
కార్న్ శాండ్‌విచ్
కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసులు, పచ్చిబఠాణి – 1 కప్పు, మొక్కజొన్న గింజలు – అరకప్పు, క్యాప్సికమ్ – 1(సన్నగా తరగాలి), ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), టొమాటో – 1 (సన్నగా తరగాలి), నూనె – 1 టీ స్పూన్, వెన్న, చీజ్, ఉప్పు – రుచికి తగినంత
తయారి:
♦ మొక్కజొన్న గింజలు, పచ్చిబఠాణీలను కుక్కర్‌లో ఆవిరిమీద ఉడికించాలి.
♦ మూకుడులో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్ తరుగు వేసి వేయించాలి.
♦ ఉడికించిన మొక్కజొన్న గింజలు, బఠాణీలను మూకుడులో వేసి కలపాలి. దీనికి టొమాటో ముక్కలను చేర్చి ఉప్పు వేసి కలపాలి.
♦ ఈ పదార్థాల మిశ్రమాన్ని బ్రెడ్‌పైన సర్ది పైన మరో బ్రెడ్ పెట్టి గట్టిగా అదిమి వెన్న పూయాలి.
♦ పెనం వేడి చేసి బ్రెడ్‌ను గోధుమరంగు వచ్చేవరకు కాల్చి దించుకోవాలి.
♦ ఇలా తయారుచేసుకున్న బ్రెడ్‌ని టొమాటో సూప్‌తో అందివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment