
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కలసి జీవించలేమనే ఆవేదనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. తిరువొత్తియూరు సేలం టౌన్ రైల్వే స్టేషన్ పొన్నమ్మా పేట రైల్వే గేటు సమీపంలో శనివారం ఉదయం పట్టాలపై ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ జంటను యశ్వంత్పూర్, పుదుచ్చేరి ట్రైన్ ఢీకొంది. సేలం రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో వారు సేలం అమ్మాపేటకు చెందిన మురుగేషన్ కుమార్తె సత్య (23), జ్యోతి నగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు విష్ణు (27) అని తెలిసింది.
చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం