
కాన్సాస్: సాండ్ విచ్ తినలేదన్న కోపంతో కన్నకొడుకుని కొట్టి చంపిన నేరానికి ఆ తల్లికి అమెరికాలో కోర్టు 19ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అదే నేరంలో పాల్గొన్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాన్సాస్‌లో విచితకు చెందిన ఎలిజబెత్ వూల్‌హీటర్ గత ఏడాది రెండేళ్ల వయసున్న తన కుమారుడు ఆంటోనీకి ‘హాట్‌డాగ్’ సాండ్‌విచ్ తినమని ఇచ్చింది. ఆ బాలుడు నిరాకరించడంతో బాగా కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయస్థానం తల్లికి 19 ఏళ్ల 5 నెలలు ఖైదు, నేరంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment