చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి:
చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.
తయారీ విధానమిలా:
చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి.
వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙
ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙
సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి.
ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి.
ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్.
Comments
Please login to add a commentAdd a comment