'ఈ-మెయిల్' ఎలా మొదలైంది? | Oxford English Dictionary searching for first use of 'email' | Sakshi
Sakshi News home page

'ఈ-మెయిల్' ఎలా మొదలైంది?

Published Tue, Jul 28 2015 5:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

'ఈ-మెయిల్' ఎలా మొదలైంది?

'ఈ-మెయిల్' ఎలా మొదలైంది?

వాషింగ్టన్: కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు.. వాటికి విస్తృతార్థాలతోపాటు పాత పదాల అంతరార్థాలనూ శోధించి ప్రపంచానికి వెల్లడించే ఆక్స్ఫర్డ్ ఇండగ్లీష్ డిక్షనరీ (ఓఈడీ) ఇప్పుడు మరో పద పరిశోధనకు సన్నద్ధమైంది. అసలు ఎలా మొదలైందో తెలియకుండానే అందరి జీవితాల్లో  భాగమైన ఆ పదం మరేమిటోకాదు.. ఈ- మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ ప్రక్రియకు ఈ- మెయిల్ షార్ట్ ఫామ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫామ్ని మొట్టమొదట ప్రయోగించింది, ఉపయోగించింది లేదా కనిపెట్టింది ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్నే ఆక్స్ ఫర్డ్ శోధించనుంది.

1975లోనే ఎలక్ట్రానిక్ మెయిల్ అనే పదాన్ని గుర్తించినప్పటికీ దానికి షార్ట్ ఫామ్గా భావించే ఈ- మెయిల్ మాత్రం 1979లో గానీ వెలుగులోకి రాలేదని చెబుతూనే..  1979లో విడుదలైన కొటేషన్లు అంతకు ముందే మనుగడలో ఉన్న పదాలను వెలుగులోకి తెచ్చిందని 'యూఎస్ఏ టుడే' పేర్కొంది. అలా చూస్తే 'ఈ- మెయిల్' అనే పదం 1979 కన్నా ముందే ఉండి ఉండాలి. ఈ గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈ-మెయిల్ పుట్టుపూర్వత్రాలను తవ్వితీసే ప్రయత్నం చేస్తోంది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఈ క్రమంలో మీకు తెలిసిన సమాచారాన్ని కూడా మాతో పంచుకోండంటూ ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు ఓఈడీ ఎడిటర్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement