150 ఏళ్లనాటి నిధి దొరికింది | Gold ornaments available | Sakshi
Sakshi News home page

150 ఏళ్లనాటి నిధి దొరికింది

Published Fri, May 29 2015 3:29 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

150 ఏళ్లనాటి నిధి దొరికింది - Sakshi

150 ఏళ్లనాటి నిధి దొరికింది

సేలం: ఇంటి నిర్మాణానికి గోతులు తవ్వుతుండగా నిధి బయట పడింది. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని నర్సింగాపురంలో చిన్నకన్ను, సుమతి దంపతులు కొత్తగా ఇళ్లు నిర్మించే పనిలో పడ్డారు. అందుకు గాను గోతుల తవ్వే క్రమంలో నిధి బయట పడింది. అయితే, ఈ నిధి గురించి ఆ దంపతులకు తెలియదు. దీనిని తీసుకుని  మేస్త్రీ చిన్న తంబి ఉడాయించాడు. అక్కడ నిధి లభించిన సమాచారంతో గురువారం తహసీల్దార్ తెన్ మొళి, ఇతర అధికారుల బృందం రంగంలోకి దిగింది.

ఆ దంపతుల వద్ద విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారంతో చిన్న తంబి వద్ద ఉన్న నిధిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి 150 ఏళ్ల నాటిది. ఇందులో 2.13 లక్షలు విలువగల బంగార ఆభరణాలు బయట పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement