లండన్: లాక్‌డౌన్ సమయంలో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడం చూసి మనం ఔరా అనుకున్నాం. తనకిష్టమైన మెక్ డొనాల్డ్ బర్గర్ కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల కోవిడ్ ఆంక్షలను లెక్కచేయకుండా 100 మైళ్లకు పైగా ప్రయాణం సాగించింది. ఆ తర్వాత పోలీసు అధికారులు ఆమెకు జరిమానా కూడా విధి౦చారు.
ఇదే తరహా ఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరొకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనకు నచ్చిన శాండ్‌విచ్ కోసం ఏకంగా 130 కిలోమీటర్లు హెలికాప్టర్‌లో ప్రయాణించాడు. నోరూరించే శాండ్‌విచ్ ఆరగించి వార్తల్లో నిలిచాడు. వివరాలు.. చిప్పింగ్ ఫార్మ్ షాప్‌లో ఓ వ్యక్తి తను ఆర్డర్ చేసిన శాండ్ విచ్ కోసం ఏకంగా హెలికాప్టర్‌లో ప్రత్యక్షమైయ్యాడు.
ఆర్డర్ తీసుకుని అదే చాపర్‌లో వెనుదిరిగాడు. ఈ వీడియోను షాపు యాజమాన్యం ఇన్‌ష్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నాలుగు లక్షలకుపైగా యూజర్లు వీక్షించగా, వారి నుంచి వందల కొద్దీ కామెంట్లు వస్తున్నాయి. "శాండ్ విచ్ అని కాకుండా.. ది చాపర్ వూపర్ ' అని పేరు మార్చండి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ‘ఆ శాండ్ విచ్ లు అంతగా బాగుంటాయేమో’అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment