శాండ్‌విచ్‌.. పోషకాలు రిచ్‌.. | Sandwich in Guinness Records | Sakshi
Sakshi News home page

శాండ్‌విచ్‌.. పోషకాలు రిచ్‌..

Nov 3 2024 8:44 AM | Updated on Nov 3 2024 9:18 AM

Sandwich in Guinness Records

శాండ్‌విచ్‌ నగరంలో అత్యంత క్రేజీ స్నాక్స్‌లో ఒకటి. అల్పాహారం, భోజనం లేదా సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్‌ డిన్నర్‌గా కూడా తీసుకోగలిగిన ఏకైక ఫుడ్‌ ఐటమ్‌. దీంతో నగరంలో ఫుడ్‌ లవర్స్‌కి మాత్రమే కాదు యువత నుంచి ముసలి వారి వరకూ, ఉద్యోగుల నుంచి లైట్‌ ఫుడ్‌ని తీసుకునేవారి వరకూ  బాగా దగ్గరైన ఫుట్‌ ఐటమ్‌గా చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉండే ఈ రుచికరమైన శాండ్‌విచ్‌ పోషకాహారంగా కూడా పేరొందింది. 

బ్రిటిష్‌ పాలకుడు జాన్‌ మోంటాగు 18వ శతాబ్దంలో రెండు బ్రెడ్‌ ముక్కల మధ్యలో మటన్‌ స్లైసెస్‌ ఉంచి సర్వ్‌ చేయమని సిబ్బందిని ఆదేశించాడట. దాని వల్ల తాను అవి తింటూనే పేకాట ఆడు కోవచ్చని ఆయన భావించాడట. అలా పుట్టిన శాండ్‌విచ్‌ ఆ తర్వాత క్రమంలో విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. మన భాగ్యనగరంలోనూ సిటిజనులకు ఫేవరెట్‌ ఫుడ్‌ ఐటమ్‌గా అవతరించింది. తయారీ సులువుగా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటం కూడా శాండ్‌విచ్‌ పాప్యులర్‌ అవ్వడానికి ప్రధాన కారణం.. కనీసం రూ.100 మొదలుకుని రూ.600 దాకా కూడా నగరంలో విభిన్న రకాల శాండ్‌విచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ట్రెడిషన్స్‌ను కలుపుకుంటూ టేస్టీగా.. 
బ్రిటీష్‌ డచ్‌ జాతీయులు యూరోపియన్‌ బ్రెడ్‌–మేకింగ్‌ పద్ధతులను మన నగరం స్వీకరించి సంప్రదాయ మసాలా దినుసులు. నాన్, రోటీ వంటి స్థానిక ఫ్లాట్‌బ్రెడ్‌లను కూడా ఉపయోగించి సరికొత్త శాండ్‌విచ్‌ రుచులను సృష్టించింది. ‘టిక్కా మసాలా వంటి మన 
సంప్రదాయ రుచులు శాండ్‌విచ్‌లలో చేర్చారు’ అని మకావు రెస్టారెంట్‌ హెడ్‌ చెఫ్‌ రవి చెబుతున్నారు. ‘కేఫ్‌కి వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ వెరైటీ కోసం చూస్తారు. అందుకే సోర్‌డౌ శాండ్‌విచ్‌ల నుంచీ క్రోసెంట్‌ బన్స్‌ వరకూ మెనూలో చేరుతున్నాయి’ అని చెఫ్‌ ఫ్రాన్సిస్‌ అభిప్రాయపడ్డారు. స్థానిక అభిరుచులకు గ్లోబల్‌ ట్రెండ్‌ మిళితం చేసి అవొకాడో లేదా పెస్టోతో  ఓపెన్‌–ఫేస్డ్‌ శాండ్‌విచ్‌లను కూడా ఇక్కడి కేఫ్స్‌ పరిచయం చేశాయి. మారుతున్న ఆధునికుల అభిరుచికి అనుగుణంగా వీగాన్‌ శాండ్‌విచ్‌లు కూడా  అందుబాటులోకి వచ్చాయి.

బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకూ..
శాండ్‌విచ్‌లను చాలా సులభంగా ఇంట్లో సైతం వేగంగా తయారు చేయవచ్చు. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ నుంచి మిడ్‌ డే స్నాక్స్‌గానూ, సాయంత్రం టీ టైమ్‌ దాకా ఎనీ టైమ్‌ శాండ్‌విచ్‌ బెస్ట్‌ కాంబినేషన్‌.. నచి్చన కూరగాయలను లేదా విభిన్న రకాల మేళవింపులను దీనికి జతగా ఉపయోగించవచ్చు. రుచికరమైన సాస్‌లు, చీజ్‌లతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్‌ మేళవింపునకు అనుకూలం కావడంతో ఆరోగ్యకర పోషకాహారంగానూ ప్రాచుర్యం పొందింది.

ఇంట్లోనే.. రుచికరంగా..
రుచికరమైన శాండ్‌విచ్‌ చేయడానికి ఎల్లప్పుడూ చీజ్, బ్రెడ్‌ రెండూ కలపడం మంచిది. సోర్డోఫ్‌ బ్రెడ్, చీజ్‌ తాజా దోసకాయ ముక్కలతో దోసకాయ–చీజ్‌ శాండ్‌విచ్, సాయంత్రం టీ సమయంలో తినాలనిపిస్తే, బ్రెడ్‌ మష్రూమ్‌లను ఉపయోగించి మష్రూమ్‌ శాండ్‌విచ్‌ తయారు చేయవచ్చు. దీనికి వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మోజారెల్లా చీజ్, బ్రెడ్‌ స్లైసెస్, మసాలా దినుసులు జోడించవచ్చు. మొక్కజొన్న, బ్రోకలీ, బెల్‌ పెప్పర్స్, టొమాటోలు వంటి తాజా కూరగాయల కలయికతో ఇంట్లో తయారుచేసిన స్ప్రెడ్‌లు, సాస్‌లతో వెజ్‌ శాండ్‌విచ్‌ తయారు చేయవచ్చు. ఇదే విధంగా చికెన్, ఎగ్స్‌ రకరకాల మేళవింపులతో నాన్‌వెజ్‌ వెరైటీలూ తయారు చేసుకోవచ్చు. సూప్స్‌ నుంచి తేనీటీ దాకా పీనట్‌ బటర్‌ నుంచి జామ్‌ దాకా ఏ కాంబినేషన్‌లోనైనా అమరిపోతాయి. రోస్ట్‌ చికెన్, మస్టర్డ్‌ శాండ్‌విచ్‌ స్పినాచ్‌ అండ్‌ కార్న్, రోస్టెడ్‌ వెజిటబుల్‌ అండ్‌ ఛీజ్‌ వంటి ఫిల్లింగ్స్‌తో ఇంట్లో వీట్‌ బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు.

నగరం నలువైపులా.. 
నగరంలో దాదాపు అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో రుచికరమైన శాండ్‌విచ్‌ వెరైటీలు లభిస్తాయి. అలా చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని ఎగ్‌ బటర్‌తో బేక్‌ చేసిన ఫ్రెంచ్‌ బ్రెడ్‌ మెల్ట్‌         శాండ్‌విచ్‌లు ప్యాటీ మెల్ట్‌ పేరుతో మాదాపూర్‌లోని సిగుస్తా అందిస్తుండగా, గండిపేటలోని బృందావన్‌ కాలనీలోని కేఫ్‌ శాండ్‌విచో, అలాగే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లో ఉన్న రోస్టరీ కేఫ్, మాదాపూర్‌లోని బేక్‌లోర్, నగరంలో పలు చోట్ల ది బేక్‌ ఫ్యాక్టరీ, అమెరికన్‌ శాండ్‌విచ్‌లకు పేరొందిన హిమాయత్‌ నగర్‌లోని కింగ్‌ అండ్‌ కార్డినల్, సింధి కాలనీలోని చత్వాలా, 
కొండాపూర్‌లోని శాండ్‌విచ్‌ స్క్వేర్, జూబ్లీహిల్స్‌ లోని కోర్ట్‌యార్డ్‌ కేఫ్స్‌ కూడా శాండ్‌విచ్‌లకు పేరొందాయి. ఇక శాండ్‌ విచ్‌ ఈటరీ పేరుతో నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకించిన ఔట్‌లెట్స్‌ ఫుడ్‌ లవర్స్‌కి చిరునామాగా మారాయి. ‘మాంసం లేదా చీజ్‌తో నిండిన బ్రెడ్‌ లేదా పేస్ట్రీ కలయికలు, మసాలా దినుసులు ధరించడం పురాతన కాలం నుండి ఆనందించబడింది’ అని ఫ్యూ డెసర్ట్, బార్‌ మరియు కిచెన్‌లో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ జో ఫ్రాన్సిస్‌ వివరించారు.   

గిన్నిస్‌ రికార్డ్స్‌లో శాండ్‌విచ్‌..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌ కూడా ఉంది. గిన్నిస్‌ రికార్డుల ప్రకారం.. పేరొందిన అంతర్జాతీయ చెఫ్‌ జోయ్‌ కాల్డరోన్‌ తయారు చేసిన గ్రిల్డ్‌ ఛీజ్‌ శాండ్‌ విచ్‌ 214 డాలర్లు అంటే దాదాపు భారతీయ కరెన్సీలో రూ.17వేల ఖరీదు చేస్తుందట. న్యూయార్క్‌లోని 3 రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. షాంపేన్‌ తదితర ఖరీదైన వాటిని ఇందులో మేళవించడమే దీనికి కారణమట. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement