mother killed son
-
డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి..
చండీగఢ్: డబ్బు విషయంలో భర్తతో గొడవపడి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ మహిళ. 8 ఏళ్ల కుమారుడ్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఉచ్చి బస్సి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు కాలువలో కొట్టుకుపోయాడని, ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. తరచూ గొవడ.. నిందితురాలి పేరు రీనా కుమారి. ఆమె భర్త పేరు రవి కుమార్. 2012లో వివాహం అయింది. వీరికి 10 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే డబ్బు సంపాదించడం కోసం రవి కుమార్ ఈ ఏడాది మాల్దీవ్స్ వెళ్లాడు. అతనితో రోజూ ఫోన్లో మాట్లాడే రీనా.. తరచూ డబ్బు పంపించమని గొడవపడేది. ఇలానే మంగళవారం కూడా డబ్బు పంపాలని అడిగింది. లేకపోతే ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరేస్తానంది. అయినా భర్త డబ్బులు పంపించకపోవడంతో రీనా విచక్షణ కోల్పోయింది. 8 ఏళ్ల కుమారుడ్ని తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
పైత్యం నశాలానికి.. పసిబిడ్డకు తిండి కరువు.. 18 నెలల వయసులోనే..
వాషింగ్టన్: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే. అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చదవండి: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత -
నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో!
A young man tragically murdered by his mother In Chennai తమిళనాడు: ట్రాన్స్జండర్ మహిళగా జీవిస్తానన్నందుకు తల్లే అతని పాటిట మృత్యువైంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో 19 యేళ్ల నవీన్ అనే వ్యక్తిని తల్లి ధారుణంగా హతమార్చింది. ఈ కేసులో అందిన సమాచారం మేరకు మృతుడు నవీన్‌కు ట్రాన్స్‌జండర్‌గా మారాలని ఉందని తరచూ తల్లి ఉమాదేవికి వద్దకొచ్చి చెబుతూ ఉండేవాడు. ఈక్రమంలో నవీన్ తన పేరును అక్షితగా మార్చుకున్నాడు కూడా. ఐతే ఉమాదేవి కొడుకును ట్రాన్స్‌జండర్‌గా మారవద్దని పలుమార్లు సూచించింది. నవీన్ నిరాకచించడంతో తల్లి మరో ఐదుగురి సహాయంతో అతనిపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన నవీన్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గత వారం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నవీన్‌ను అతని తల్లి ఉమాదేవి హత్య చేసినట్లు సేలం పోలీసుల దర్యాప్తులో తేలింది. మగవాడిగా ఉండేందుకు నవీన్ హార్మోన్లు తీసుకోవాలని ఉమాదేవి ఒత్తిడి చేసిందని, అందుకు నవీన్ నిరాకరించడంతో నిందితురాలు ఉమాదేవి, ఆమె సహచరులు నవీన్‌పై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉమాదేవితో పాటు వెంకటేష్, కామరాజ్, కార్తికేయ, సంతోష్, శివకుమార్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి
చెన్నై: వేలూరు: మూఢనమ్మకాలు ఓ బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. దెయ్యం పట్టిందని కన్న తల్లే కుమారుడిని కర్రతో కొట్టి హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది. వివరాలు.. అరియూర్ జేజేనగర్‌కు చెందిన కార్తీ, తిలగవది దంపతులకు కుమారుడు శబరి(7)ఉన్నారు. కార్తీ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శబరి పిట్స్ వ్యా«ధితో బాధపడే వాడు. అప్పుడప్పుడు ఉన్న ఫలంగా కేకలు వేసేవాడు. దీంతో కుటుంబ సభ్యులు శబరికి దెయ్యం పట్టిందని భావించారు. తిరువణ్ణామలై జిల్లా వందవాసికి చెందిన ఓ పూజారి దెయ్యాన్ని తరిమేస్తాడని కొందరు చెప్పడంతో తిలగవది తన చెళ్లెల్లు కవిత, బాగ్యలక్ష్మిలను వెంట బెట్టుకుని కుమారుడు శబరిని తీసుకొని ఆదివారం సాయంత్రం వందవాసికి ఆటోలో బయలుదేరింది. ఆటోకు తగిన నగదు ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్ కణ్ణమంగళం కొత్త బస్టాండ్ వద్ద నలుగురిని దింపి వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడడంతో కణ్ణమంగళం పంచాయితీ కార్యాలయం ముందు నిద్రించారు. సోమవారం వేకువజామున 3 గంటలకు శబరికి ఫిట్స్ వచ్చింది. శబరి శరీరంలో దెయ్యం ఉందని.. ఇతన్ని కొడితే దెయ్యం శరీరం విడిచి వెళ్లిపోతుందని ముగ్గురూ కలిసి బాలుడిని కర్రతో కొట్టడంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి విచారిండగా విషయం బటయపడింది. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. ఇన్‌స్టా పరిచయం.. యువతిని బయటకు రమ్మంటే రాలేదని.. -
కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...!
కొత్తకోట రూరల్: కొడుకు మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతూ తాగొచ్చి కొట్టి.. లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని తల్లి అతడిని తుదముట్టించింది. హత్య చేశాక ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన హరిజన్ నాగమ్మకు 25 ఏళ్ల క్రితం పామాపురం వాసి శాంతన్నతో వివాహమైంది. వీరికి కుమారుడు శివ (25), కూతురు అంజలి ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో నాగమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తల్లి బుచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కూతురు అంజలికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. కుమారుడు శివ ట్రాక్టర్ డ్రైవర్‌గా, హమాలీగా పనిచేస్తున్నాడు. అయితే శివ ఇటీవల మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. తరచూ తల్లిని, అమ్మమ్మను దూషించడంతో పాటు కొడుతుండేవాడు. అలాగే తల్లిని లైంగికంగానూ వేధించసాగాడు. దీంతో అతడి ప్రవర్తనకు తట్టుకోలేక ఎలాగైనా అంతమొందించాలని నాగమ్మ, బుచ్చమ్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన రాత్రి గాఢ నిద్రలో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు కట్టి కత్తితో పొడిచి చంపేశారు. బయట పడిందిలా.. ప్రస్తుతం గ్రామంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతోంది. శివ ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో ఈనెల 21వ తేదీన సాయంత్రం తోటి హమాలీలు ఇంటికి వెళ్లి ఏమైందని తల్లి నాగమ్మను అడగ్గా ఆమె తడబడుతూ సమాధానం చెప్పింది. చివరకు 22న సర్పంచ్ లతకు అసలు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇన్చార్జి సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగమ్మ, బుచ్చమ్మలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం డాక్టర్, తహసీల్దార్ సమక్షంలో శివ మృతదేహాన్ని వెలికితీస్తామని తెలిపారు. కాగా, ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హాట్‌డాగ్ తినలేదని కొట్టి చంపేసింది
కాన్సాస్: సాండ్ విచ్ తినలేదన్న కోపంతో కన్నకొడుకుని కొట్టి చంపిన నేరానికి ఆ తల్లికి అమెరికాలో కోర్టు 19ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అదే నేరంలో పాల్గొన్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాన్సాస్‌లో విచితకు చెందిన ఎలిజబెత్ వూల్హీటర్ గత ఏడాది రెండేళ్ల వయసున్న తన కుమారుడు ఆంటోనీకి ‘హాట్‌డాగ్’ సాండ్విచ్ తినమని ఇచ్చింది. ఆ బాలుడు నిరాకరించడంతో బాగా కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయస్థానం తల్లికి 19 ఏళ్ల 5 నెలలు ఖైదు, నేరంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
కొడుకు స్నేహితుడితో తల్లి ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని..
చండీగఢ్ : కామమా లేక పిచ్చా తెలియదుగాని 44 ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని.. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ తల్లి, కన్న కొడుకుని హత్య చేసింది. దీంతో పేగు బంధం కన్న.. అక్రమ సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చిన ఆ తల్లి కటకటాలపాలయింది. ఒళ్లుగగుర్లు పుట్టించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. హరియాణాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా దేవి (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే ప్రమోద్ను కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరాతీశాడు. నిజం తెలిసి మనస్థాపానికి గురైన ప్రమోద్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుడిని ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రమోద్ను హత్య చేయాలని మీనా, ప్రదీప్‌లు నిశ్చయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రమోద్ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరినీ ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం తన కొడుకును ఎవరో హత్య చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తల్లి మీనాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఇంటిచుట్టుపక్కల వారిని విచారించగా అసలు బండారం బయటపడింది. తొలుత సౌరభ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా డొంకంతా కదిలింది. దీంతో తల్లి మీనా, స్నేహితుడు ప్రదీప్, మరో ఇద్దరిని పోలీసులు ఆరెస్టు చేశారు. -
చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి
విజయనగరం టౌన్ : తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డువచ్చాడనే కారణంతో కన్నకొడుకుని ఓ తల్లి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ నెల 22వ తేదీ రాత్రి స్థానిక గాయత్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన హరి భగవాన్ (17) తల్లి వెంకట పద్మావతిని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హత్య కేసులో తల్లి వెంకట పద్మావతితో పాటు ఆమె ప్రియుడు గోవింద్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు పంపించినట్లు రూరల్ సీఐ రమేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అసలేం జరిగింది? గాయత్రీనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి గాయత్రీనగర్‌లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది. ఏజెంట్‌గా పరిచయం... వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్ అనే రియల్టర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. హత్యకు ముందస్తు పథకం వెంకటపద్మావతి, గోవింద్‌ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం. చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి.. గోవింద్ సలహా మేరకు పద్మావతి చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపింది. దీంతో చపాతి తిన్న హరిగోపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది. ఇదిలా ఉంటే హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్‌ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు తరలించారు. -
ఖననం చేసిన మృతశిశువుకు పోస్టుమార్టం
నర్సింహులపేట : ఖననం చేసిన శిశువు మృతదేహాన్ని నాలుగు రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు శివారు బంజరలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బయ్యారం ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన గంగరబోయిన సరిత మానసిక స్థితి సరిగా లేక తన చేతిలో ఉన్న శిశువును బయ్యారం పాకాల వాగు బ్రిడ్డి పై నుంచి పడేయడంతో శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిదే. అయితే బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటనపై గత గురువారం రాత్రి బయ్యారం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా శిశువు మృతదేహాన్ని ఖననం చేయగా, పంచనామా, పోస్టుమార్టం నిమిత్తం మరలా వెలికితీశారు. సోమవారం బయ్యారం తహసీల్దార్ పుల్లారావు సమక్షంలో ఎస్సైలు రవీందర్, సంతోస్రావు.. బంజరలో పూడ్చిన శిశువు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అలాగే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి వైద్యుడు సందీప్ అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలుడి మృత దేహాన్ని కుటుంబసభులకు అప్పగించగా మరలా ఖననం చేశారు. పూడ్చివేసిన బాలుడిని వెలిసితీసి పోస్టుమార్టం చేస్తుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
అందరూ వాగులో నాణేలు వేస్తుంటే..ఆమె బిడ్డని విసిరేసింది
బయ్యారం(ఇల్లందు): ఓ దేవుడా ఎంత పనిచేశావయ్యా.. కొడుకుకు ఇద్దరు బిడ్డలే పుట్టారు.. మగబిడ్డ కోసం ఆపరేషన్ చేయించలే.. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టాడనే తృప్తి లేకుండా చేశావు.. మేమేం చేశాం.. ఈ శిక్ష మాకెందుకు అంటూ తల్లి చేతిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి నానమ్మ లచ్చమ్మ విలపించిన తీరు పలువురి హృదయాలను కలిచివేశాయి. మతిస్థిమితం లేని తల్లి రెండు నెలల కుమారుడిని వాగులో విసిరేసి.. ఆ చిన్నారి మృతికి కారణమైంది. దీంతో మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు బంజారకు చెందిన గంగరబోయిన సురేష్‌కు మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన సరితతో వివాహమైంది. వీరికి హర్షిత, ప్రవళిక సంతానం ఉన్నారు. మరో కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సరిత మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటు ంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. సరిత మతిస్థిమితం లేకుండా వ్యవహరించింది. వైద్యం చేయించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.ఏం జరిగింది..? మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్న సరితను బాగు చేయాలని ఆమె అత్త లచ్చమ్మ, తల్లి పద్మ, ఆడపడుచు పద్మ ఆటోలో సరితతోపాటు ఆమె పిల్లలను తీసుకుని మండలంలోని కట్టుగూడెం లోని దేవుని శివసత్తి (దేవుని పూనకం వచ్చే మహిళ) వద్దకు గురువారం తీసుకొచ్చారు. శివసత్తి వద్ద పూజలు చేసిన తర్వాత తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో బయ్యారంలోని పాకాలేటి బ్రిడ్జి వద్ద రూపాయి నాణెంతోపాటు నిమ్మకాయను ఏటిలో వేసేందుకు ఆటోను నిలిపారు. సరిత ఆటో దిగి కుమారుడిని వాగులో విసిరేసింది. ఆ తర్వాత ఆమె సైతం దూకేందుకు ప్రయత్నించగా తల్లి, అత్త, ఆడపడుచు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా అభం శుభం తెలియని చిన్నారి కానరాని లోకాలకు వెళ్లాడు. ఓ వైపు మనవడు..మరో వైపు కన్నబిడ్డ.. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సరిత తల్లి పద్మ నోటివెంట మాటరాని పరిస్థితి. ఓ వైపు మతిస్థిమితం లేని బిడ్డ తన కొడుకును చే తులారా ఏటిలో పడేయడం, ఆ తర్వాత త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కన్నబిడ్డ షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆమె రోదించింది. -
చంపుతానన్న కొడుకునే చంపించింది
నిజామాబాద్ ,ఎల్లారెడ్డి: జులాయిగా తిరుగుతూ, ఇంట్లో వాళ్లను చంపుతానని బెదిరిస్తున్న కన్న కొడుకునే హత్య చేయించిన తల్లిని, హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన చిన్నకొడుకును పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతేడాది అక్టోబర్ 12న ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలోని మాచాపూర్ శివారులో ఓ వ్యక్తిని తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఒంటిపై దుస్తులు తొలగించి, ముఖంపై పెట్రోల్ పోసి తగులబెట్టి ఆధారాలు లేని ఈ కేసులో నాలుగు నెలలపాటు సాగిన పోలీసుల పరిశోధన కొలిక్కి వచ్చింది. డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కటికె గోడెకర్ యాదిలాల్ అలియాస్ యాదుల్ మటన్‌షాప్ నిర్వహిస్తుండేవాడు. ఇక్కడ సరైన ఆదాయం రాక 2016లో హైదరాబాద్ జియాగూడకు వలస వెళ్లాడు. అక్కడ భార్య అశ్విని బంధువైన చంద్రకళతో పరిచయం ఏర్పడింది. చంద్రకళ పెద్ద కొడుకు మాల్తుకుకార్ ప్రవీణ్‌కుమార్(40) ఏ పని చేయకుండా జులాయ్‌గా తిరిగేవాడు. తనను, తన కూతురు, చిన్న కొడుకు సోను అలియాస్ మహావీర్ను డబ్బుల కోసం వేధిస్తూ చంపుతానని భయపెడుతున్నాడని తరుచూ చంద్రకళ యాదిలాల్కు చెప్పుకునేది. కొద్ది రోజులకు భార్యతో గొడవ పడి యాదిలాల్ ఎల్లారెడ్డికి వచ్చేశాడు. ఒకరోజు చంద్రకళ యాదిలాల్కు ఫోన్ చేసి తన పెద్ద కొడుకు వేధింపులు అధికమయ్యాయని అతడిని హత్య చేస్తే రూ.3 లక్షలు చెల్లిస్తానని బేరం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆమె రూ.50 వేలను నిందితుడికి అందించింది. దీంతో నిందితుడు యాదిలాల్ ప్రవీణ్‌ను ఎల్లారెడ్డిలో పెళ్లి సంబంధం చూపెడతానని ఆశ చూపి 2017 అక్టోబర్ 12న పిలిచాడు. పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి గోపాల్‌పేట్‌లో దిగాలని తాను అక్కడే కలుస్తానని ప్రవీణ్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి మద్యం తీసుకుని మాచాపూర్ శివారులో తాగారు. మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్‌ను పథకం ప్రకారం తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.. ప్రవీణ్‌ను హత్య చేసిన విషయం చంద్రకళకు తెలియజేయగా శవాన్ని గుర్తు పట్టరాకుండా మార్చేసి సాక్ష్యాలు లేకుండా చేయమని ఆమె సూచించింది. శవం ఒంటిపై దుస్తులన్నీ తొలగించి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం మృతుడి దుస్తులు, సెల్‌ఫోన్, ఇనపరాడ్ను పట్టణ శివారులోని పెద్ద చెరువులో వేసి సాక్ష్యాలు లేకుండా చేశాడు. అనంతరం ఒప్పందం ప్రకారం మిగితా రూ.2.50 లక్షలు ఇవ్వాలని చంద్రకళపై ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని కొద్ది రోజుల తర్వాత చెల్లిస్తానని ఆమె నిందితుడికి ప్రాంసరీ నోట్ రాసి ఇచ్చింది. తమ గ్రామ శివారులో శవం కనిపించిందంటూ మాచాపూర్వాసులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధించారు. ఎలాంటి ఆనవాళ్లు లేని మృతుడు ఎవరు, అతడిని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి పోలీసులకు చాలా కష్ట పడాల్సి వచ్చింది. మృతుడి ఫొటోను ఫ్లెక్సీ చేయించి జన సమ్మర్థం గల ప్రాంతాలు, జిల్లాల పోలీస్స్టేషన్లలో, పక్క రాష్ట్రాల వాహనాలకు అతికించి సమాచారం కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జియాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి కనిపించడం లేదంటూ వచ్చిన సమాచారంతో పరిశోధన ఆ వైపు సాగించారు. మృతుడి ఫోన్‌కాల్ రిజిష్టర్, ఇతర ఆధారాలతో నిందితుడు యాదిలాల్ను విచారించారు. మృతుడి తల్లి చంద్రకళ సూచనల మేరకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ సుధాకర్, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. -
తల్లిపై తనయుడి అత్యాచారయత్నం
-
‘అందుకే.. ఆణ్ణి చంపేశా ’
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : ‘ఔను.. ఆణ్ణి చేతులారా నేనే చంపేశా. పెట్రోల్ పోసి తగులబెట్టా. పేగు తెంచుకుని పుట్టిన కొడుకును ఏ తల్లీ ఇలా చంపుకోదు. కానీ.. నాకు అలాంటి దుస్థితి దాపురించింది. నేను చేసింది తప్పో.. రైటో నాకు తెలీదు. తొందరపాటులో ఇలా చేశాను. అరుునా.. దీనికి కారణం వాడే. ఇలాంటి కొడుకు పగవారికి కూడా ఉండకూడదు’ రోదిస్తూ చెప్పింది ఆ తల్లి. కొడుకు ఆగడాలను భరించలేక తల్లే అతడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సంచలనం కలిగించిన ఈ ఘటనలో కోదాటి పెద్దిరాజు (36) అనే ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుణ్ణి ఎందుకు హతమా ర్చాల్సి వచ్చిందో అతడి తల్లి కోదాటి పద్మావతి (55) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘20 ఏళ్లుగా ఆడు పెట్టే హింసలను భరిం చాను. ఆడు దురలవాట్లకు బానిసయ్యూడు. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అన్నీ మౌనంగానే భరించాం. ఏదోరోజు మారకపోతాడా.. బాగుపడకపోతాడా అనుకునేదాన్ని. అందుకే ఆరుసార్లు ఆటోలు, ఓసారి మినీ వ్యాన్ కొనిచ్చాను. ఏదిచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటే. జల్సాలు, అలవాట్ల కోసం వాటిని అమ్మేశాడు. వాడికోసం మాకున్న ఎకరం పొలం అమ్మేశాను. రోడ్డు పక్కనున్న విలువైన ఇంటిని సైతం అమ్మాల్సి వచ్చింది. పదేళ్ల క్రితం యాక్సిడెం ట్లో ఆడి కుడికాలుకు దెబ్బతగిలితే నాలుగేళ్లపాటు పోషించాను. రెండుసార్లు ఆపరేషన్లు కూడా చేరుుంచాను. ఎన్నో అప్పులు చేసేవాడు. అప్పులిచ్చినోళ్లు తగవులకు వచ్చేవారు. నేను, నా భర్త సూర్యనారాయణ కలసి కొన్ని బకారుులు అప్పటికప్పుడు తీర్చేవాళ్లం. మా దగ్గర డబ్బులేకపోతే ప్రాంసరీ నోట్లు రాసిచ్చేవాళ్లం. ఇంతచేసినా వాడికి కడుపు నిండలేదు. నా భర్త, నేను కలిసి ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని ఈ మధ్య గొడవ చేస్తున్నాడు. బుధవారం రాత్రి మా ఇంటికొచ్చాడు. ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వాలంటూ గొడవపడ్డాడు. నన్ను, నా భర్తను కత్తితో నరికి చంపేస్తానన్నాడు. భయంతో రాత్రంతా మేం వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నాం. తెల్లవారాక వచ్చి మా అంతు చూస్తానని బెదిరించి వెళ్లాడు. ఈరోజు మళ్లీ వచ్చాడు. మమ్మల్ని చంపేస్తానని వీరంగం చేశాడు. ఏం చేయూలో తెలియలేదు. సీసాలో ఉన్న పెట్రోల్ వాడిపై పోసి నిప్పు పెట్టాను. చచ్చిపోతాడనుకోలేదు. ఇలాంటి కొడుకు పగవాడికి కూడా ఉం డకూడదు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు’ అని వాంగ్మూలంలో పద్మావతి పేర్కొంది. ఇదీ జరిగింది... బుధవారం రాత్రి ప్రకాశరావుపాలెం వచ్చిన పెద్దిరాజు తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వారు ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని అడిగాడు. అందుకు ససేమిరా అనడంతో ఘర్షణ పడ్డాడు. కత్తి తీసుకుని చంపేస్తానని బెదిరిం చాడు. దీంతో తల్లిదండ్రులు భయపడి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. గురువారం ఉదయం 9గంటల సమయంలో పెద్దిరాజు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. వరండాలోని మంచంపై కూర్చుని యు.వెంకటేశ్వరావు, దూలపల్లి ప్రభాకరావు, మిరియాల గంగాధరావు అనేవారితో మాట్లాడుతుండగా.. పద్మావతి బాటిల్లోంచి పెట్రోల్ తీసి అతడిపై పోసి నిప్పంటించింది. మంటలు ఎగసిపడటంతో పైనున్న తాటాకుల పందిరి అంటుకుంది. మం టల్లో చిక్కుకున్న పెద్దిరాజు రక్షించండంటూ హాహాకారాలు చేసాడు. రక్షించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోరుుంది. పెద్దిరాజు అగ్నికి ఆహుతైపోయూడు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సై పి.చిన్నారావు, తహసిల్దార్ కె.పోసియ్య ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.