కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి:
కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు
సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున
మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు
మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment