
ప్రతీకాత్మకచిత్రం
చెన్నై: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తెలపై కన్ను వేయడంతో ప్రియురాలే హతమార్చి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు.. విల్లుపురానికి చెందిన ఆర్ముగం కుమారుడు ప్రభు (36) వివాహితుడు. ఇతనికి వితంతు మహిళ వినోద (34)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వినోదకు మొదటి భర్త ద్వారా ముగ్గురు కుమార్తెలు (16,14,10 వయస్సు) ఉన్నారు.
ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ 3వ తేదీ అయ్యంపాళయం కావేరి నదిలో కుల్లిన స్థితిలో ప్రభు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. విచారణలో ప్రభు వినోద కుమార్తెలకు లైంగిక వేధింపులు ఇస్తుండడంతో వినోద అతన్ని కత్తితో హత్య చేసి కావేరి నదిలో పడవేసినట్లు తెలిసింది. ప్రభు తండ్రి ఆర్ముగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోదను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment