చెట్టును ఢీ కొట్టిన వ్యాన్‌.. ఆరుగురి దుర్మరణం | Tamil Nadu Ulundurpet Road Accident Telugu News Details | Sakshi
Sakshi News home page

తమిళనాడు: చెట్టును ఢీ కొట్టిన వ్యాన్‌.. ఆరుగురి దుర్మరణం

Published Wed, Sep 25 2024 6:48 AM | Last Updated on Wed, Sep 25 2024 8:25 AM

Tamil Nadu Ulundurpet Road Accident Telugu News Details

చెన్నై: తమిళనాడులో ఈ వేకువఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్‌ చెట్టును ఢీకొట్టి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

కళ్లకురిచి జిల్లా ఉలుందూర్‌పేట రహదారిపై మెట్టాథూర్‌ వద్ద ఈ వేకువజామున ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. యాక్సిడెంట్‌ తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడంతో.. పోలీసులు క్లియర్‌ చేశారు.

వ్యాన్‌లోని ప్రయాణికులు తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియరావాల్సి ఉంది.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement