైగా భారతీయ ఇంగ్లిష్ పదాలు చేరాయి. వీటిలో 60 హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి.

 భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండడంతో వాటికి సంబంధించిన పదాలు చేర్చామని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ విద్యావేత్త ప్యాట్రిక్ వైట్ చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ప్రస్తుతం వెయ్యి భారతీయ పదాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement