మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్‌లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..
విదేశాల్లోని మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, హీరోయిన్‌లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది.
ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..
లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం.
నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్‌ఫుల్‌గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.
(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!)
Comments
Please login to add a commentAdd a comment