keema
-
మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!
కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 15 లేదా 20 (నలువైపులా కట్ చేసి.. పాలలో ఒకసారి ముంచి.. చేతులతో గట్టిగా ఒత్తుకుని, విడిపోకుండా చపాతీకర్రతో చపాతీల్లా ఒత్తుకుని పక్కనపెట్టుకోవాలి) మటన్ కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని ఉడికించుకుని, చల్లారనివ్వాలి) బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) వాము పొడి, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, బ్రెడ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లపైనే నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికిన కీమా, జీలకర్రపొడి, గరం మసాలా, వాము పొడి, ఆమ్చూర్ పొడి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, బంగాళదుంప గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం చిన్నచిన్నబాల్స్లా చేసుకుని ఒక్కో బ్రెడ్ ముక్కలో ఒక్కో ఉండ పెట్టి.. గుండ్రంగా బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ ఉండలను పాలల్లో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. నచ్చిన కూరగాయల తురుముతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బాల్స్. ఇవి చదవండి: ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..! -
ఈ స్టయిల్లో మటన్ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్ కొట్టదు!
వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ వెంట ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మాంసాహార ప్రియులు. ప్రతీ వారం ఒకే లాగా కూర చేసుకుంటే తినడానికి బోర్ కొడుతుంది.చిన్న పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు కదా. అందుకే మటన్ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి: కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగిన మటన్ కీమా – పావుకిలో రెండు కట్టలు చింత మెంతి కూర(శుభ్రం చేసి కడిగినవి), ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా, బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి దాదాపు గంటలో ఈ వంటకాన్ని రడీ చేసుకోవచ్చు. తయారీ విధానం కుక్కర్లో శుభ్రం చేసిన కీమాకు కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు కారం వేసి బాగా కలిపి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇపుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడి చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బే ఆకులు , గరం మసాలా వేసి, వేయించినూనె తేలెదాకా వేయించాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న కీమావేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. ఇక చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడక నివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ ఉడుకుతుంది. ఇందులో ఇష్టమున్న వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచి మటన్ కీమా మెంతికూర రడీ. దీన్ని చక్కని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన,ఉల్లిపాయ, నిమ్మ స్లైస్‌లతో అందంగా గార్నిష్ చేయండి. రైస్తోగానీ, చపాతీలో గానీ చక్కగా ఆరగించే యొచ్చు. అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. -
మటన్ కీమాతో పాలక్ సమోసా.. భలే రుచిగా ఉంటాయి
కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి. -
కీమాతో చీజ్ పఫ్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కీమా – చీజ్ పఫ్స్ తయారీకి కావల్సినవి: మటన్ కీమా – 400 గ్రాములు,చీజ్ తురుము – 4 టేబుల్ స్పూన్లు నూనె – 2 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు వెల్లుల్లి పొడి, పసుపు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత,మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్,కొత్తిమీర తరుగు – కొద్దిగా పఫ్ పేస్ట్రీ షీట్ – 1(మందంగా ఉండేది, లేదా షీట్స్ చిన్నచిన్నవి 4 లేదా 5 మార్కెట్లో దొరుకుతాయి) గుడ్డు – 1(ఒక బౌల్లో పగలగొట్టి.. కొద్దిగా పాలు కలిపి పెట్టుకోవాలి) నల్ల నువ్వులు – 1 టీ స్పూన్ పైనే(గార్నిష్‌కి) తయారీ విధానమిలా: ముందుగా నూనెలో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పొడి, కీమా వేసుకుని.. మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి. అందులో పసుపు, మసాలా పొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని.. గరిటెతో బాగా కలిపి.. బాగా ఉడకనివ్వాలి. అనంతరం పఫ్ పేస్ట్రీ షీట్లో కీమా మిశ్రమాన్ని నింపుకుని.. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఊడిపోకుండా తడి చేత్తో గట్టిగా ఒత్తాలి. దానిపైన గుడ్డు–పాల మిశ్రమాన్ని బ్రష్‌తో బాగా రాసి.. నువ్వులతో గార్నిష్ చేసి బేక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము జల్లి సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చిన్న చిన్న పఫ్ పేస్ట్రీ షీట్స్‌లో కూడా కీమా, చీజ్, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఉంచి.. త్రిభుజాకారంలో పఫ్స్ చుట్టుకోవచ్చు. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
నోరూరించే శాండ్విచ్.. ఇలా చేస్తే బయట కొనాల్సిన పనిలేదు
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి) చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానమిలా: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్‌గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కీమాతో పనీర్ బన్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కీమా – పనీర్ బన్స్ తయారికి కావల్సినవి: కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి), గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, పనీర్ తురుము – పావు కప్పు ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (ముక్కలు చేసుకోవాలి), కారం – అర టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్. ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ , ఉప్పు – తగినంత, నూనె – సరిపడా,నువ్వులు – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని తడి కర్చీఫ్ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కీమా వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీ ఉండల్లా చేసుకుని.. అందులో పనీర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. -
మటన్ ఖీమా సమోసా తయారీ ఇలా! పుదీనా చట్నీతో తిన్నారంటే..
Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మటన్ కీమా – అర కేజీ ►పచ్చి బఠాణీ– 100 గ్రాములు ►ఉల్లిపాయ – 1 (తరగాలి) ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి) ►మిరప్పొడి– టీ స్పూన్ ►ధనియాల పొడి– టీ స్పూన్ ►జీలకర్ర పొడి – టేబుల్ స్పూన్ ►బంగాళ దుంపలు – 2 ►కొత్తిమీర తరుగు – కప్పు ►నూనె – పావు కేజీ ►గోధుమ పిండి – పావు కేజీ. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి చపాతీలకు కలుపుకున్నట్లు ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. ►బంగాళదుంపలను కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ►పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టాలి. ►ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి. ►మందపాటి పెనంలో టీ స్పూన్ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి. ►ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ►పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి. ►ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే మరికొంత ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి. ►చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి. ►తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్ చేయడానికి తగినట్లు రావాలి. ►గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్ చేసుకోవాలి. ►ఒక ముక్కని ఐస్‌క్రీమ్ కోన్లాగ చేసుకోవాలి. ►టీ స్పూన్ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది. ►ఒక చపాతీతో రెండు సమోసాలన్నమాట. ►అన్నింటినీ ఇలాగే చేసుకుని ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి సమోసాలను దోరగా కాల్చుకోవాలి. ►ఈ సమోసాల్లోకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. ట్రై చేయండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా -
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
Recipe: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా!
కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►కీమా – 50 గ్రాములు (దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసుకుని.. మెత్తగా కుకర్‌లో ఉడికించుకోవాలి) ►ఆమ్చూర్ పౌడర్ – పావు టీ స్పూన్ ►టొమాటో సాస్, చిల్లీ సాస్ – అర టేబుల్ స్పూన్ చొప్పున ►చాట్ మసాలా – 1 టీ స్పూన్ ►మినపగుళ్లు – 1 కప్పు (రెండు గంటల ముందు నానబెట్టుకుని, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి) ►రాగిపిండి – ఒకటిన్నర కప్పులు ►ఉప్పు – తగినంత ►నీళ్లు – సరిపడా ►నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే తయారీ: ►ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోయాలి. ►తర్వాత.. ఉడికిన కీమాతో పాటు.. ఆమ్చూర్ పౌడర్, టొమాటో సాస్, చిల్లీ సాస్, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా గరిటెతో అటూ ఇటూ కలిపాలి ►ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మినప్పిండి, రాగి పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కాస్త జారుగా కలుపుకోవాలి. ►అనంతరం పొంగనాల ప్లేట్లో ఒక్కో గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా రాగిపిండి మిశ్రమం.. మధ్యలో కొద్దిగా కీమా మిశ్రమం ఆ పైన మళ్లీ రాగి పిండి ►మిశ్రమం పెట్టుకుని.. వాటిని ఉడికించుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి ఈ పొంగనాలు. -
చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..
శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్ టిఫిన్ సెంటర్’ పేరుతో ఉండే ఈ టిఫిన్ సెంటర్లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. ఒకప్పుడు ఫైవ్‌స్టార్ హొటల్లో చెఫ్‌గా పనిచేసిన సుదర్శన్.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్ మాత్రం తన హొటల్ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది. రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్ దోసె, స్వీట్ కార్న్ దోసె, ఎగ్ ఖీమా దోసె, చికెన్ ఖీమా దోసె, సుదర్శన్ స్పెషల్ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్ సెంటర్ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. కస్టమర్ల సంతృప్తే ముఖ్యం నా టిఫిన్ సెంటర్‌కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్‌ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. – సుదర్శన్, కుక్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రుచులు అమోఘం నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్ సెంటర్లో స్పెషల్. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి. – రంగాల సుమన్, వినియోగదారుడు -
Recipe: మటన్ కీమా- చీజ్ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి!
ఆలూ సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా.. ఎప్పుడూ ఇలా రోటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన సమోసా రుచి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మటన్ కీమా– చీజ్‌తో సమోసా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి! కీమా– చీజ్ సమోసా తయారీకి కావలసినవి: ►మటన్ కీమా – 1 కప్పు (కొద్దిగా మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి) ►మైదా పిండి – పావు కిలో, వాము – అర టీ స్పూన్ ►చీజ్ తురుము – అర కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►అందులో కీమా, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ►అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. ►స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ►దీనిని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ►ఆ ముద్దను చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. ►పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల కొద్దిగా కీమా మిశ్రమాన్ని, కొద్దిగా చీజ్ తురుము పెట్టి.. అంచులు మూసేయాలి. ►అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Kala Mutton Recipe Telugu: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
Recipe: రుచికరమైన చికెన్ కీమా పకోడా ఇలా ఈజీగా!
చికెన్‌తో రొటీన్‌గా కాకుండా వైరైటీ వంటకాలు చేయడం మీకు ఇష్టమా! అయితే, ఈసారి ఇంట్లోనే సులువైన పద్ధతిలో చికెన్ కీమా పకోడా ట్రై చేసి చూడండి. చికెన్ కీమా పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ►చికెన్ కీమా, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున ►బియ్యప్పిండి, శనగపిండి – పావు కప్పు చొప్పున ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ ►ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్, సన్నగా తరగాలి) ►కారం – అర టీ స్పూన్ ►నిమ్మరసం – 2 టీ స్పూన్లు ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►జీలకర్ర – అర టీ స్పూన్ ►నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా చికెన్ కీమా పకోడా తయారీ విధానం: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ కీమా, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, శనగ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ►ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ►అనంతరం నూనెలో పకోడాలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి. ►సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. చదవండి👉🏾:Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా? -
కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..
కొత్త కొత్తగా ఈ వంటకాలను కూడా ట్రై చేయండి.. బనానా షీరా చాక్లెట్ బాల్స్ కావలసిన పదార్ధాలు రవ్వ – 1 కప్పు (దోరగా వేయించుకోవాలి) అరటి గుజ్జు – 1 కప్పు, ఏలకుల పొడి – కొద్దిగా నెయ్యి – పావు కప్పు, పంచదార – 1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు) పాలు – రెండున్నర కప్పులు డ్రై ఫ్రూట్స్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చాక్లెట్ చిప్స్ – అర కప్పు, కొబ్బరి నూనె – కొద్దిగా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంతసేపు తర్వాత డ్రై ఫ్రూట్స్, బనానా గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ కూడా వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా మిగిలిన నెయ్యి కూడా వేసుకుని బాగా దగ్గర పడేదాక కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారనిచ్చి చిన్న చిన్న బాల్స్‌లా చే సుకుని పెట్టుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకుని ఓవెన్లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక్కో బాల్ వేసుకుని, అటు ఇటు తిప్పి.. నెమ్మదిగా ఆ బాల్స్‌ని ఒక ట్రేలో పెట్టుకుని ఆరనివ్వాలి. అనంతరం నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్–ఎగ్ బజ్జీ కావలసిన పదార్ధాలు బ్రెడ్ – 15 (ఒకదాన్ని త్రికోణంలో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి) శనగ పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు గుడ్లు – 2, కారం – ముప్పావు టీ స్పూన్ పసుపు – చిటికెడు, నీళ్లు – కొద్దిగా వంట సోడా – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో శనగపిండి, ఓట్స్‌పిండి, బియ్యప్పిండి, అర టీ స్పూన్ కారం, వంట సోడా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు, పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అనంతరం బ్రెడ్ ముక్కలని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచి, అనంతరం శనగపిండి మిశ్రమంలో ముంచి.. బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. కీమా ఇడ్లీ కావలసిన పదార్ధాలు కీమా – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపు, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్ వేయించుకోవాలి) ఇడ్లీపిండి – 5 లేదా 6 కప్పులు (ముందుగానే మినప్పప్పు నాన బెట్టుకుని, మిక్సీ పట్టుకుని, బియ్యప్పిండి కలిపి సిద్ధం చేసుకోవాలి) పచ్చి బఠాణీ – 4 టేబుల్ స్పూన్లు (నానబెట్టి, ఉడికించాలి) క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్ (చిన్నగా) కరివేపాకు – కొద్దిగా నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో నూనె పోసుకుని, వేడి కాగానే.. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, క్యారెట్ తురుము, పచ్చి బఠాణీ.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో కీమా మిశ్రమాన్ని కూడా వేసి, 1 నిమిషం పాటు వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ పాత్రకు నూనె రాసి, వాటిలో కొద్దికొద్దిగా ఇడ్లీపిండి వేసుకుని.. మధ్యలో 2 లేదా 3 టీ స్పూన్ల కీమా కర్రీ పెట్టుకోవాలి. ఆపైన నిండుగా ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
భారతీయ వంటకాల ద్వారా 'ఆక్స్ఫర్డ్'ని ఎక్కిన పదాలు!
కోల్‌కతా: భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు తాజా ఎడిషన్ అద్దం పట్టింది. సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఈ నిఘంటువు తొమ్మిదో ఎడిషన్‌లో 'కైమా', 'పాపడ్', 'కర్రీ లీఫ్'(కరివేపాకు) తదితర పదాలకు చోటు దక్కింది. ఈసారి రికార్డు స్థాయిలో 240కిపైగా భారతీయ ఇంగ్లిష్ పదాలు చేరాయి. వీటిలో 60 హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి. భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండడంతో వాటికి సంబంధించిన పదాలు చేర్చామని ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యావేత్త ప్యాట్రిక్ వైట్ చెప్పారు. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ప్రస్తుతం వెయ్యి భారతీయ పదాలు ఉన్నాయి.