లండన్: ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ(ఓఈడీ) తాజా త్రైమాసిక సవరణలో 1,200 కొత్త పదాలను చేర్చింది. యోలో(యూ కెన్ లివ్ వన్స్), క్లిక్టివిజమ్, యోగాలెట్స్(యోగాకు సంబంధించినది) వంటి కొత్త పదాలతోపాటు బ్రిటిష్ నవలా రచయిత రోవాల్డ్ డాల్ శతజయంతి సందర్భంగా ఆయన రచనల్లోని కొన్ని పదాలను చేర్చినట్లు ఓఈడీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ జొనాథన్ డెంట్ తెలిపారు.
జెండర్ ఫ్లూయిడ్, వెస్ట్ మినిస్టర్ బబుల్(బ్రిటన్ రాజకీయ నాయకులు, అధికారులు సంబంధించినది) పదాలు కూడా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 1200 కొత్త పదాలు
Published Tue, Sep 13 2016 1:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement
Advertisement