ఫ్రాన్స్: చాలాకాలం క్రితం రోమ్ నగరం తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతోంది. తాజాగా అదే కథనాన్ని గుర్తు చేస్తూ ఒకపక్క ఫ్రాన్స్ దేశంలో అల్లర్లు చెలరేగుతుంటే మధ్యలో కూర్చుని ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ కనిపించాడు.
పారిస్ లోని నాంటెర్రేలో ట్రాఫిక్ స్టాప్ వద్ద నల్ల జాతీయుడైన 17 ఏళ్ల యువకుడు నాహేల్ ను పోలీసులు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఘర్షణలు పెచ్చుమీరేలా చేశారు.
పోలీసులకు ఆందోళనకారులకు మధ్య పరస్పర దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.
పారిస్ పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలతో ఒకపక్క అంతటి విధ్వంసం చెలరేగుతుంటే మరోపక్క ఒక యువకుడు మాత్రం ఇదేమీ పట్టనట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చుని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.
🚨🇫🇷INSOLITE - Un homme continue de manger son sandwich alors qu'il est au milieu de violents affrontements entre émeutiers et policiers à #Nanterre. (témoins) pic.twitter.com/VzLtpfRmty
— AlertesInfos (@AlertesInfos) June 29, 2023
ఇది కూడా చదవండి: మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment