Tiruvottiyur
-
వివాహితతో సహజీవనం.. కుమార్తెలపై కన్నేసి..
చెన్నై: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తెలపై కన్ను వేయడంతో ప్రియురాలే హతమార్చి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు.. విల్లుపురానికి చెందిన ఆర్ముగం కుమారుడు ప్రభు (36) వివాహితుడు. ఇతనికి వితంతు మహిళ వినోద (34)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వినోదకు మొదటి భర్త ద్వారా ముగ్గురు కుమార్తెలు (16,14,10 వయస్సు) ఉన్నారు. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ 3వ తేదీ అయ్యంపాళయం కావేరి నదిలో కుల్లిన స్థితిలో ప్రభు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. విచారణలో ప్రభు వినోద కుమార్తెలకు లైంగిక వేధింపులు ఇస్తుండడంతో వినోద అతన్ని కత్తితో హత్య చేసి కావేరి నదిలో పడవేసినట్లు తెలిసింది. ప్రభు తండ్రి ఆర్ముగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోదను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చదవండి: (హైదరాబాద్ నుంచి పారిపోయి కర్ణాటకలో సహజీవనం) -
మూడు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి.. ఎలుకలమందు తీసుకున్న ప్రేమజంట
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తల్లిదండ్రులు విడదీస్తారేమోనన్న భయంతో ప్రేమజంట విషం తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సూలగిరి సమీపంలో చోటు చేసుకుంది. వీరిలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం పోలార్ జిల్లా వేమక్కల్ ప్రాంతానికి చెందిన ఆనందన్ కుమార్తె అనుశ్రీ (14) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఉన్న ఏరాండాపల్లి గ్రామానికి చెందిన సౌందరరాజ్ (22)కు బంధువు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకం తెలిపారు. ఈ క్రమంలో మూడుసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రేమజంటను తల్లి దండ్రులు, బంధువులు తిరిగి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నాలుగోసారి సౌందరరాజ్, అనుశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయమై ఆనందన్ వేమక్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను సౌందరరాజ్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమో దు చేసి, ప్రేమ జంట కోసం గాలించారు. ఈ సంగతి తెలుసుకున్న సౌందరరాజు, అనుశ్రీ తమను తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించి, ఎలుకల మందు పేస్టు తీసుకుని తిని, సూలగిరి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు గుర్తించి, వారిని కృష్ణగిరి ప్రభుత్పాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుశ్రీ బుధవారం మృతి చెందింది. సౌందరరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సూలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు'
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెరుమాలైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాగై జిల్లా వేదార ణ్యం తాలూకా పెరుమాలై గ్రామానికి చెందిన ఇళయరాజా కుమార్తె ఇందుజ (18) కడినాల్ వైయల్ ప్రాంతంలో ఉంటూ ప్రైవేటు నర్సింగ్ శిక్షణ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడ 14 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వీరిలో 13 మంది రోజు ఇంటికి వచ్చి వెళుతున్నారు. ఇందుజా మాత్రం పేదరికం కారణంగా కళాశాలలోనే ఉన్న స్త్రీల గదిలో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విద్యార్థిని బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వేదారణ్యం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విద్యార్థిని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘నాన్న తాగవద్దు, అమ్మను కొట్టవద్దు, నేను మీకు ఏదో చేయాలని తలుచుకున్నానని, కానీ వీలు కాలేదు. అంతా అన్న చూసుకుంటాడు.’అని రాసి ఉంది. పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని శవపరీక్ష కోసం వేదారణ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థి మృతిపై తమకు సందేహం ఉన్నట్లు ఆమె బంధువులు ఆస్పత్రిని ముట్టడించి, ఆందోళన చేపట్టారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయుధ దళ పోలీసు.. తిరుపూర్‌లో సాయుధ దళం పోలీసు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. తేనె జిల్లా సురులిపట్టికి చెందిన ఈశ్వరన్ (33) తిరుపూరు జిల్లా సాయుధ దళంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోసహా నల్లూరు ప్రాంతంలో ఉన్న జిల్లా సాయుదళ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈశ్వరన్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లిని ఫ్యాన్‌కు భార్య చీరతో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు సమాచారం అందజేశారు. నల్లూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): తిరుపూర్ జిల్లా ఎస్.పెరియపాలయం పంచాయతీలోని అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మృతుడు ఈశ్వరన్ (30)గా గుర్తించారు. ఈ కేసులో పెరుమానల్లూరుకు చెందిన వడివేలు (39), అతని స్నేహితుడు అన్నాదురై (40)ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈశ్వరన్, వడివేలు, అన్నాదురై భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అందరూ పెరుమానల్లూరులో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈశ్వరన్ వడివేలు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం వడివేలుకు తెలియడంతో ఈశ్వరన్‌ను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో వడివేలు, తన స్నేహితుడు అన్నాదురై కలిసి ఈశ్వరన్‌ను రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. చదవండి: (Sri Sathya Sai District: వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య) -
సహజీవనం.. ప్రియుడితో కలిసి కన్నబిడ్డకు చిత్రహింసలు
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): చెన్నైలో కన్నబిడ్డకు వాతలుపెట్టి చిత్రహింసలకు గురి చేసిన తల్లిని ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శా స్త్రినగర్‌కు చెందిన భాను (29) భర్త నుంచి విడిపోయి రెండున్న ఏళ్ల ఆడబిడ్డతో కలసి జీవిస్తోంది. ఈ క్రమంలో భానుకు అదే ప్రాంతానికి చెందిన జగన్‌జోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడి సహజీవనం చేస్తున్నారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బిడ్డ అడ్డు వస్తుండంతో భాను బిడ్డను కొడుతూ వేధిస్తుండేది. ఈ క్రమంలో 29వ తేదీన జగన్ జోష్ సిగరెట్‌తో బిడ్డ ముఖంపై కాల్చడంతో చిన్నారిస్పృ హ తప్పి పడిపోయింది. దీంతో భాను చిన్నారిని చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ సంగతి తెలుసుకున్న భాను తల్లి కన్నియమ్మల్ ఆస్పత్రికి వచ్చి చిన్నారిని చూసి దిగ్భ్రాంతి చెందింది. ముఖం, వీపుపై వాతలు ఉండడంతో ఈ విషయమై అడయార్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా భాను, జగన్జోష్కు అడ్డుగా ఉందని బిడ్డను చిత్రహింసలు పెడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఈ మేరకు వారిద్దరిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చితిలో దూకి.. దేవతగా మారి..) -
పలువురు మహిళలతో వివాహేతర సంబంధం.. మాజీ డీజీపీ కుమారుడిపై కేసు
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తమిళనాడు మాజీ డీజీపీ తిలకవతి కుమారుడిపై ఆమె కోడలు సేలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మాజీ డీజీపీ తిలకవతి కుమారుడు ప్రభు తిలక్ (48). ఇతని భార్య శృతి తిలక్(40). ఇద్దరి తల్లిదండ్రులు ఇల్లు సేలం అలగాపురం బృందావన రోడ్డులో ఉంది. బుధవారం శృతి తిలక్ తండ్రి షణ్ముగస్వామితో కలిసి సేలం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. అందులో తనకు మాజీ డీజీపీ తిలకవతి కుమారుడు ప్రభు తిలక్‌తో 2007లో వివాహమైందని, ఇద్దరు బిడ్డలున్నారని పేర్కొంది. భర్త సేలంలోని ప్రైవేటు ఆసుపత్రి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడని, వివాహమైనప్పటిæ నుంచి తనను రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ప్రభుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రియుడితో ఏకాంతంగా ఉండగా వీడియో.. లైంగిక వాంఛ..) -
వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడు నచ్చకపోవడంతో వివాహమైన పది రోజులకు ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలం జిల్లా సంగ గిరి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మే రకు.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని దేవయూరు నల్లకినరు గ్రామానికి చెందిన పళనిస్వామి కుమారుడు జీవానందం (27) మొబైల్ ఫోన్ సర్వీస్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి ఈరోడ్ జిల్లా కాడప్పనూర్ పంచాయతీ గుదిరైకాల్మేడుకు చెందిన కుప్పుస్వామి కుమా ర్తె విమలాదేవి (20)తో ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉంటున్న విమలాదేవి బుధవారం రాత్రి హఠా త్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష కోసం ఎడప్పాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహమైన పది రోజులకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు జరిపిన విచారణలో వరుడు నచ్చకపోయినా తల్లిదండ్రులు నిర్బంధంగా విమలాదేవికి వివాహం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య) -
సుమతితో వివాహేతర సంబంధం.. బయటకు తెలిసి..
తిరువొత్తియూరు (చెన్నై): కోత్తగిరిలో 45 రోజులకు ముందు అదృశ్యమైన వివాహేతర జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా కనిపించారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోత్తగిరి సమీపంలోని వెల్లెరి కొల్లంకు చెందిన శరవణన్ (25). అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అయితే పొన్నూరు సాపంకరై గ్రామానికి చెందిన సుమతి (23)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం బయటకు తెలియడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత 45 రోజులకు ముందు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. బంధువులు వారి కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియ రాలేదు. ఈ క్రమంలో ఆదివారం వెల్లేరికొల్లం అటవీ ప్రాంతంలో ప్రజలు వెళుతున్న సమయంలో కుళ్ళిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాల వద్ద లభించిన చీటీలో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పేర్కొనబడి ఉంది. అనంతరం మృతదేహాలను కోత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతదేహాలు శరవనన్, సుమతివి అని నిర్ధారించారు. చదవండి: (చిత్ర పరిశ్రమలో కలకలం.. సినీ దర్శకుడిపై ఫిర్యాదు) -
తాళి కట్టే టైమ్‌కి ప్రియుడి ఎంట్రీ.. వరుడి చేతిలో..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి యత్నంచిన ప్రేమికుడిని వధువు సోదరుడు, బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చెన్నై తండయార్ పేటలో జరిగింది. సినిమా తరహాలో జరిగిన ఈ వ్యవహారం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయారుపేటకు చెందిన సుమతి (20). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజ్ (21) నౌక ఇంజినీర్‌తో నాలుగు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. తండయార్‌పేట నేతాజీ నగర్లో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో సుమారు 7 గంటలకు మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా వరుడు తాళిని తీసుకుని వధువు మెడలో కట్టేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: (‘104’ మృత్యు మార్గాలు.. ఈ దారుల్లోనే అత్యధిక ప్రమాదాలు) సరిగ్గా అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్న యువకుడు ముందుకు దూసుకువచ్చి వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన అక్కడి వారు అందరూ ఒక్క క్షణం నివ్వెర పోయారు. అక్కడే నిలబడి ఉన్న వధువు అన్న, బంధువులు యువకుడి చేతి నుంచి తాళి లాక్కుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకుడు తండయార్ పేటకు చెందిన సుందరేష్ (25)గా గుర్తించారు. చాకలి పేటలోని ప్రముఖ నగల దుకాణంలో సుమతితో కలిసి పని చేసేవాడని నిర్ధారించారు. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తల్లిదండ్రులను ఒప్పించలేక వివాహం జరుగుతున్న సమయంలో ఈ చర్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. వివాహం జరిగిన సమయంలో అతను బంధువుగా వచ్చి ఏమి తెలియనట్లు పక్కన నిలబడి సరిగ్గా వివాహం జరిగే సమయంలో హఠాత్తుగా తాళి కట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వధువు బంధువులు, వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. -
చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై: తిరువొత్తియూరు డీఎంకే ఎమ్మెల్యే కేపీ శంకర్ చిక్కుల్లో పడ్డారు. కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్‌ను ఆయన చెంప మీద కొట్టినట్టుగా వచ్చిన ఫిర్యాదుతో పార్టీ పదవి నుంచి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తొలగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసుల్ని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్‌సింగ్ బేడీ కోరారు. వివరాలు.. తిరువొత్తియూరు నటరాజన్ వీధిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల సమయంలో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కేపీ శంకర్ విధుల్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ ఇంజినీరు చెంప మీద కొట్టినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం తీవ్రంగా పరిగణించింది. అసలు ఎమ్మెల్యే చెంప మీద కొట్టాల్సింత పరిస్థితి ఎందుకు వచ్చిందో అని ఆరా తీశారు. రోడ్డు పనుల గురించి తనకు సమాచారం ఇవ్వలేదనే ఆగ్రహంతోనే వీరంగాన్ని ప్రదర్శించినట్టు వెలుగు చూసింది. దీంతో కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం కాస్త ప్రభుత్వ వర్గాల దృష్టికి చేరింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ శనివారం ఓ ప్రకటన చేశారు. కేపీ శంకర్ చేతిలో ఉన్న తిరువొత్తియూరు పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తప్పించారు. దీంతో ఎమ్మెల్యేకు చిక్కులు తప్పలేదు. అదే సమయంలో చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్‌కు కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఇందుకు తగిన లేఖను ఆయనకు పంపించడంతో తిరువొత్తియూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం.
తిరువొత్తియూరు (చెన్నై): కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలో వివాహం చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భిణిని చేసిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని 17 ఏళ్ల బాలిక ప్లస్‌టూ చదువుతోంది. అదే ప్రాంతంలో పాపనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్ (19) కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక ఎనిమిది నెలల గర్భిణి అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్థి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అముద కేసు నమోదు చేసి ప్రవీణ్‌కుమార్‌ను ఆదివారం ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: (తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఇద్దరికి వేరే వ్యక్తులతో పెళ్లి,.. విడిచి ఉండలేక ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కలసి జీవించలేమనే ఆవేదనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. తిరువొత్తియూరు సేలం టౌన్ రైల్వే స్టేషన్ పొన్నమ్మా పేట రైల్వే గేటు సమీపంలో శనివారం ఉదయం పట్టాలపై ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ జంటను యశ్వంత్‌పూర్, పుదుచ్చేరి ట్రైన్ ఢీకొంది. సేలం రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో వారు సేలం అమ్మాపేటకు చెందిన మురుగేషన్ కుమార్తె సత్య (23), జ్యోతి నగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు విష్ణు (27) అని తెలిసింది. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): సామూహిక లైంగిక దాడికి గురైన 17 ఏళ్ల బాలికకు ఓ ఆడశిశువు జన్మించింది. కాగా ఆ బాలిక తల్లిని, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై కొరుక్కుపేట, మోక్షపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్లస్ వన్ చదువుతోంది. ఈమెకు గత కొన్ని రోజులకు ముందు చెన్నై ఎగ్మూర్ ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. బాలికకు శిశువు జన్మించిన సంఘటనపై ఆసుపత్రి వర్గాలు ఆరాతీశాయి. దీంతో బాలిక తనపై లైంగిక దాడి జరిగినట్లు వారి దృష్టికి తెచ్చింది. ఆసుపత్రి ఉద్యోగులు ఇచ్చిన సలహా మేర కు బాలిక సోమవారం చాకలిపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో కోరుక్కుపేట మీనాంబాళ్ నగర్‌కు చెందిన దురైరాజ్ (51), బషీర్ జమాల్ తదితరులు తనపై లైంగిక దాడి చేయడంతో తాను గర్భిణి అయినట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బాలిక తల్లికి దురైరాజుకు వివాహేతర సంబంధం ఉందని, లైంగిక దాడికి తల్లి ప్రోత్సహించినట్టు తెలిసింది. దీంతో పో లీసులు బాలిక తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేశా రు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) బన్రుట్టి సమీపంలో మరో ఘటన బన్రుట్టి సమీపంలో కూతురిపై బలవంతంగా లైంగిక దాడికి ప్రోత్సహించిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూర్ జిల్లా బన్రుట్టి సమీపంలోని భద్ర కోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె తల్లి హంసవల్లి (40). భర్త మృతి చెందడంతో ఈమెకు అదే ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో కార్తికేయన్‌ను కుమార్తెపై బలాత్కారం చేయడానికి హంస వల్లి ప్రోత్సహించినట్లు తెలిసింది. దీంతో కార్తికేయన్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హంసవల్లిని, కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
వయసు 23 ఏళ్లు.. పెళ్లిళ్లు నాలుగు!
తిరువొత్తియూరు : ప్రేమించుకుందాం రా..పెళ్లి చేసుకుందాం రా అంటూ మాయ మాటలు చెప్పి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని ఒక్కనాడు కీళయూరుకు చెందిన రాజ్‌కుమార్ కుమారుడు సంతోష్ (23) తిరుపూరులోని ఓ బనియన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం కరువిలక్కాడు గ్రామానికి చెందిన సత్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో తిరుపూరులో కాపురం పెట్టాడు. ఇలా ఉండగా నెలన్నర క్రితం సంతోష్ అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన సత్య తిరుపూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సంతోష్ తిరుపూర్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థిన్ని (19) ప్రేమ వివాహం చేసుకుని ఒక్కనాడు కీళయూరులో కాపురం పెట్టినట్లు సత్యకు తెలిసింది. తిరుపూర్ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. సంతోష్ అంతకు ముందే మరో ఇద్దరు యువతులను ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. యువతులతో మాటలు కలిపి వారిని బుట్టలోకి వేసుకునేవాడని..అనంతరం పెళ్లి చేసుకుని కొన్ని నెలలు కాపురం చేసి అదృశ్యమయ్యేవాడని తెలిసింది. పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి పట్టుకోటై మహిళా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు
సాక్షి, చెన్నై: ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుక నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బర్త్ డే పార్టీకి వచ్చిన నలుగురు మిత్రులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అందులో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు చేరగా..మరో మృతదేహం కోసం గాలింపు సాగుతోంది. తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలోని మనలి బల్జిపాళయంకు చెందిన రాకేష్ (15) పుట్టినరోజు వేడుక శనివారం అయ్యింది. ఈ వేడుకలో పాల్గొనడానికి 8 మంది మిత్రులు రాకేష్ ఇంటికి శనివారం వచ్చారు. రాకేష్‌తో కేక్ కట్ చేయించి మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పుం వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా ధనూష్ (15), జయభారతి (15), గోకుల్‌నాథన్ (15), సునీల్‌కుమార్ (15) మాత్రం సముద్ర స్నానానికి వెళ్లగా ఓ రాక్షస అల వీరిని మింగేసింది. స్నానం చేస్తున్న మిత్రులు కనిపించకపోవడంతో ఒడ్డునున్న మిగిలిన మిత్రులు భయంతో కేకలు పెట్టగా..జాలర్లు వచ్చి ఆ నలుగురు కోసం గాలించారు. ధనూష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో ఓ మృతదేహం బయటపడగా, మరో మృతదేహం ఒడ్డుకు చేరింది. ఆ ఇద్దరినీ జయభారతి, సునీల్‌కుమార్‌గా గుర్తించారు. గోకుల్‌నాథ్ కోసం గాలిస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
తిరువొత్తియూరు: కాంచీపురం జిల్లా పడాలం సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆ కళాశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. పుదుకోట్టై జిల్లాకు చెందిన మురుగన్ కుమార్తె గాయత్రి (20). ఈమె కాంచీపురం జిల్లా పడాలం సమీపంలో ఉన్న చిన్న కొలపాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల (కర్పక వినాయకం) హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గాయత్రి ఆదివారం హాస్టల్ మూడో అంతçస్తు నుంచి కింద పడి మృతిచెందింది. కళాశాల నిర్వాహకులు పడాలం పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమర్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రైలులో కత్తులతో యువకుల హల్చల్..
సాక్షి, తిరువొత్తియూరు: విద్యుత్ రైలులో పట్టా కత్తులతో ఘర్షణకు దిగిన ముగ్గురు కళాశాల విద్యార్థులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై మూర్మార్కెట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం మధ్యాహ్నం గుమ్మడిపూండికి విద్యుత్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో ఇంజిన్ నుంచి 3వ పెట్టెలో ఉన్న కొందరు యువకులు గొడవపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే భద్రతా పోలీసు గమనించాడు. అతను రైలు ఎక్కే లోపే కదలి వెళ్లింది. పోలీసు కంట్రోల్ రూంకు దీనిపై సమాచారం అందించాడు. దీంతో మూర్మార్కెట్ సీఐ అళగర్స్వామి, బేసిన్‌బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న రైల్వే భద్రతా దళ పోలీసులకు సమాచారం అందించారు. రైలు అక్కడికి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులను చూసిన ఆ యువకులు తమ వద్ద ఉన్న ఓ బ్యాగ్‌ను కింద పడవేశారు. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే మరో యువకుడు తప్పించుకున్నాడు. బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో నాలుగు పట్టా కత్తులు లభించాయి. అందులో టపాకాయలు, అగ్గిపెట్టెలున్నాయి. అనంతరం వారి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు పచ్చయప్ప కళాశాలలో చదువుతున్న కవియరసు(19), మరుదు పాండియన్(19), సోమసుందరం (19) అని తెలిసింది. పట్టుబడిన విద్యార్థులు పారిపోయిన విద్యార్థులు గుమ్మడిపూండి, అత్తిపట్టు, తిరువొత్తియూరు ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఇంట్లోకి చిరుత పిల్ల
తిరువొత్తియూరు: ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత పులి పిల్లను అటవీ శాఖా అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వాల్పారై, సోలయార్ ఎస్టేట్ మొదటి డివిజన్‌కు చెందిన తేయాకుతోట కార్మికురాలు ధనలక్ష్మి. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఈమె వంట చేస్తోంది. ఆ సమయంలో వంట గదిలోకి ఓ చిరుత పిల్ల చొరబడింది. పిల్లి అనుకున్న ధనలక్ష్మి వంట చేయడంలో నిమగ్నమైంది. అయితే కొద్ది సమయం తరువాత గర్జన వినపడింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ధనలక్ష్మి ఇరుగుపొరుగు వారికి పరిస్థితిని తెలిపింది. వీరి ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి, ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఆరు నెలల వయసున్న మగ చిరుత పిల్లను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బయటకు వెళ్లే సమయంలో ఇళ్ల తలుపులకు గొళ్లెంపెట్టి ఉంచాలని అటవీ శాఖ ఉద్యోగులు ప్రజలకు సూచించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
తిరువొత్తియూరు: రాష్ట్రంలో మంగళవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 నెలల పసికందుతో పాటు ఆరుగురు మృతి చెందారు. వ్యాన్ చెట్టును ఢీకొని ముగ్గురి మృతి: కోవై పాపంపట్టి సమీపం కోళ్లఫాం నుంచి బ్రాయిలర్ కోళ్లను ఎక్కించుకుని మంగళవారం రాత్రి వాల్పారైకు ఓ వ్యాన్ బయలుదేరింది. అన్నామలైకు చెందిన డ్రైవర్ ఆరుస్వామి (32). వ్యాన్ నడుపుతున్నాడు. వాల్పారైకు చెందిన శరవణన్ (29) కక్కన్రోడ్డుకు చెందిన లాలా (20) వ్యాన్‌లో ఉన్నారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ వ్యాన్ చన్రపాళయం వద్ద వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురు అదే స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న కినత్తుగౌడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఆటో బోల్తా: చిన్నారి మృతి :శీర్ఘాళి సమీపంలో కులైయారు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 10 నెలల పసికందు అదే స్థలంలో మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రజలు తెలిపారు. పోలీసులు ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. నక్కను బైకు ఢీకొని యువకుడి మృతి : ఉత్తుకోట, చెంగరై, తోటారెడ్డి కుప్పానికి చెందిన సెల్వం కుమారుడు మణి (21). ఇతను మంగళవారం రాత్రి ఊతుకోట నుంచి బైకులో ఇంటికి వస్తుండగా హఠాత్తుగా నక్క రోడ్డుపై అడ్డు రావడంతో బైకు నక్కను ఢీకొని మణి కింద పడి తీవ్ర గాయాలైంది. అదే సమయంలో నక్కకు గాయమై అడవిలోకి పారిపోయింది. ఆ మార్గంగా వచ్చిన ప్రజలు మణిని ఊతుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థి మృతి : మైలాపూర్ వీఎం రోడ్డులో ఉన్న ఇండియన్ బ్యాంక్ సమీపంలో బుధవారం ఉదయం బైకుపై వెళుతున్న విద్యార్థినిని ప్రభుత్వ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు చక్రం కింద పడిన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజంగా పరోటా సూరినే..!
42 పరోటాలు తిని రూ.5001 బహుమతి కైవసం తిరువొత్తియూరు: మీరైతే సాధారణంగా ఎన్ని పరోటాలు తినగలరు. మహా ఐతే ఓ అయిదారు. అంతకంటే ఎక్కువ తినాలంటే కష్టమే. అయితే నెల్లై జిల్లాలో ఓ యువకుడు ఏకంగా 42 పరోటాలు తిని రూ.5001 నగదును బహుమతిగా పొందాడు. వెన్నెలా కబడి కుళు చిత్రంలో నటుడు సూరి పరోటా తిన్న దృశ్యం ఎప్పుడు చూసినా మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క దృశ్యంతో నటుడు సూరి, పరోటా సూరిగా మారిపోయాడు. తమిళనాటలో పరోటాకు ప్రాధాన్యత ఎక్కువే. ఇదే తరహాలో పరోటా ప్రియులను ఆకర్షించేందుకు నెల్లై జిల్లా కల్లిడై కురిచ్చిలోని ఓ హోటల్లో వింత పోటీ నిర్వహించారు. నమ్మ ఊరు పరోటా సూరి యార్?(మన ఊరి పరోటా సూరి ఎవరు?) అనేది పోటీ పేరు. అందరికంటే ఎక్కువ పరోటాలు తిన్న వారికి రూ.5001 నగదు బహుమతి అందజేయనున్నట్టు హోటల్ యజమాని ప్రకటించాడు. దీనిపై ఆ ప్రాంతంలో పోస్టర్లు అతికించారు. దీన్ని సెల్ఫోన్లో ఫొటోలు తీసిన కొందరు తమ స్నేహితులకు వాట్సాప్‌లో పంపడంతో ఈ పోటీకి మంచి ప్రచారం వచ్చింది. ఈ పోటీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకుని పోటీ పడి మరి పరోటాలు లాగించారు. అయితే పదికి మించి ఎవరూ తినలేకపోయారు. శివగంగైకు చెందిన కాదర్ మైదీన్ అనే యువకుడు ఏకంగా 42 పరోటాలను లాగించి ‘పరోటా సూరి’గా పేరుపొందాడు. దీంతో హోటల్ యజమాని ప్రకటనలో తెలిపిన విధంగా అతనికి నగదును బహుమతిగా అందజేశాడు. -
కౌసల్య తల్లికి పోలీస్ కస్టడి
తిరువొత్తియూరు: ఉడుమలైకు చెందిన దళిత యువకుడు హత్య కేసులో కౌసల్య తల్లిని రెండు రోజులు పోలీసు కస్టడిలో ఉంచి విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉడుమలై సమీపంలోని కుమరలింగంకు చెందిన వేలుస్వామి. ఇతని కుమారుడు శంకర్. దళిత కుటుంబానికి చెందిన ఇతను, పళణికి చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న కౌసల్య తల్లిదండ్రులు, బంధువులు ఆమెను బెదిరించినప్పటికీ శంకర్‌తో కలిసి కాపురం చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో 13వ తేదీ ఉడుమలై సెంట్రల్ బస్టాండ్ వద్ద ఈ ప్రేమజంటపై కిరాయి రౌడీలు కత్తులతో దాడి చేశారు. దాడిలో శంకర్ మృతి చెందాడు. తీవ్రగాయాలైన కౌసల్యను చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి చిన్నస్వామి, కౌసల్య మామ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కౌసల్య తల్లి అన్నలక్ష్మి, తేని కోర్టులో లొంగిపోయింది. ఈమెను గురువారం ఉడుమలై కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడిలోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు కోర్టులో అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన మెజిస్ట్రేట్ అన్నలక్ష్మిని రెండు రోజులు పోలీసు కస్టడీలో ఉంచి విచారణ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
తిరువొత్తియూరు: అరియలూరు వద్ద శనివారం ఉదయం 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై నుంచి తిరుచ్చికి వెళుతున్న మలైకోటై ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు అరియలూరు ఏసీ గేటు వద్ద రైలు వస్తుండగా రైలు పట్టాలపై ఓ యువకుడు, ఓ యువతి నిలబడివున్నారు. వీరినిచూసి దిగ్భ్రాంతి చెందిన ఇంజిన్ డ్రైవర్ వారిని దూరంగా తొలగిపొమ్మని చేయి చూపిస్తూ హెచ్చరించారు. రైలు ప్రేమజంటను ఢీకొంది. ఈ ఘటనలో వారు మృతి చెందారు. రైలు డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో ప్రేమికుడు సేలం జిల్లా నంగవల్లి గ్రామం గోమతి కాంప్లెక్స్‌కు చెందిన మణికుమారుడు మారిముత్తు (29), కరూర్ జిల్లా అవరం కురిచ్చ పెరియస్వామి కుమార్తె సుగుణ (20) అని తెలిసింది. వీరి ప్రేమను పెద్దలు తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. -
విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: విద్యార్థిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ కోసం ప్రత్యేక పోలీసులు గాలిస్తున్నారు. నెల్లై జిల్లా కలక్కాడు సమీపం వెల్లికాడువెట్టి గ్రామానికి చెందిన విద్యార్థిని సమీపంలో ఉన్న ఇడయన్కులం అమీర్జామత్ పాఠశాలలో చదువుతోంది. గురువారం విద్యార్థిని ఊరి నుంచి సైకిల్‌పై పాఠశాలకు వెళుతున్న సమయంలో ఆ మార్గంలో బైకులో వచ్చిన కానిస్టేబుల్ గణేషన్(36) విద్యార్థిని వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని అతని నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కల్లకాడు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. డీఎస్పీ షణ్ముగం వారితో చర్చలు జరిపి కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశారు. పోలీసులు గణేషన్ కోసం గాలిస్తున్నారు. -
భర్త ఇంటి ముందు దీక్ష
తిరువొత్తియూరు:వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, మామ, అత్తలపై చర్యలు తీసుకోవాలని భర్త ఇంటి ముందు భార్య దీక్ష చేపట్టింది. చెన్నై అరుంబాక్కంకు చెందిన వైదేహికి, ఐనావరం వెస్టుమాడ వీధికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగదీష్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 47 సవర్ల నగలు, కట్న కానుకలు వధువు ఇంటి వారు వరుడికి ఇచ్చారు. అయితే అదనంగా రూ.15 లక్షల వరకట్నం కోరు తూ జగదీష్, మామ ఆర్ముగం, అత్త చంద్ర కలిసి వైదేహిని చిత్ర హింసలు పెట్టారు. దీంతో ఆరు నెలలకు ముందు వైదేహ పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం కుటుంబ సభ్యుల సూచన మేరకు భర్త, అత్త మామలపై తగు చర్యలు తీసుకోవాలని ఐనావరం పోలీ సులకు మార్చి 12న ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదుపై పోలీసులు తగు చర్యలు తీసుకోలేదు. ముందస్తు జామీ న్ కోరుతూ చెన్నై జిల్లా కోర్టులో జగదీష్ దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత వైదేహి నుంచి విడాకులు కోరుతున్నట్టు నోటీసు పంపాడు. ఇది చూసిన వైదేహి దిగ్భ్రాంతి చెందింది. మంగళవారం ఉద యం జగదీష్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కోర్టులో తోసిపుచ్చారు. దీంతో వైదేహి తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఐనావరం మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లీలావతి, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వైదేహి రాత్రి 10 గంటలకు భర్త ఇంటి ముందు కూర్చుని ధర్నా చేపట్టింది. బుధవారం కూడా వైదేహి దీక్ష కొనసాగించింది. దీనిపై సమాచారం అందుకున్న ఐనావరం పోలీసు ఇన్స్పెక్టర్ కనకరాజ్, పోలీసు లు అక్కడికి చేరుకుని వైదేహితో చర్చలు జరిపారు. భర్త, అత్త, మామలను అరె స్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైదేహి దీక్ష విరమించింది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుండ్రత్తూరు వర్షానగర్‌కు చెందిన మాణిక్యం (50), కన్నన్ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు. వీరు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో పూందమల్లి నుంచి బైకులో కుండ్రత్తూర్కు బయలుదేరారు. వీరిని కొల్లాచ్చి వద్ద లారీ ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ వచ్చే లోపు మాణిక్యం మృతి చెందాడు. కన్నన్ను కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసిన ప్రజలు ఆగ్రహం చెంది లారీని ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై ధర్నా చేశారు. లారీ డ్రైవర్ రాజేంద్రన్ (35)మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.చెట్టు నరుకుతూ కిందపడిన వ్యక్తి మృతిచెన్నై తిరువికానగర్ టీటీ తోటకు చెందిన మోహన్ ఇల్లు కట్టుకునేందుకు చెట్టును తొలగించాలని కీల్పాకంకు చెందిన కుమార్ (45)ను పిలిపించాడు. కుమార్ చెట్టుపైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. తిరువికా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా: నలుగురి మృతి కన్యాకుమారి జిల్లా మార్తాండం మాకోడుకు చెందిన బ్యాండు వాద్యం బృందం మదురై మేలూరులో జరిగే వివాహ కార్యక్రమానికి శనివారం కారులో బయలుదేరారు. పాళయం కోట్టై పెరుమాల్‌పురం వద్ద 25 అడుగుల వంతెనపై వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. 12 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మాకోడుకు చెందిన జాని భార్య చిత్ర (26) మృతి చెందింది. పుదుచ్చేరి విల్లియలూరుకు చెందిన శరవణన్ (41) ఆచార్య విద్యా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో నిత్యానందన్ (35), బాలాజీ (37), మొదలియార్ పేటకు చెందిన సుధాకర్ (40) పని చేస్తున్నారు. శరవణన్ బంధువు ఒకరికి ఆదివారం ఉదయం నెల్లైలో వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరు కావడానికి శరవణన్, సుధాకర్, నిత్యానందన్, బాలాజీ పుదుచ్చేరి నుంచి నెల్లైకి కారులో బయలుదేరారు. కారును నిత్యానందన్ నడుపుతున్నాడు. కోవిల్పట్టి సమీపంలో అర్ధరాత్రి 11.50 గంటల సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారులో చిక్కుకున్న శరవణన్, నిత్యానందన్, బాలాజీ అక్కడికక్కడే మృతి చెందారు. సుధాకరన్ తీవ్రంగా గాయపడ్డాడు. కోవిల్పట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.