Sandwich
-
శాండ్విచ్.. పోషకాలు రిచ్..
శాండ్విచ్ నగరంలో అత్యంత క్రేజీ స్నాక్స్‌లో ఒకటి. అల్పాహారం, భోజనం లేదా సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్ డిన్నర్గా కూడా తీసుకోగలిగిన ఏకైక ఫుడ్ ఐటమ్. దీంతో నగరంలో ఫుడ్ లవర్స్‌కి మాత్రమే కాదు యువత నుంచి ముసలి వారి వరకూ, ఉద్యోగుల నుంచి లైట్ ఫుడ్‌ని తీసుకునేవారి వరకూ బాగా దగ్గరైన ఫుట్ ఐటమ్‌గా చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉండే ఈ రుచికరమైన శాండ్విచ్ పోషకాహారంగా కూడా పేరొందింది. బ్రిటిష్ పాలకుడు జాన్ మోంటాగు 18వ శతాబ్దంలో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మటన్ స్లైసెస్ ఉంచి సర్వ్ చేయమని సిబ్బందిని ఆదేశించాడట. దాని వల్ల తాను అవి తింటూనే పేకాట ఆడు కోవచ్చని ఆయన భావించాడట. అలా పుట్టిన శాండ్విచ్ ఆ తర్వాత క్రమంలో విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. మన భాగ్యనగరంలోనూ సిటిజనులకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్‌గా అవతరించింది. తయారీ సులువుగా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటం కూడా శాండ్విచ్ పాప్యులర్ అవ్వడానికి ప్రధాన కారణం.. కనీసం రూ.100 మొదలుకుని రూ.600 దాకా కూడా నగరంలో విభిన్న రకాల శాండ్విచ్లు అందుబాటులో ఉన్నాయి.ట్రెడిషన్స్‌ను కలుపుకుంటూ టేస్టీగా.. బ్రిటీష్ డచ్ జాతీయులు యూరోపియన్ బ్రెడ్–మేకింగ్ పద్ధతులను మన నగరం స్వీకరించి సంప్రదాయ మసాలా దినుసులు. నాన్, రోటీ వంటి స్థానిక ఫ్లాట్‌బ్రెడ్‌లను కూడా ఉపయోగించి సరికొత్త శాండ్విచ్ రుచులను సృష్టించింది. ‘టిక్కా మసాలా వంటి మన సంప్రదాయ రుచులు శాండ్‌విచ్‌లలో చేర్చారు’ అని మకావు రెస్టారెంట్ హెడ్ చెఫ్ రవి చెబుతున్నారు. ‘కేఫ్‌కి వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ వెరైటీ కోసం చూస్తారు. అందుకే సోర్‌డౌ శాండ్విచ్ల నుంచీ క్రోసెంట్ బన్స్ వరకూ మెనూలో చేరుతున్నాయి’ అని చెఫ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. స్థానిక అభిరుచులకు గ్లోబల్ ట్రెండ్ మిళితం చేసి అవొకాడో లేదా పెస్టోతో ఓపెన్–ఫేస్డ్ శాండ్విచ్లను కూడా ఇక్కడి కేఫ్స్ పరిచయం చేశాయి. మారుతున్న ఆధునికుల అభిరుచికి అనుగుణంగా వీగాన్ శాండ్విచ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ..శాండ్విచ్లను చాలా సులభంగా ఇంట్లో సైతం వేగంగా తయారు చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి మిడ్ డే స్నాక్స్‌గానూ, సాయంత్రం టీ టైమ్ దాకా ఎనీ టైమ్ శాండ్విచ్ బెస్ట్ కాంబినేషన్.. నచి్చన కూరగాయలను లేదా విభిన్న రకాల మేళవింపులను దీనికి జతగా ఉపయోగించవచ్చు. రుచికరమైన సాస్‌లు, చీజ్‌లతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్ మేళవింపునకు అనుకూలం కావడంతో ఆరోగ్యకర పోషకాహారంగానూ ప్రాచుర్యం పొందింది.ఇంట్లోనే.. రుచికరంగా..రుచికరమైన శాండ్విచ్ చేయడానికి ఎల్లప్పుడూ చీజ్, బ్రెడ్ రెండూ కలపడం మంచిది. సోర్డోఫ్ బ్రెడ్, చీజ్ తాజా దోసకాయ ముక్కలతో దోసకాయ–చీజ్ శాండ్విచ్, సాయంత్రం టీ సమయంలో తినాలనిపిస్తే, బ్రెడ్ మష్రూమ్లను ఉపయోగించి మష్రూమ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. దీనికి వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మోజారెల్లా చీజ్, బ్రెడ్ స్లైసెస్, మసాలా దినుసులు జోడించవచ్చు. మొక్కజొన్న, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, టొమాటోలు వంటి తాజా కూరగాయల కలయికతో ఇంట్లో తయారుచేసిన స్ప్రెడ్లు, సాస్‌లతో వెజ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. ఇదే విధంగా చికెన్, ఎగ్స్ రకరకాల మేళవింపులతో నాన్‌వెజ్ వెరైటీలూ తయారు చేసుకోవచ్చు. సూప్స్ నుంచి తేనీటీ దాకా పీనట్ బటర్ నుంచి జామ్ దాకా ఏ కాంబినేషన్‌లోనైనా అమరిపోతాయి. రోస్ట్ చికెన్, మస్టర్డ్ శాండ్విచ్ స్పినాచ్ అండ్ కార్న్, రోస్టెడ్ వెజిటబుల్ అండ్ ఛీజ్ వంటి ఫిల్లింగ్స్‌తో ఇంట్లో వీట్ బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు.నగరం నలువైపులా.. నగరంలో దాదాపు అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో రుచికరమైన శాండ్విచ్ వెరైటీలు లభిస్తాయి. అలా చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని ఎగ్ బటర్‌తో బేక్ చేసిన ఫ్రెంచ్ బ్రెడ్ మెల్ట్ శాండ్విచ్లు ప్యాటీ మెల్ట్ పేరుతో మాదాపూర్‌లోని సిగుస్తా అందిస్తుండగా, గండిపేటలోని బృందావన్ కాలనీలోని కేఫ్ శాండ్‌విచో, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రోస్టరీ కేఫ్, మాదాపూర్‌లోని బేక్లోర్, నగరంలో పలు చోట్ల ది బేక్ ఫ్యాక్టరీ, అమెరికన్ శాండ్విచ్లకు పేరొందిన హిమాయత్ నగర్‌లోని కింగ్ అండ్ కార్డినల్, సింధి కాలనీలోని చత్వాలా, కొండాపూర్‌లోని శాండ్విచ్ స్క్వేర్, జూబ్లీహిల్స్ లోని కోర్ట్‌యార్డ్ కేఫ్స్ కూడా శాండ్విచ్లకు పేరొందాయి. ఇక శాండ్ విచ్ ఈటరీ పేరుతో నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకించిన ఔట్లెట్స్ ఫుడ్ లవర్స్‌కి చిరునామాగా మారాయి. ‘మాంసం లేదా చీజ్‌తో నిండిన బ్రెడ్ లేదా పేస్ట్రీ కలయికలు, మసాలా దినుసులు ధరించడం పురాతన కాలం నుండి ఆనందించబడింది’ అని ఫ్యూ డెసర్ట్, బార్ మరియు కిచెన్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ జో ఫ్రాన్సిస్ వివరించారు. గిన్నిస్ రికార్డ్స్‌లో శాండ్విచ్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్ కూడా ఉంది. గిన్నిస్ రికార్డుల ప్రకారం.. పేరొందిన అంతర్జాతీయ చెఫ్ జోయ్ కాల్డరోన్ తయారు చేసిన గ్రిల్డ్ ఛీజ్ శాండ్ విచ్ 214 డాలర్లు అంటే దాదాపు భారతీయ కరెన్సీలో రూ.17వేల ఖరీదు చేస్తుందట. న్యూయార్క్‌లోని 3 రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. షాంపేన్ తదితర ఖరీదైన వాటిని ఇందులో మేళవించడమే దీనికి కారణమట. -
బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!) -
'శాండ్విచ్ బ్యాగ్' ధర వింటే షాకవ్వడం ఖాయం!
కొన్ని రకాల ఫ్యాషన్ బ్రాండ్ల ధర వింటే మతిపోతుంది. ఎందుకింత ధర అనిపించేలా ఉంటుంది. పైగా ఆ వస్తువుకి అంత ధర వెచ్చించాల్సినంత విశేషాలేంటో కూడా తెలియదు. అలాటి సరికొత్త ప్రొడక్ట్‌ని ఓ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దాని ధర వింటే మాత్రం కంగుతినడం ఖాయం. ఇంతకీ ఆ కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్‌ని రూపొందించింది. ఏంటా వస్తువు అంటే.. వివరాల్లోకెళ్తే.. ప్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ శాండ్విచ్ బ్యాగ్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్యాగ్‌ని ఆవు చర్మంతో శాండ్విచ్ మాదిరిగా రూపొందించారు. దీన్ని ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ రూపొందించారు. అతను ఇలా సరికొత్త మోడల్లో శాండ్విచ్ బ్యాగ్‌ని రూపొందిచడానికి క్లాసిక్ పేపర్‌తో చేసిన శాండ్విచ్ బ్యాగ్ ప్రేరణ అని పేర్కొంది. ఈ బ్యాగ్‌లను జనవరి 4న మార్కెట్లో విడుదల చేసి, అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ బ్యాగ్ ఫీచర్స్ చూస్తే..ఆవు చర్మంతో తయారయ్యిన లెదర్ బ్యాగ్ బ్రౌన్ కలర్లో ఉండగా, క్లోజ్ చేయడానికి నీలం కలర్ ఉంటుంది. ఆ బ్యాగ్‌పై లూయిస్ విట్టన్' 'మైసన్ ఫాండీ ఎన్ 1854' అక్షరాలు ఉంటాయి. జిప్‌తో కూడిన పాకెట్లు ఉంటాయి. లోపల వస్తువులు క్రమబద్ధంగా పెట్టుకునేలా డబుల్ ఫ్లాటెడ్ పాకెట్లు ఉంటాయి. ఈ బ్యాగ్ పొడవు 30 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు, వెడల్పు 17 సెంటీమీటర్లు ఉంటుంది. కాగా, ఈ ఫ్రెంచ్ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర ఏకంగా రూ 2,80,000 పలుకుతోంది. ఇది చూడటానికి మన ఇంట్లో ఉండే షాపింగ్ బ్యాగ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ శాండ్విచ్ బ్యాగ్ ధర నెట్టింట్ వైరల్‌గా మారింది. బహుశా ఇది ఏఐ టెక్నాలజీ రూపొందించిన బ్యాగ్ కాబోలని ఒకరూ, ఇలాంటి అత్యంత లగ్జరియస్ బ్యాగ్‌లు కూడా ఉండాలని మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మిస్ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి) -
శాండ్ విచ్ తిని, రూ. 6 లక్షల టిప్ ఇచ్చేసింది..!
అమెరికాకు చెందిన మహిళ పొరపాటున భారీ మొత్తంలో టిప్ ఇచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి లబోదిబోమంది తప్పయిపోయింది నా డబ్బులు నాకు ఇప్పించండి మొర్రో అంటూ బ్యాంకును ఆశ్రయించింది. చివరికి ఏమైందంటే..! అమెరికాలోని ఇటాలియన్ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన కానర్ మహిళ శాండ్విచ్ (రూ. 628) ఆర్డర్ చేసింది. ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అనుకోకుండా 7వేల డాలర్లు (రూ. 6 లక్షలకు పైగా) టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇది రెస్టారెంట్ సిబ్బంది తెగ సంతోషడిపోయారు. గొప్పమనసు అని పొడిగారు. కానీ ఆనక విషయం ఉసూరుమన్నారు. ఏం జరిగిందంటే కానర్ చెల్లించాల్సిన డబ్బును ఎంటర్ చేయాల్సిన చోట తన ఫోన్ నెంబర్లులోని చివరి అంకెల్ని ఎంటర్ చేసింది. దీంతో సంబంధం లేకుండానే బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ పూర్తి అయింది. చివరికి బిల్లు చూసిన కార్నర్ గుడ్లు తేలేసింది. బ్యాంకుకు పరుగులు పెట్టింది. తన సొమ్మును తిరిగి ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను తొలుత తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక కానర్ సబ్ వే మేనేజ్ మెంట్‌ను ఆశ్రయించింది. చివరికి పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. నెల రోజుల తరువాత క్లయింట్‌కు డబ్బును వాపసుకు అంగీకరించారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీని బతికాను రా దేవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. -
ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్. న్యూయార్క్‌లోని సెరండిపిటీ–3 అనే రెస్టారెంట్ ఈ శాండ్విచ్ను ‘నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే’ సందర్భంగా ఏప్రిల్ 12 నుంచి తన మెనూలో చేర్చి, కస్టమర్లకు వడ్డిస్తోంది. ఈ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ఖరీదు 214 డాలర్లు (రూ.18,229). న్యూయార్క్ రెస్టారెంట్లలో పూర్తి స్థాయి భోజనం ఖరీదే 30 డాలర్లకు (రూ.2,497) మించదు. అలాంటిది ఈ శాండ్విచ్ ధరకు అమెరికన్లే కళ్లు తేలేస్తున్నారు. అయినా, కొందరు సంపన్నులు ఈ శాండ్విచ్ను రుచి చూడటానికి సెరండిపిటీ–3 రెస్టారెంట్ వద్ద క్యూ కడుతుండటం విశేషం. ఈ శాండ్విచ్ తయారీకి ఫ్రెంచ్ పల్మన్ షాంపేన్ బ్రెడ్, గడ్డిలో పెరిగే తెల్ల పుట్టగొడుగులు, అరుదైన కాషియోకవాలో పొడోలికా గ్రిల్డ్ చీజ్, తినడానికి ఉపయోగించే 23 క్యారెట్ల బంగారు రేకులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో వినియోగించే కాషియోకవాలో పొడోలికా చీజ్‌ను పొడోలికా జాతి ఆవుల పాల నుంచి తయారు చేస్తారు. ఈ జాతి ఆవులు ప్రపంచంలో దాదాపు పాతికవేలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏడాదిలో కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే పాలు ఇస్తాయి. అందువల్ల వీటి పాలు, వీటి పాలతో తయారయ్యే చీజ్ వంటి ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి. (చదవండి: జపాన్‌లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!) -
నోరూరించే శాండ్విచ్.. ఇలా చేస్తే బయట కొనాల్సిన పనిలేదు
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి) చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానమిలా: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్‌గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్‌కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..
ఫ్రాన్స్: చాలాకాలం క్రితం రోమ్ నగరం తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతోంది. తాజాగా అదే కథనాన్ని గుర్తు చేస్తూ ఒకపక్క ఫ్రాన్స్ దేశంలో అల్లర్లు చెలరేగుతుంటే మధ్యలో కూర్చుని ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ కనిపించాడు. పారిస్ లోని నాంటెర్రేలో ట్రాఫిక్ స్టాప్ వద్ద నల్ల జాతీయుడైన 17 ఏళ్ల యువకుడు నాహేల్ ను పోలీసులు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఘర్షణలు పెచ్చుమీరేలా చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య పరస్పర దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పారిస్ పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలతో ఒకపక్క అంతటి విధ్వంసం చెలరేగుతుంటే మరోపక్క ఒక యువకుడు మాత్రం ఇదేమీ పట్టనట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చుని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. 🚨🇫🇷INSOLITE - Un homme continue de manger son sandwich alors qu'il est au milieu de violents affrontements entre émeutiers et policiers à #Nanterre. (témoins) pic.twitter.com/VzLtpfRmty — AlertesInfos (@AlertesInfos) June 29, 2023 ఇది కూడా చదవండి: మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు -
Recipe: పెద్ద రొయ్యలతో ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీ ఇలా!
రొయ్యలు ఇష్టంగా తినేవారు రొటీన్‌గా కర్రీ కాకుండా ఇలా ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ట్రై చేసి చూడండి. ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీకి కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – 8 లేదా 10 ►పెద్ద రొయ్యలు – 15 (మెత్తగా ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 1 (ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►వెన్న – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా ►చీజ్ తురుము – 5 టేబుల్ స్పూన్ల పైనే ►మిరియాల పొడి – చిటికెడు ►కారం – అర టీ స్పూన్ ►టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్ల చొప్పున తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో గుడ్ల ముక్కలు, రొయ్య ముక్కలు, వెన్న, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి గరిటెతో కలపాలి. ►అనంతరం ఒక్కో బ్రెడ్ పీస్ తీసుకుని.. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి. ►అదే విధంగా కొద్దిగా టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, చీజ్ తురుము ఇలా అన్నీ వేసుకుని.. మరో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి. ►త్రిభుజాకారంలో కట్ చేసుకుని, అన్ని వైపులా తడి చేత్తో గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. ►ఆపైన బ్రష్‌తో ప్రతి బ్రెడ్‌కి నూనె పూసుకుని, ఓవెన్లో లేదా.. పాన్ మీద ఇరువైపులా దోరగా వేయించుకుని సర్వ్ చేసుకోవచ్చు. చదవండి: Royyalu Mulakkada Kura In Telugu: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా! -
నోరూరించే ఆలూ శాండ్ విచ్ తయారీ విధానం..
పన్నిర్ పొటాటో కార్న్బాల్స్ కావలసినవి: ఉడికించిన బంగాళ దుంప ముక్కలు – ఒకటిన్నర కప్పు, సన్నగా తరిగిన పన్నిర్ – కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఉడికించిన స్వీట్ కార్న్ – అర కప్పు, చీజ్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి – ముప్పావు కప్పు (కప్పు నీళ్లల్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి), బ్రెడ్ పొడి – రోలింగ్‌కు సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – రుచికి తగినంత. సాస్: బటర్ – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – రెండు టేబుల్ స్పూన్లు, పాలు – ముప్పావు కప్పు. తయారీ: ∙ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత మైదా వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు పాలు పోసి సన్నని మంట మీద మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికిస్తే సాస్ రెడీ అవుతుంది. దీనిని పక్కన పెట్టాలి. ∙బంగాళ దుంప ముక్కలు , పన్నీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్వీట్ కార్న్, చీజ్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలోనే సాస్ కూడా వేసి కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని గుండ్రని మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. ∙బాల్స్‌ను కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో ముంచి, తరువాత బ్రెడ్ పొడిలో ముంచాలి. ∙బాల్‌కు చక్కగా కోటింగ్ పట్టిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ∙గోల్డెన్ బ్రౌన్ రంగులోకి బాల్స్ మారితే పన్నిర్ పొటాటో కార్న్ బాల్స్ రెడీ. చట్నీ, టొమాటో కెచప్‌లతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. మూంగ్ దాల్ చిల్లా కావలసినవి: పొట్టుతీసిన పెసరపప్పు – కప్పు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, వేయించిన జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం తరుగు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – చిల్లా వేయించడానికి సరిపడా. తయారీ: ∙ముందుగా పెసరపప్పుని మూడు నాలుగు సార్లు కడిగి మూడు కప్పులు నీళ్లుపోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. సమయం తక్కువగా ఉన్నప్పుడు కనీసం నాలుగు గంటలైనా నానబెట్టాలి. ∙పప్పు నానాక నీళ్లు తీసేసి గరిట జారుడుగా రుబ్బుకోవాలి. ∙రుబ్బిన పిండిలో పసుపు, కారం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙ఈ మిశ్రమంలోనే కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, ఇంగువ వేసి కలిపి ఇరవై నిమిషాలపాటు పక్కనబెట్టాలి. ∙ఇరవై నిమిషాల తరువాత పిండి మరీ మందంగా అనిపిస్తే..కొద్దిగా నీళ్లు పోసుకుని దోశపిండిలా కలుపుకోవాలి ∙వేడెక్కిన పెనంపై కొద్దిగా ఆయిల్ వేసి దోశలా పోసుకోవాలి. ∙దోశను రెండు వైపులా క్రిస్పీగా, బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చితే మూంగ్ దాల్ చిల్లా రెడీ. ∙టొమాటో సాస్, చట్నీతో రుచిగా ఉంటుంది. ఆలూ శాండ్ విచ్ కావలసినవి: ఉడికించిన బంగాళ దుంపలు – రెండు (మెత్తగా చిదుముకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, కారం – అరటీస్పూను, చాట్ మసాలా – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బ్రెడ్ స్లైసులు – ఎనిమిది, టొమాటో సాస్ – నాలుగు టేబుల్ స్పూన్లు, గ్రీన్ సాస్ – నాలుగు టేబుల్ స్పూన్లు, టొమాటో – ఒకటి( సన్నగా చక్రాల్లా తరగాలి), మిరియాల పొడి – టీస్పూను, చీజ్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, బటర్ – రోస్ట్‌కు సరిపడా. తయారీ: ∙గిన్నెలో చిదుముకున్న బంగాళ దుంపలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, కొత్తిమీర తరుగు, కారం, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙రెండు బ్రెడ్ స్లైసులను తీసుకుని ఒక స్లైసుకు టొమాటో సాస్, మరో స్లైసుకు గ్రీన్ చట్నీ రాయాలి. ∙గ్రీన్ చట్నీ రాసిన స్లైసు మీద టొమాటో ముక్కలు పరిచి, వాటి మీద దుంపల మసాలా మిశ్రమాన్ని పెట్టాలి. దీని మీద మిరియాలపొడి, చీజ్‌ను చల్లాలి. ∙ఈ స్లైస్కు టొమాటో సాస్ రాసిన బ్రెడ్స్లైస్ను పెట్టి బటర్‌తో రోస్ట్ చేస్తే ఆలూ శాండ్ విచ్ రెడీ. బ్రెడ్ వడ కావలసినవి: బ్రెడ్ స్లైసులు – ఆరు, బొంబాయి రవ్వ – పావు కప్పు, బియ్యప్పిండి – అరకప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి), అల్లం పేస్టు – టీస్పూను, పచ్చిమిర్చి – ఒకటి( సన్నగా తరగాలి), కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి తగినంత, ఆయిల్ – డీప్ ఫ్రైకిసరిపడా. తయారీ: ∙గిన్నెలో బ్రెడ్ స్లైసులను ముక్కలు చేసి వేసుకోవాలి. ∙దీనిలో బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దగా కలపుకోవాలి. ∙మరీ గట్టిగా అనిపిస్తే పిండిలో మరో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి కలుపుకోవచ్చు. ∙ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండిని గారెల్లా చేసి ఆయిల్లో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ∙మీడియం మంట మీద క్రిస్పీ, గోల్డెన్ బ్రౌన్ లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే బ్రెడ్ వడ రెడీ. పెరుగుప్మా కావలసినవి: పెరుగు – అరకప్పు, బొంబాయి రవ్వ – కప్పు, పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, మినపపప్పు – అర టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ముందుగా ఒక గిన్నెలో పెరుగు, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉప్పు, రెండున్నర కప్పులు నీళ్లుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ∙తరువాత మినప పప్పు, కరివేపాకు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ∙ఉల్లిపాయ దోరగా వేగిన తరువాత బొంబాయి రవ్వ వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙రవ్వ వేగిన తరువాత కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ∙మధ్యమధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికిస్తే పెరుగుప్మా రెడీ. -
షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..
ఇంట్లో వారి కోసం ఎంతో ప్రేమగా వంట చేస్తారు ఆడాళ్లు. ఏ మాత్రం రుచి తగ్గినా తినే వారి కంటే వండిన వారే ఎక్కువ బాధపడతారు. ఇక భర్తకు, పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధతో లంచ్ బాక్స్ తయారు చేస్తారు. తినకుండా అలానే తీసుకొస్తే వారి మనసు విలవిల్లాడుతుంది. అలాంటిది ఓ భర్త ఫాస్ట్ ఫుడ్ మీద ఇష్టంతో భార్య తన కోసం ఎంతో ప్రేమగా వండి పంపిన ఆహారాన్ని అమ్ముకుని.. అలా వచ్చిన డబ్బుతో తనకు నచ్చిన ఆహారం తినేవాడు. ఓ రోజు సడెన్‌గా ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రెడిట్ అకౌంట్లో షేర్ చేసిన ఆ వివరాలు.. ‘‘నా భర్తకు ఇంట్లో చేసిన ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇందుకుగాను రోజుకు 20 డాలర్ల చొప్పున నెలకు 600 డాలర్లు ఖర్చు చేసేవాడు. ప్రస్తుతం మే అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇది చాలా ఖరీదైన ఏరియా. రెంటు కూడా చాలా ఎక్కువ. దాంతో సొంత ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా అవనసర ఖర్చులు తగ్గించి.. పొదుపు చేద్దామని నిర్ణయించుకున్నాం. దాంతో నేను ఇంట్లోనే శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను.. ఫాస్ట్ ఫుడ్ తినడం మారేయమని నా భర్తని కోరాను. అందుకు తను అంగీకరించాడు. తనకు లంచ్ బాక్స్‌లో శాండ్విచ్ పెట్టి పంపించేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. రహస్యం ఎలా భయపడిందంటే... ‘‘ఇలా ఉండగా ఓ రోజు నా భర్త స్నేహితులు మా ఇంటికి డిన్నర్‌కి వచ్చారు. నా వంటను మెచ్చుకున్నారు. అంతేకాక ‘‘మేం ప్రతిరోజు మీ భర్త దగ్గర శాండ్విచ్ కొంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. కానీ ధరే కాస్త ఎక్కువ’’ అన్నారు. దాంతో షాకవ్వడం నా వంతయ్యింది. అంటే నా భర్త నేను పంపే శాండ్విచ్లు తినకుండా అమ్ముతున్నాడని తెలిసింది. తన స్నేహితులు వెళ్లాక దీని గురించి ఆయనని ప్రశ్నించగా.. నేను పంపే శాండ్విచ్లు అమ్మి.. అలా వచ్చిన డబ్బుతో తనకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కొనుక్కోని తింటున్నాను అని తెలిపాడు’’ అన్నది. ‘‘నేను ఎంతో ప్రేమగా ఆయన కోసం ఇష్టంగా చేసిన వంటను ఇలా అమ్మకానికి పెట్టడం నాకు ఏం నచ్చలేదు. అంటే పరోక్షంగా ఆయన నా ప్రేమను అమ్మకానికి పెట్టారు. దీని గురించి తెలిసిన నాటి నుంచి నా మనసు మనసులో లేదు. ఇక జీవితంలో తన కోసం వంట చేయకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. భార్యల వంట విలువ మగాళ్లకు ఏం తెలుస్తుంది.. ఒక్కరోజు వారు వంట చేసి.. దాన్ని ఎవరు తినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు వారికి అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఫాస్ట్ ఫుడ్ కోసం హెలికాప్టర్లో 725 కిమీ.. -
మరీ విడ్డూరం.. శాండ్ విచ్ కోసం హెలికాప్టర్లో!
లండన్: లాక్డౌన్ సమయంలో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడం చూసి మనం ఔరా అనుకున్నాం. తనకిష్టమైన మెక్ డొనాల్డ్ బర్గర్ కోసం యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఓ మహిళ ఇటీవల కోవిడ్ ఆంక్షలను లెక్కచేయకుండా 100 మైళ్లకు పైగా ప్రయాణం సాగించింది. ఆ తర్వాత పోలీసు అధికారులు ఆమెకు జరిమానా కూడా విధి౦చారు. ఇదే తరహా ఘటన యునైటెడ్ కింగ్డమ్లో మరొకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనకు నచ్చిన శాండ్విచ్ కోసం ఏకంగా 130 కిలోమీటర్లు హెలికాప్టర్లో ప్రయాణించాడు. నోరూరించే శాండ్విచ్ ఆరగించి వార్తల్లో నిలిచాడు. వివరాలు.. చిప్పింగ్ ఫార్మ్ షాప్‌లో ఓ వ్యక్తి తను ఆర్డర్ చేసిన శాండ్ విచ్ కోసం ఏకంగా హెలికాప్టర్లో ప్రత్యక్షమైయ్యాడు. ఆర్డర్ తీసుకుని అదే చాపర్‌లో వెనుదిరిగాడు. ఈ వీడియోను షాపు యాజమాన్యం ఇన్‌ష్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నాలుగు లక్షలకుపైగా యూజర్లు వీక్షించగా, వారి నుంచి వందల కొద్దీ కామెంట్లు వస్తున్నాయి. "శాండ్ విచ్ అని కాకుండా.. ది చాపర్ వూపర్ ' అని పేరు మార్చండి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ‘ఆ శాండ్ విచ్ లు అంతగా బాగుంటాయేమో’అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chipping Farm Shop (@chippingfarmshop) -
కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?
బ్రిస్బేన్: ఆసీస్ యువ ఆటగాడు మార్నస్ లబుషేన్‌తో వివాదంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగోటెస్టులో లబుషేన్ తన జేబులో సాండ్విచ్ తీసుకురావడంపై లాంగర్ అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసీస్ జట్టులోని పలువురు ఆటగాళ్లు లాంగర్ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగర్ ఒక స్కూల్ హెడ్‌మాస్టర్‌లాగా ప్రవర్తిస్తున్నాడని.. అతనితో తమకు పొసగడం లేదంటూ పరోక్ష్య వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిడ్నీ హెరాల్డ్ పత్రిక ఆసీస్ జట్టులో విభేదాలు వచ్చాయని.. దీనికి కారణం లాంగర్ అంటూ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనంపై లాంగర్ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు కథనాలని.. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పాడు.చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! అయితే తాజాగా తనను కనీసం సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదంటూ లబుషేన్ పేర్కొనడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో లాంగర్ మళ్లీ స్పందిస్తూ.. ' మ్యాచ్ సమయంలో లబుషేన్‌కు సాండ్విచ్ తినొద్దు అని మాత్రమే చెప్పా.. ఎందుకంటే అప్పటికే ఆటకు 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు.. అప్పుడు తినకుండా.. దానిని జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాను. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కోచ్‌గా నా జట్టును ఉన్నతస్థానంలో నిలిపాలని ఆశిస్తుంటా. అందుకే కాస్త క్రమశిక్షణగా మెలిగి ఉండొచ్చు. అంతమాత్రానికే కొందరు ఆటగాళ్లు నన్ను తప్పుబడుతూ బ్యాడ్ చేయాలని చూస్తున్నారు.చదవండి: ధోనీ అరుదైన రికార్డు.. తొలి క్రికెటర్‌గా! నేను చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ కోచ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అదే నిబంధనను నేను లబుషేన్ విషయంలో అమలు చేశాను. కొన్నిసార్లు నేను కోపంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని ప్రతీసారి అదే విషయాన్ని గుర్తుచేస్తు తప్పుబట్టడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2018 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత లాంగర్ ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో కోల్పోవడంపై ఆసీస్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: అతడి కెప్టెన్సీలో టీమిండియా స్వేచ్ఛగా ఆడుతుంది -
హాట్‌డాగ్ తినలేదని కొట్టి చంపేసింది
కాన్సాస్: సాండ్ విచ్ తినలేదన్న కోపంతో కన్నకొడుకుని కొట్టి చంపిన నేరానికి ఆ తల్లికి అమెరికాలో కోర్టు 19ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అదే నేరంలో పాల్గొన్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాన్సాస్‌లో విచితకు చెందిన ఎలిజబెత్ వూల్హీటర్ గత ఏడాది రెండేళ్ల వయసున్న తన కుమారుడు ఆంటోనీకి ‘హాట్‌డాగ్’ సాండ్విచ్ తినమని ఇచ్చింది. ఆ బాలుడు నిరాకరించడంతో బాగా కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయస్థానం తల్లికి 19 ఏళ్ల 5 నెలలు ఖైదు, నేరంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
సాండ్విచ్ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!
పారిస్ : ప్రాన్స్‌లోని ఓ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. సాండ్విచ్ తెచ్చివ్వడంలో ఆలస్యమైందనే కారణంతో ఓ వ్యక్తి వెయిటర్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన తూర్పు పారిస్‌లోని నాయిసీలే గ్రాండ్ హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. వెయిటర్ (28) భుజంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ప్రాణాలు విడిచాడు. నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. సహోద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సాండ్విచ్ కోసం హత్య చేశాడా..! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్, మద్యానికి బానిసైన వ్యక్తులు తమ ప్రాంతంలో విచ్చవిడిగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. -
పేద్ద సాండ్విచ్...
మెక్సికోలో తయారుచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సాండ్విచ్. స్థానికంగా టోర్టా అని పిలిచే ఈ సాండ్విచ్ బరువు 865 కిలోలు, పొడవు 70 మీటర్లు అని నిర్వాహకులు తెలిపారు. -
హెల్దీ కుకింగ్
కార్న్ శాండ్విచ్ కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసులు, పచ్చిబఠాణి – 1 కప్పు, మొక్కజొన్న గింజలు – అరకప్పు, క్యాప్సికమ్ – 1(సన్నగా తరగాలి), ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), టొమాటో – 1 (సన్నగా తరగాలి), నూనె – 1 టీ స్పూన్, వెన్న, చీజ్, ఉప్పు – రుచికి తగినంత తయారి: ♦ మొక్కజొన్న గింజలు, పచ్చిబఠాణీలను కుక్కర్లో ఆవిరిమీద ఉడికించాలి. ♦ మూకుడులో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్ తరుగు వేసి వేయించాలి. ♦ ఉడికించిన మొక్కజొన్న గింజలు, బఠాణీలను మూకుడులో వేసి కలపాలి. దీనికి టొమాటో ముక్కలను చేర్చి ఉప్పు వేసి కలపాలి. ♦ ఈ పదార్థాల మిశ్రమాన్ని బ్రెడ్‌పైన సర్ది పైన మరో బ్రెడ్ పెట్టి గట్టిగా అదిమి వెన్న పూయాలి. ♦ పెనం వేడి చేసి బ్రెడ్‌ను గోధుమరంగు వచ్చేవరకు కాల్చి దించుకోవాలి. ♦ ఇలా తయారుచేసుకున్న బ్రెడ్‌ని టొమాటో సూప్‌తో అందివ్వాలి. -
రా... డిష్
ముల్లంగిని ఇంగ్లిష్‌లో ‘రాడిష్’ అంటారు. చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది గానీ మంచి ఘాటు. ఎవరూ ప్రేమించడానికి రెడీగా ఉండరు. ముల్లంగి కూర చేతిలో పట్టుకొని అమ్మలు కుస్తీలు పట్టాల్సిందే తప్ప పిల్లలు గుటక మింగరు... కానీ, ఈ ఘాటు వైట్ వండర్ని సరిగ్గా వండితే అందరూ .. రా .. రా... రా... డిష్ అంటారు. కూటు కావల్సినవి: ముల్లంగి – 1 (తురమాలి), ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, పెసరపప్పు – అర కప్పు, నూనె – టీ స్పూన్ గ్రైండింగ్‌కి: పచ్చికొబ్బరి తురుము – కప్పు, జీలకర్ర – టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బియ్యప్పిండి – టేబుల్‌స్పూన్ పోపుకోసం: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఎండుమిర్చి – 1 (ముక్కలు చేయాలి), ఇంగువ – చిటికెడు తయారీ: ∙పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టాలి. ∙గ్రైండింగ్ కోసం తీసుకున్న పదార్ధాలన్నీ మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి. ∙పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. దీంట్లో పెసరపప్పు వేసి కలపాలి. పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. పోపుకోసం విడిగా మరో కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, పోపు దినుసులు వేసి కలపాలి. ఈ పోపు మిశ్రమాన్ని కూటులో వేసి కలపాలి. శాండ్విచ్ కావల్సినవి: బ్రెడ్ స్లైసులు – 4, ముల్లంగి– 1 (చిన్నది), క్యాప్సికమ్ – సగం ముక్క, నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్‌మసాలా – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి – 1 (తరగాలి), ఛీజ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ: ∙ముల్లంగిని శుభ్రం చేసి, సన్నగా తరగాలి. దీనిని గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, మిరియాలపొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ∙బ్రెడ్ స్లైస్‌లకు బటర్ రాయాలి. దీనిపైన ముల్లంగి మిశ్రమం ఉంచి, ఆ పైన సన్నగా కట్ చేసిన 3–4 క్యాప్సికమ్ ముక్కలను ఉంచాలి. ఆ పైన ఛీజ్ తురుము వేయాలి. పైన మరో బ్రెడ్ స్లైస్ ఉంచాలి. గ్రిల్ లేదా పెనం మీద ఈ బ్రెడ్ స్లైస్ ఉంచి, రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చి తీయాలి. పదునైన కత్తితో త్రికోణాకృతిలో కట్ చేసి, టొమాటో, పుదీనా చట్నీతో వెంటనే సర్వ్ చేయాలి. పరాటా పరాటా కావల్సినవి: గోధుమపిండి – 2 కప్పులు, ముల్లంగి తురుము – కప్పు, ముల్లంగి ఆకుల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – 1 (తరగాలి), గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాలపొడి – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నోట్: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు. తయారీ: ∙ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి. ∙ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దను కవర్ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ∙ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్ చేయాలి. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి. స్టఫ్డ్ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. పెరుగు పచ్చడి కావల్సినవి: ముల్లంగి తరుగు – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – తగినంత పోపుకోసం: నూనె – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2 (తరగాలి), ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – టీ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి, ముల్లంగి తరుగు వేసి వేయించాలి. మంచి గోధుమరంగు వచ్చేవరకు వేయించి దీంట్లో 2–3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ∙ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. దీంట్లో ముల్లంగి మిశ్రమం వేసి కలపాలి. అన్నం, పరాటాలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. సాంబార్ కావల్సినవి: ముల్లంగి – 2 (పైన తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి), టొమాటో – 1 (ముక్కలుగా తరగాలి), చింతపండు – నిమ్మకాయంత పరిమాణం, కందిపప్పు – కప్పు (మెత్తగా ఉడికించి, పక్కన ఉంచాలి), సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత పోపుకోసం: నువ్వుల నూనె – టేబుల్ స్పూన్, ఆవాలు – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేయాలి. తర్వాత దీంట్లో టొమాటో, ముల్లంగి ముక్కలు, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించాక దీంట్లో చింతపండు రసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా దీంట్లో మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమం వేసి కలపాలి. తర్వాత ఇంగువ వేసి మంట తీసేయాలి. చివరగా కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. -
ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా!
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ ధర ఎంతో ఉంటుందో మీకు తెలుసా..! 214 డాలర్లు. అంటే దాదాపు అక్షరాల పద్నాలుగు వేల రూపాయల వరకు అన్నమాట. అమ్మో అని ఆశ్చర్యపోతున్నారా.. మరి అంతేనండి. న్యూయార్క్ లోని సెరిండిపిటి అనే ఓ కాస్ట్లీ రెస్టారెంట్ దీనిని తయారు చేసింది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటుకూడా దక్కించుకుంది. అంతేకాదు ఆ సాండ్ విచ్ కావాలంటే అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సిందే. రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తే వారు తయారు చేసి ఇస్తారు. లేదంటే కష్టమే. బంగారు వర్ణంతో తయారు చేసే ఈ సాండ్ విచ్ ఒక్కసారి తింటే ఇంత ధర పెట్టామా అనే ఆలోచన కూడా మనసులో రాదంట. ఈ సాండ్ విచ్ ద్వారా తన రెస్టారెంటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాధించపట్ల దాని యజమాని తెగ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచ సాండ్ విచ్ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. -
శాండ్విచ్ ఆర్డర్ చేస్తే.. ఫుల్ క్యాష్ బ్యాగ్ పంపారు!
న్యూయార్క్: ఓ మహిళ శాండ్విచ్ ఆర్డర్ చేస్తే ఏకంగా క్యాష్ బ్యాగ్ ఇచ్చేశారు. ఆ మహిళా బ్యాగ్ తెరిస్తే నిండా నగదు ఉంది. పొరబాటు జరిగిందని తెలుసుకున్న ఆమె రెస్టారెంట్‌కు వచ్చి బ్యాగ్‌ను తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. జనెల్లె జోన్స్ అనే ఆవిడ కారులో ఇంటికి వెళ్తూ స్వీట్ టీ, చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశారు. రెస్టారెంట్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓ బ్యాగ్ అందజేశారు. జోన్స్ బ్యాగ్ తెరవగా శాండ్విచ్ బదులుగా అందులో 2,631డాలర్లు అంటే భారత్ కరెన్సీలో 1, 61,349 రూపాయలు ఉన్నాయి. జోన్స్ ఈ విషయాన్ని వెంటనే తన భర్త మాథ్యూ జోన్స్‌కు చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి రెస్టారెంట్‌కు వెళ్లి క్యాష్ బ్యాగ్‌ను తిరిగి ఇచ్చేశారు. రెస్టారెంట్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు చెప్పారు. రెస్టారెంట్ మేనేజర్ తమకు ఐదు భోజనాలు ఫ్రీగా ఆఫర్ చేసినట్టు జనెల్లె జోన్స్ చెప్పారు. -
న్యూటెల్లా సాండ్విచ్