అన్ని సక్రమంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తిప్పలు పడుతుంటారు. అందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. కానొ కొందరూ భయానక సవాళ్లును దాటుకుంటూ అసాధ్యం అనే దాన్ని కూడా సాధించి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిదే అనా విక్టోరియా.
మెక్సికోలోని జకాటెకాస్‌కు చెందిన అనా విక్టోరియా ఎస్పినో డి శాంటియోగా డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అనా జూలై 2024లో యూనివర్సిడాడ్ అటోనోమా డి జకాటెకస్ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసంలో అనేక సవాళ్ల ఎదుర్కొన్నప్పటికీ..ఒక ప్రొఫెసర్ సాయంతో తన కలను సాకారం చేస్తుకుంది. ఆయన మార్గనిర్దేశంలో డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ విద్యలో డిగ్రీని సాధించిన అరుదైన వ్యక్తిగా నిలిచింది.
జనవరి 30, 1999న జన్మించిన అనా ఓచోవా, ఎస్పినో జపాటాల కుమార్తె. ఆమె తన విద్యను ఆన్‌లైన్లోనే పూర్తి చేసింది. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించేందుకు యూనివర్సిడాడ్ ఆటోనోమా డి జకాటెకాస్‌లో చేరింది. అయితే అక్కడ నిర్థిష్ట అవసరాలున్న తనలాంటి వ్యక్తులకు పాఠాలు భోధించే విధానం లేక చాలా ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ఆమె దృఢ సంకల్పమే సాయం చేసే మంచి ప్రొఫెసర్ చెంతకు చేరేలా చేసింది. ఆయన అండదండలతో న్యాయపరమైన అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని అధిగమించగలిగింది.
అనా న్యాయవాదిగా అవ్వడానికి ముందు తనలాంటి వికలాంగుల హక్కుల కోసం వాదించే శాసనఫోరమ్‌లలో పనిచేసేది. ఇది తనకు న్యాయరంగ పట్ల అవగాహనను ఇవ్వడమే గాక భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేసింది. అలాగే అనా లాయర్‌గా వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, సమానత్వం కోసం వాదించాలని చూస్తోంది. ఇంతటి స్థితిలో కూడా అంకితభావంతో అనితరసాధ్యమైన తన కలను సాకారం చేసుకుని అందిరిచేత ప్రశంసలందుకోవడమే గాక విదేశాల నుంచి ఉద్యోగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక అనాకి పెయింటింగ్ కళలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 2014 నుంచి అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లను నిర్వహించింది. తన పెయింటింగ్లను 'డెస్టే మి సీ'లో పేరుతో ప్రదర్శించింది.
(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!)
Comments
Please login to add a commentAdd a comment