రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం
Published Sat, Aug 24 2013 1:31 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: కాలేజీకి వెళుతున్న అన్నదమ్ములు పూందమల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇంజనీరింగ్ చదువుతున్న వారు కళాశాలకు వెళుతుండగా పూందమల్లి వద్ద టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొనింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, ముగప్పేర్ వెస్టు మొదటి బ్లాక్‌లో నివాసముంటున్న చెల్లదురై ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఇతనికి విజయవరదన్(19), విజయ సారథి (18)అనే కుమారులు ఉన్నారు.
విజయవరదన్ పూందమల్లి సమీపంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో బిటేక్ ద్వితీ య సంవత్సరం చదువుతున్నాడు. విజయ సారథి నజరత్ పేట సమీపంలో ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే బైకులో కళాశాలకు వెళ్లి వస్తుంటారు. విజయ వరదన్‌ను పూందమల్లిలో వదిలిపెట్టి విజయ సారధి కళాశాలకు వెళతాడు. తిరిగి సాయంత్రం ఇద్దరూ కలిసి బైకులో ఇంటికి వస్తారు.
ఎప్పటిలాగే అన్నదమ్ములు ఇద్దరూ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలలకు బైకులో బయలుదేరారు. తొమ్మిది గంటల సమయంలో పూందమల్లి చెన్నీర్ కుప్పం వెట్రినిలైతోట ఆవడి రోడ్డులో వస్తుండగా రోడ్డుపై మిట్ట పల్లాలు వుండడంతో బైకును నిదానం గా నడిపారు. ఆ సమయంలో వెనుక వస్తున్న టిప్పర్ లారీ బైకును దాటి వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో లారీ బైకును ఢీకొట్టింది. దీంతో వెనుక చక్రం కింద పడి అన్నదమ్ములు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ పారిపోయాడు. కళాశాలకు సమీపంలో ప్రమాదం జరగడంతో ఇది తెలుసుకున్న విద్యార్థులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్ లారీని ధ్వంసం చేశారు. రోడ్డుపై ఆం దోళన చేశారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న జాయింట్ కమిషనర్ షణ్ముగవేలు, డిప్యూటీ కమిషనర్ సెల్లకుమార్, సహాయ కమిషనర్ మురుగేశన్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులతో చర్చించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని అధికారు లు విద్యార్థులకు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు అక్కడ ఆందోళన విరమించారు. కళాశాల ఆవరణలో ఆందోళన కొనసాగించారు. విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల తండ్రి చెల్లదొరై ముగప్పేర్ వెస్టు 91వ వార్డుకు అన్నాడీఎంకే నాయకుడిగా ఉన్నారు. తల్లి శాంతి, అక్క ప్రియ. ప్రియ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
Advertisement
Advertisement