
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తమిళనాడు మాజీ డీజీపీ తిలకవతి కుమారుడిపై ఆమె కోడలు సేలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మాజీ డీజీపీ తిలకవతి కుమారుడు ప్రభు తిలక్ (48). ఇతని భార్య శృతి తిలక్(40). ఇద్దరి తల్లిదండ్రులు ఇల్లు సేలం అలగాపురం బృందావన రోడ్డులో ఉంది.
బుధవారం శృతి తిలక్ తండ్రి షణ్ముగస్వామితో కలిసి సేలం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. అందులో తనకు మాజీ డీజీపీ తిలకవతి కుమారుడు ప్రభు తిలక్‌తో 2007లో వివాహమైందని, ఇద్దరు బిడ్డలున్నారని పేర్కొంది. భర్త సేలంలోని ప్రైవేటు ఆసుపత్రి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడని, వివాహమైనప్పటిæ నుంచి తనను రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ప్రభుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment