
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల సుజిత్ కథ విషాదాంతమైంది. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. గత శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు 72 గంటలు పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు 600 అడుగుల మేర లోతు ఉన్న బోరుబావిలో 100 అడుగుల దగ్గర సుజిత్ చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో బోరుబావి నుంచి తీసిన మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాలుడి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్‌లో తరలించారు.