కీమా – పనీర్ బన్స్ తయారికి కావల్సినవి:
కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి), గోధుమ పిండి – 2 కప్పులు
పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, పనీర్ తురుము – పావు కప్పు
ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (ముక్కలు చేసుకోవాలి),
కారం – అర టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
ఆమ్‌చూర్ పౌడర్ – అర టీ స్పూన్ , ఉప్పు – తగినంత, నూనె – సరిపడా,నువ్వులు – కొద్దిగా (గార్నిష్‌కి)
తయారీ విధానమిలా
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని తడి కర్చీఫ్ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కీమా వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీ ఉండల్లా చేసుకుని.. అందులో పనీర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఓవెన్‌లో బేక్ చేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment