Oxford English dictionary
-
ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ లేదు
లండన్: ఏటా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏదో ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా సంవత్సరమంతటా ప్రాచుర్యం పొంది, ప్రజల నోళ్లలో నానిన పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నం. ఈ ఏడాది భాష చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్. ఈ పదం కారణంగా కోవిడ్, లాక్డౌన్, సోషల్ డిస్టన్స్, రీఓపెనింగ్ వంటి పదాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దీంతో ఒకే పదాన్ని ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించలేమని చెప్పింది. నెలల వారీగా చూస్తే పలు పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జనవరిలో బుష్ఫైర్, ఫిబ్రవరిలో అక్విట్టల్, మార్చి నుంచి మే వరకు కోవిడ్–19, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, రీఓపెనింగ్ వంటి పదాలు ముందు వరుసలో నిలిచాయి. జూన్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఆగస్టులో మెయిల్–ఇన్, బెలాసరుసియన్, సెప్టెంబర్‌లో నెట్ జీరో, అక్టోబర్‌లో సూపర్ స్ప్రెడర్ పదాలు ప్రాచుర్యం పొందాయి. -
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 1200 కొత్త పదాలు
లండన్: ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ(ఓఈడీ) తాజా త్రైమాసిక సవరణలో 1,200 కొత్త పదాలను చేర్చింది. యోలో(యూ కెన్ లివ్ వన్స్), క్లిక్టివిజమ్, యోగాలెట్స్(యోగాకు సంబంధించినది) వంటి కొత్త పదాలతోపాటు బ్రిటిష్ నవలా రచయిత రోవాల్డ్ డాల్ శతజయంతి సందర్భంగా ఆయన రచనల్లోని కొన్ని పదాలను చేర్చినట్లు ఓఈడీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ జొనాథన్ డెంట్ తెలిపారు. జెండర్ ఫ్లూయిడ్, వెస్ట్ మినిస్టర్ బబుల్(బ్రిటన్ రాజకీయ నాయకులు, అధికారులు సంబంధించినది) పదాలు కూడా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి. -
'ఈ-మెయిల్' ఎలా మొదలైంది?
వాషింగ్టన్: కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు.. వాటికి విస్తృతార్థాలతోపాటు పాత పదాల అంతరార్థాలనూ శోధించి ప్రపంచానికి వెల్లడించే ఆక్స్ఫర్డ్ ఇండగ్లీష్ డిక్షనరీ (ఓఈడీ) ఇప్పుడు మరో పద పరిశోధనకు సన్నద్ధమైంది. అసలు ఎలా మొదలైందో తెలియకుండానే అందరి జీవితాల్లో భాగమైన ఆ పదం మరేమిటోకాదు.. ఈ- మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ ప్రక్రియకు ఈ- మెయిల్ షార్ట్ ఫామ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫామ్‌ని మొట్టమొదట ప్రయోగించింది, ఉపయోగించింది లేదా కనిపెట్టింది ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్నే ఆక్స్ ఫర్డ్ శోధించనుంది. 1975లోనే ఎలక్ట్రానిక్ మెయిల్ అనే పదాన్ని గుర్తించినప్పటికీ దానికి షార్ట్ ఫామ్‌గా భావించే ఈ- మెయిల్ మాత్రం 1979లో గానీ వెలుగులోకి రాలేదని చెబుతూనే.. 1979లో విడుదలైన కొటేషన్లు అంతకు ముందే మనుగడలో ఉన్న పదాలను వెలుగులోకి తెచ్చిందని 'యూఎస్ఏ టుడే' పేర్కొంది. అలా చూస్తే 'ఈ- మెయిల్' అనే పదం 1979 కన్నా ముందే ఉండి ఉండాలి. ఈ గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈ-మెయిల్ పుట్టుపూర్వత్రాలను తవ్వితీసే ప్రయత్నం చేస్తోంది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఈ క్రమంలో మీకు తెలిసిన సమాచారాన్ని కూడా మాతో పంచుకోండంటూ ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు ఓఈడీ ఎడిటర్. -
భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!
కోల్‌కతా: భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు తాజా ఎడిషన్ అద్దం పట్టింది. సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఈ నిఘంటువు తొమ్మిదో ఎడిషన్‌లో 'కైమా', 'పాపడ్', 'కర్రీ లీఫ్'(కరివేపాకు) తదితర పదాలకు చోటు దక్కింది. ఈసారి రికార్డు స్థాయిలో 240కిపైగా భారతీయ ఇంగ్లిష్ పదాలు చేరాయి. వీటిలో 60 హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి. భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండడంతో వాటికి సంబంధించిన పదాలు చేర్చామని ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యావేత్త ప్యాట్రిక్ వైట్ చెప్పారు. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ప్రస్తుతం వెయ్యి భారతీయ పదాలు ఉన్నాయి.