ఈ బుడ్డోడు.. భలే హుషారు
న్యూయార్క్: సాధారణంగా చిన్నపిల్లలంటే అందరికీ ముచ్చటే. వారు ఏం చేసినా ఆశ్చర్యంగా చూడాలనిపిస్తుంది. వాళ్లు ఎలాంటి హాస్యం పండించకుండానే మన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అలాంటిది మనం చెప్పింది చెప్పినట్లు బుడిబుడినడకలకు ముందే చేస్తుంటే ఆ పిల్లాడ్ని చూసి ఎంతటి ఆశ్యర్యం వేస్తుంది.. సరిగ్గా అంతే ఆశ్చర్యాన్ని గొలిపాడు రెండేళ్ల బాలుడైన జాన్ డేవిడ్ మారిన్. అది కూడా అతడు డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతు.
అలబామాకు చెందిన జాన్ తన తల్లి ఎలా చెప్తే అలా చేస్తూ వారిని ముచ్చటగొలిపాడు. ముఖ్యంగా అతడి తల్లి ఏబీసీడీలు చెప్తుంటే.. చాలా చక్కగా హావభావాలు పలికిస్తూ అవే అక్షరాలు తిరిగి చెప్పాడు. కానీ, ఒక డబ్ల్యూ మాత్రం చెప్పలేక మరింత ఆశ్చర్యపోయేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సమాధానం చెప్పాడు. దీంతో ఆ పిల్లాడి అమ్మ, అమ్మమ్మ గుడ్ జాబ్ అంటూ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేశారు. డౌన్ సిండ్రోమ్ అనే జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడేవారికి సాధారణంగా ఆకళింపు అంతగా ఉండదు. ఈ వీడియోను ఇప్పటికే కోటి ముప్పై లక్షల మంది చూశారు.