‘అందుకే.. ఆణ్ణి చంపేశా ’
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : ‘ఔను.. ఆణ్ణి చేతులారా నేనే చంపేశా. పెట్రోల్ పోసి తగులబెట్టా. పేగు తెంచుకుని పుట్టిన కొడుకును ఏ తల్లీ ఇలా చంపుకోదు. కానీ.. నాకు అలాంటి దుస్థితి దాపురించింది. నేను చేసింది తప్పో.. రైటో నాకు తెలీదు. తొందరపాటులో ఇలా చేశాను. అరుునా.. దీనికి కారణం వాడే. ఇలాంటి కొడుకు పగవారికి కూడా ఉండకూడదు’ రోదిస్తూ చెప్పింది ఆ తల్లి. కొడుకు ఆగడాలను భరించలేక తల్లే అతడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సంచలనం కలిగించిన ఈ ఘటనలో కోదాటి పెద్దిరాజు (36) అనే ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుణ్ణి ఎందుకు హతమా ర్చాల్సి వచ్చిందో అతడి తల్లి కోదాటి పద్మావతి (55) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘20 ఏళ్లుగా ఆడు పెట్టే హింసలను భరిం చాను. ఆడు దురలవాట్లకు బానిసయ్యూడు. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అన్నీ మౌనంగానే భరించాం. ఏదోరోజు మారకపోతాడా.. బాగుపడకపోతాడా అనుకునేదాన్ని. అందుకే ఆరుసార్లు ఆటోలు, ఓసారి మినీ వ్యాన్ కొనిచ్చాను. ఏదిచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటే. జల్సాలు, అలవాట్ల కోసం వాటిని అమ్మేశాడు. వాడికోసం మాకున్న ఎకరం పొలం అమ్మేశాను. రోడ్డు పక్కనున్న విలువైన ఇంటిని సైతం అమ్మాల్సి వచ్చింది. పదేళ్ల క్రితం యాక్సిడెం ట్‌లో ఆడి కుడికాలుకు దెబ్బతగిలితే నాలుగేళ్లపాటు పోషించాను. రెండుసార్లు ఆపరేషన్లు కూడా చేరుుంచాను. ఎన్నో అప్పులు చేసేవాడు. అప్పులిచ్చినోళ్లు తగవులకు వచ్చేవారు.
నేను, నా భర్త సూర్యనారాయణ కలసి కొన్ని బకారుులు అప్పటికప్పుడు తీర్చేవాళ్లం. మా దగ్గర డబ్బులేకపోతే ప్రాంసరీ నోట్లు రాసిచ్చేవాళ్లం. ఇంతచేసినా వాడికి కడుపు నిండలేదు. నా భర్త, నేను కలిసి ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని ఈ మధ్య గొడవ చేస్తున్నాడు. బుధవారం రాత్రి మా ఇంటికొచ్చాడు. ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వాలంటూ గొడవపడ్డాడు. నన్ను, నా భర్తను కత్తితో నరికి చంపేస్తానన్నాడు. భయంతో రాత్రంతా మేం వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నాం. తెల్లవారాక వచ్చి మా అంతు చూస్తానని బెదిరించి వెళ్లాడు. ఈరోజు మళ్లీ వచ్చాడు. మమ్మల్ని చంపేస్తానని వీరంగం చేశాడు. ఏం చేయూలో తెలియలేదు. సీసాలో ఉన్న పెట్రోల్ వాడిపై పోసి నిప్పు పెట్టాను. చచ్చిపోతాడనుకోలేదు. ఇలాంటి కొడుకు పగవాడికి కూడా ఉం డకూడదు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు’ అని వాంగ్మూలంలో పద్మావతి పేర్కొంది.
ఇదీ జరిగింది...
బుధవారం రాత్రి ప్రకాశరావుపాలెం వచ్చిన పెద్దిరాజు తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వారు ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని అడిగాడు. అందుకు ససేమిరా అనడంతో ఘర్షణ పడ్డాడు. కత్తి తీసుకుని చంపేస్తానని బెదిరిం చాడు. దీంతో తల్లిదండ్రులు భయపడి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. గురువారం ఉదయం 9గంటల సమయంలో పెద్దిరాజు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. వరండాలోని మంచంపై కూర్చుని యు.వెంకటేశ్వరావు, దూలపల్లి ప్రభాకరావు, మిరియాల గంగాధరావు అనేవారితో మాట్లాడుతుండగా.. పద్మావతి బాటిల్‌లోంచి పెట్రోల్ తీసి అతడిపై పోసి నిప్పంటించింది. మంటలు ఎగసిపడటంతో పైనున్న తాటాకుల పందిరి అంటుకుంది. మం టల్లో చిక్కుకున్న పెద్దిరాజు రక్షించండంటూ హాహాకారాలు చేసాడు.
రక్షించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోరుుంది. పెద్దిరాజు అగ్నికి ఆహుతైపోయూడు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సై పి.చిన్నారావు, తహసిల్దార్ కె.పోసియ్య ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.