ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా! | World's Most Expensive Sandwich Made, Costs 214 Dollars | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా!

Published Wed, Jun 17 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా!

ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా!

న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ ధర ఎంతో ఉంటుందో మీకు తెలుసా..! 214 డాలర్లు. అంటే దాదాపు అక్షరాల పద్నాలుగు వేల రూపాయల వరకు అన్నమాట. అమ్మో అని ఆశ్చర్యపోతున్నారా.. మరి అంతేనండి. న్యూయార్క్ లోని సెరిండిపిటి అనే ఓ కాస్ట్లీ రెస్టారెంట్ దీనిని తయారు చేసింది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటుకూడా దక్కించుకుంది. అంతేకాదు ఆ సాండ్ విచ్ కావాలంటే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సిందే.

రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తే వారు తయారు చేసి ఇస్తారు. లేదంటే కష్టమే. బంగారు వర్ణంతో తయారు చేసే ఈ సాండ్ విచ్ ఒక్కసారి తింటే ఇంత ధర పెట్టామా అనే ఆలోచన కూడా మనసులో రాదంట. ఈ సాండ్ విచ్ ద్వారా తన రెస్టారెంటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాధించపట్ల దాని యజమాని తెగ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచ సాండ్ విచ్ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement