హాట్‌టాపిక్‌గా మారిన మహేశ్‌ బాబు టీషర్ట్‌.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Do You Know The Price Of Simple T-Shirt Worn By Mahesh Babu In Animal Pre-Release Event - Sakshi
Sakshi News home page

Mahesh Babu: యానిమల్‌ ఈవెంట్‌లో.. మహేశ్‌ బాబు వేసుకున్న టీషర్ట్‌ ధర ఎంతో తెలుసా?

Published Wed, Nov 29 2023 12:11 PM | Last Updated on Wed, Nov 29 2023 12:57 PM

Do You Know The Price Of Simple T Shirt Worn By Mahesh Babu In Animal Event - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోగా దూసుకుపోతున్న మహేశ్‌ తాజాగా యానిమల్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్‌ బాబు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.

సింపుల్‌ టీ షర్ట్‌లో క్లాసీ లుక్స్‌తో కనిపించాడు. దీంతో మహేశ్‌ ధరించిన టీ షర్ట్‌ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్‌ బాబు యానిమల్‌ ఈవెంట్‌కు ధరించిన టీషర్ట్‌ ధర ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇది 'గివెంచి' బ్రాండ్‌కు సంబంధించినది.చూడటానికి సింపుల్‌గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్‌ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్‌ టీషర్ట్‌ ఏకంగా ఇంత కాస్ట్‌లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement