ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది.
ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. డౌన్‌సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్‌గా దూసుకుపోతోంది.
ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్‌బ్రెడ్ బై అనే బ్రాండ్‌తో ప్రముఖ బేకర్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా.
"మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్‌ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్‌గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్‌ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్‌గా కూర్చొండిపోలే.
లాస్ట్‌ని ఫస్ట్‌గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది.
ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా.
(చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment