
ప్రతీకాత్మక చిత్రం
A young man tragically murdered by his mother In Chennai తమిళనాడు: ట్రాన్స్‌జండర్ మహిళగా జీవిస్తానన్నందుకు తల్లే అతని పాటిట మృత్యువైంది. పోలీసుల కథనం ప్రకారం..
చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో 19 యేళ్ల నవీన్ అనే వ్యక్తిని తల్లి ధారుణంగా హతమార్చింది. ఈ కేసులో అందిన సమాచారం మేరకు మృతుడు నవీన్‌కు ట్రాన్స్‌జండర్‌గా మారాలని ఉందని తరచూ తల్లి ఉమాదేవికి వద్దకొచ్చి చెబుతూ ఉండేవాడు. ఈక్రమంలో నవీన్ తన పేరును అక్షితగా మార్చుకున్నాడు కూడా. ఐతే ఉమాదేవి కొడుకును ట్రాన్స్‌జండర్‌గా మారవద్దని పలుమార్లు సూచించింది. నవీన్ నిరాకచించడంతో తల్లి మరో ఐదుగురి సహాయంతో అతనిపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన నవీన్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గత వారం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నవీన్‌ను అతని తల్లి ఉమాదేవి హత్య చేసినట్లు సేలం పోలీసుల దర్యాప్తులో తేలింది.
మగవాడిగా ఉండేందుకు నవీన్ హార్మోన్లు తీసుకోవాలని ఉమాదేవి ఒత్తిడి చేసిందని, అందుకు నవీన్ నిరాకరించడంతో నిందితురాలు ఉమాదేవి, ఆమె సహచరులు నవీన్‌పై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉమాదేవితో పాటు వెంకటేష్, కామరాజ్, కార్తికేయ, సంతోష్, శివకుమార్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment