కొన్ని రకాల ఫ్యాషన్ బ్రాండ్‌ల ధర వింటే మతిపోతుంది. ఎందుకింత ధర అనిపించేలా ఉంటుంది. పైగా ఆ వస్తువుకి అంత ధర వెచ్చించాల్సినంత విశేషాలేంటో కూడా తెలియదు. అలాటి సరికొత్త ప్రొడక్ట్‌ని ఓ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దాని ధర వింటే మాత్రం కంగుతినడం ఖాయం. ఇంతకీ ఆ కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్‌ని రూపొందించింది. ఏంటా వస్తువు అంటే..
వివరాల్లోకెళ్తే.. ప్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ శాండ్‌విచ్ బ్యాగ్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్యాగ్‌ని ఆవు చర్మంతో శాండ్‌విచ్ మాదిరిగా రూపొందించారు. దీన్ని ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ రూపొందించారు. అతను ఇలా సరికొత్త మోడల్‌లో శాండ్‌విచ్ బ్యాగ్‌ని రూపొందిచడానికి క్లాసిక్ పేపర్‌తో చేసిన శాండ్‌విచ్ బ్యాగ్ ప్రేరణ అని పేర్కొంది. ఈ బ్యాగ్‌లను జనవరి 4న మార్కెట్లో విడుదల చేసి, అమ్మకానికి సిద్ధం చేశారు.
ఈ బ్యాగ్ ఫీచర్స్ చూస్తే..ఆవు చర్మంతో తయారయ్యిన లెదర్ బ్యాగ్ బ్రౌన్ కలర్‌లో ఉండగా, క్లోజ్ చేయడానికి నీలం కలర్ ఉంటుంది. ఆ బ్యాగ్‌పై లూయిస్ విట్టన్' 'మైసన్ ఫాండీ ఎన్ 1854' అక్షరాలు ఉంటాయి. జిప్‌తో కూడిన పాకెట్‌లు ఉంటాయి. లోపల వస్తువులు క్రమబద్ధంగా పెట్టుకునేలా డబుల్ ఫ్లాటెడ్ పాకెట్‌లు ఉంటాయి. ఈ బ్యాగ్ పొడవు 30 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు, వెడల్పు 17 సెంటీమీటర్లు ఉంటుంది.
కాగా, ఈ ఫ్రెంచ్ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర ఏకంగా రూ 2,80,000 పలుకుతోంది. ఇది చూడటానికి మన ఇంట్లో ఉండే షాపింగ్ బ్యాగ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ శాండ్‌విచ్ బ్యాగ్ ధర నెట్టింట్ వైరల్‌గా మారింది. బహుశా ఇది ఏఐ టెక్నాలజీ రూపొందించిన బ్యాగ్ కాబోలని ఒకరూ, ఇలాంటి అత్యంత లగ్జరియస్ బ్యాగ్‌లు కూడా ఉండాలని మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మిస్ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి)
Comments
Please login to add a commentAdd a comment