Two year old boy
-
రెండేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
సాక్షి, మధురవాడ (భీమిలి): కొందరు చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరుస్తుంటారు. ఇటువంటివాళ్లను చూసి ఇది గాడ్ గిఫ్ట్ అంటాం. ఈ చిన్నారి విషయంలో మదర్ గిఫ్ట్ కూడా ఉంది. తన బిడ్డను తీర్చిదిద్దిన వైనం రికార్డులు తెచ్చిపెట్టింది. రెండేళ్ల వయసులోనే జ్ఞాన్దేవ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన గంధం అమిత ప్రియ ఏకైక కుమారుడు జ్ఞాన్దేవ్. బాలుడు తల్లి అమిత ప్రియ గీతం యూనివర్సిటీలో ఎం.కామ్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రి మనోహర్, తల్లి ఈశ్వరి కుమారీల సంరక్షణలో ఉంటుంది.అమితప్రియ రెండేళ్ల కుమారుడు జ్ఞాన్దేవ్కు 6 జాతీయ చిహ్నాలు , 12 రాశి ఫలాలు, 24 వాహనాలు, 13 రకాలు పండ్లు, 21 సంగీత పరికరాలు, 13 సముద్ర జీవ రాశులు, 10 చారిత్రక స్థలాలు, 10 స్టేషనరీ వస్తువులు, 10 కంప్యూటర్ విడిభాగాలు, 10 రకాల క్రీడల బంతులు, 8 ఇండియన్ సీఈవోలు, 5 ప్రార్థనా స్థలాలు, 6 మతాలు, 8 రకాల నీటి మొక్కల మూలాలు, 9 మంచి అలవాట్లు గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. అలాగే 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: (విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి) -
పాపం పసివాడు.. తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి!
సాక్షి, ఖైరతాబాద్: అప్పటివరకు గోరుముద్దలు తినిపించిన తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి రెండున్నరేళ్ల బాలుడు ఇంటిముందు ఉన్న సంపులో పడి మృతిచెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్, బీజేఆర్‌నగర్‌కు చెందిన ఉపేందర్, నాగేశ్వరి దంపతులకు అభినయ్(2.5 ) కుమారుడు ఉన్నాడు. ఉపేందర్ గత కొంత కాలంగా కర్నాటకలో ఉంటుండగా నాగేశ్వరి కుమారుడితో కలిసి రేకుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి బాబుకు అన్నం తినిపించి ఇంట్లోకి వెళ్లింది. అరగంట తర్వాత బయటికి వచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా నీటి సంపులో క నిపించాగు. చిన్నారికి బయటికి తీసి వెంటనే వాస వి హాస్పిటల్‌కు, అక్కడి నుంచి నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపుపై కప్పు లేనందునే ప్రమాదవశాత్తు బాలు డు అందులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంపులపై మూతలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చదవండి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ! -
రెండేళ్ల సుజిత్ కథ విషాదాంతం
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల సుజిత్ కథ విషాదాంతమైంది. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. గత శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు 72 గంటలు పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు 600 అడుగుల మేర లోతు ఉన్న బోరుబావిలో 100 అడుగుల దగ్గర సుజిత్ చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో బోరుబావి నుంచి తీసిన మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాలుడి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్‌లో తరలించారు. -
బోరుబావిలో పడిన బాలుడు సుజిత్ మృతి
-
బోరుబావిలో బాలుడు; కొనసాగుతున్నసహాయక చర్యలు
తిరుచురాపల్లి : తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో శుక్రవారం సాయంత్రం రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడ్డాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆరు రెస్య్కూ బలగాలతో పాటు, ఐఐటీ మద్రాస్ తయారు చేసిన రోబోటిక్ పరికరాన్ని తెప్పించారు. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిసింది. అయితే బాలుడు ఉన్న బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుచురాపల్లికి చెందిన రెక్టో అరోకియరాజ్, కళామేరీ దంపతులకు సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం తల్లి కళామేరీ ఇంట్లో పనిచేసుకుంటుంది. తండ్రి వేరే పనిలో నిమగ్నమవగా అదే సమయంలో సుజిత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బావిలో పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వ్యవసాయానికి నీళ్లు అవసరమవడంతో ఈ మద్యనే అరోకియాజ్ బోరు బావిని తవ్వించాడు. నీళ్లు సరిగా పడకపోడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు బోరు బావులను పూడ్చేయాలంటూ 2010లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
హాట్‌డాగ్ తినలేదని కొట్టి చంపేసింది
కాన్సాస్: సాండ్ విచ్ తినలేదన్న కోపంతో కన్నకొడుకుని కొట్టి చంపిన నేరానికి ఆ తల్లికి అమెరికాలో కోర్టు 19ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అదే నేరంలో పాల్గొన్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాన్సాస్‌లో విచితకు చెందిన ఎలిజబెత్ వూల్హీటర్ గత ఏడాది రెండేళ్ల వయసున్న తన కుమారుడు ఆంటోనీకి ‘హాట్‌డాగ్’ సాండ్విచ్ తినమని ఇచ్చింది. ఆ బాలుడు నిరాకరించడంతో బాగా కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయస్థానం తల్లికి 19 ఏళ్ల 5 నెలలు ఖైదు, నేరంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
రెండేళ్ల బాలుడిని మాంత్రికుడంటూ..
ఇది హృదయవిదారక దృశ్యం. కఠినాత్ములకు కూడా కన్నీళ్లు తెప్పించే చిత్రం. అన్న పానీయాలు లేకుండా అలమటిస్తూ గత 8 నెలలుగా వీధుల్లో తిరుగుతున్న రెండేళ్ల బాలుడి దైన్యం. వీధికుక్కలా చెత్తకుప్పల్లో దొరికే ఎంగిలి మెతుకులు తింటూ బక్కచిక్కిన బాలుడికి ఓ సామాజిక కార్యకర్త నీళ్లు తాగిస్తున్న దృశ్యం. పిల్లాడిలో మాంత్రికుడి లక్షణాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఈ బాలుడిని రోడ్డున పడేశారు. స్థానికులు కూడా పట్టించుకోలేదు. వీధిలో దొరికే కుళ్లిన ఎంగిలి మెతుకులు తినడం వల్ల పిల్లాడి కడుపులో పురుగులు కూడా పుట్టుకొచ్చాయి. 'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు, డానిష్ మహిళ అంజ రింగ్రెన్ లవెన్కు జనవరి 31వ తేదీన ఈ పిల్లాడు తారసపడ్డాడు. పిల్లాడి పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే బాలుడికి నీళ్లు తాపించి, కొంత తాజా ఆహారం అందించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చింది. ఆస్పత్రిలో పిల్లాడి కడుపు నుంచి పురుగులను తొలగించిన వైద్యులు ప్రతిరోజు పిల్లాడికి రక్తమార్పిడి చేస్తున్నారు. ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందేవరకు ఇలా చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చులు భారీగా ఉంటుండంతో డానిష్ మహిళ లవెన్ విరాళాల కోసం సోషల్ వెబ్సైట్ 'ఫేస్బుక్'ను ఆశ్రయించారు. పిల్లాడి పరిస్థితిని వివరించేందుకు వరుస ఫొటోలను పోస్ట్ చేశారు. ఆదివారం నాటికి ఆమెకు ఆరున్నర కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. వాటిని పిల్లాడి వైద్యం కోసం ఖర్చు చేస్తానని, మిగిలిన డబ్బులను పిల్లల వైద్యశాలను నిర్మించడం కోసం వెచ్చిస్తానని లవెన్ వివరించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నారని, ముఖాన నవ్వు కూడా విరిసిందని, తన కుమారుడితో ఆడుకుంటున్నాడని అమె తెలిపారు. నైజీరియాలో వేలాదిమంది పిల్లలను క్షుద్రపూజలు చేసే మాంత్రికులుగా భావించి హింసిస్తారని, వీధిల్లో వదిలేస్తారని ఆమె చెప్పారు. అలాంటి అనాథ పిల్లలను ఆదుకొని, వారికి విద్యాబుద్ధులు చెప్పించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఆమె భర్త డేవిడ్ ఇమాన్యుయేల్ కూడా ఫౌండేషన్ పనులను చూసుకోవడంలో ఆమెకు సహకరిస్తున్నారు. -
ఈ బుడ్డోడు.. భలే హుషారు
న్యూయార్క్: సాధారణంగా చిన్నపిల్లలంటే అందరికీ ముచ్చటే. వారు ఏం చేసినా ఆశ్చర్యంగా చూడాలనిపిస్తుంది. వాళ్లు ఎలాంటి హాస్యం పండించకుండానే మన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అలాంటిది మనం చెప్పింది చెప్పినట్లు బుడిబుడినడకలకు ముందే చేస్తుంటే ఆ పిల్లాడ్ని చూసి ఎంతటి ఆశ్యర్యం వేస్తుంది.. సరిగ్గా అంతే ఆశ్చర్యాన్ని గొలిపాడు రెండేళ్ల బాలుడైన జాన్ డేవిడ్ మారిన్. అది కూడా అతడు డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతు. అలబామాకు చెందిన జాన్ తన తల్లి ఎలా చెప్తే అలా చేస్తూ వారిని ముచ్చటగొలిపాడు. ముఖ్యంగా అతడి తల్లి ఏబీసీడీలు చెప్తుంటే.. చాలా చక్కగా హావభావాలు పలికిస్తూ అవే అక్షరాలు తిరిగి చెప్పాడు. కానీ, ఒక డబ్ల్యూ మాత్రం చెప్పలేక మరింత ఆశ్చర్యపోయేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సమాధానం చెప్పాడు. దీంతో ఆ పిల్లాడి అమ్మ, అమ్మమ్మ గుడ్ జాబ్ అంటూ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేశారు. డౌన్ సిండ్రోమ్ అనే జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడేవారికి సాధారణంగా ఆకళింపు అంతగా ఉండదు. ఈ వీడియోను ఇప్పటికే కోటి ముప్పై లక్షల మంది చూశారు.