Salem District
-
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. భాదితులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ తన సీట్లోంచి ముందుకు ఎగిరిపడటం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. -
ఇద్దరికి వేరే వ్యక్తులతో పెళ్లి,.. విడిచి ఉండలేక ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కలసి జీవించలేమనే ఆవేదనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. తిరువొత్తియూరు సేలం టౌన్ రైల్వే స్టేషన్ పొన్నమ్మా పేట రైల్వే గేటు సమీపంలో శనివారం ఉదయం పట్టాలపై ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ జంటను యశ్వంత్‌పూర్, పుదుచ్చేరి ట్రైన్ ఢీకొంది. సేలం రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో వారు సేలం అమ్మాపేటకు చెందిన మురుగేషన్ కుమార్తె సత్య (23), జ్యోతి నగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు విష్ణు (27) అని తెలిసింది. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో!
A young man tragically murdered by his mother In Chennai తమిళనాడు: ట్రాన్స్జండర్ మహిళగా జీవిస్తానన్నందుకు తల్లే అతని పాటిట మృత్యువైంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో 19 యేళ్ల నవీన్ అనే వ్యక్తిని తల్లి ధారుణంగా హతమార్చింది. ఈ కేసులో అందిన సమాచారం మేరకు మృతుడు నవీన్‌కు ట్రాన్స్‌జండర్‌గా మారాలని ఉందని తరచూ తల్లి ఉమాదేవికి వద్దకొచ్చి చెబుతూ ఉండేవాడు. ఈక్రమంలో నవీన్ తన పేరును అక్షితగా మార్చుకున్నాడు కూడా. ఐతే ఉమాదేవి కొడుకును ట్రాన్స్‌జండర్‌గా మారవద్దని పలుమార్లు సూచించింది. నవీన్ నిరాకచించడంతో తల్లి మరో ఐదుగురి సహాయంతో అతనిపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన నవీన్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గత వారం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నవీన్‌ను అతని తల్లి ఉమాదేవి హత్య చేసినట్లు సేలం పోలీసుల దర్యాప్తులో తేలింది. మగవాడిగా ఉండేందుకు నవీన్ హార్మోన్లు తీసుకోవాలని ఉమాదేవి ఒత్తిడి చేసిందని, అందుకు నవీన్ నిరాకరించడంతో నిందితురాలు ఉమాదేవి, ఆమె సహచరులు నవీన్‌పై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉమాదేవితో పాటు వెంకటేష్, కామరాజ్, కార్తికేయ, సంతోష్, శివకుమార్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
150 ఏళ్లనాటి నిధి దొరికింది
సేలం: ఇంటి నిర్మాణానికి గోతులు తవ్వుతుండగా నిధి బయట పడింది. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని నర్సింగాపురంలో చిన్నకన్ను, సుమతి దంపతులు కొత్తగా ఇళ్లు నిర్మించే పనిలో పడ్డారు. అందుకు గాను గోతుల తవ్వే క్రమంలో నిధి బయట పడింది. అయితే, ఈ నిధి గురించి ఆ దంపతులకు తెలియదు. దీనిని తీసుకుని మేస్త్రీ చిన్న తంబి ఉడాయించాడు. అక్కడ నిధి లభించిన సమాచారంతో గురువారం తహసీల్దార్ తెన్ మొళి, ఇతర అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆ దంపతుల వద్ద విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారంతో చిన్న తంబి వద్ద ఉన్న నిధిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి 150 ఏళ్ల నాటిది. ఇందులో 2.13 లక్షలు విలువగల బంగార ఆభరణాలు బయట పడ్డాయి.