![How To Make Paneer Keema Sandwich Recipe In Telugu - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/30/keema%20sandwich_650x400.jpg.webp?itok=-e2DpBWb)
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి
పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి)
చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు
స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు,
ఉప్పు – తగినంత
తయారీ విధానమిలా:
ముందుగా ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్‌గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment