రూ.5 లక్షల కోసం మహిళ హత్య | Women murder for 5 lakh rupees | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల కోసం మహిళ హత్య

Published Thu, Oct 10 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

Women murder for 5 lakh rupees

తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రూ.5లక్ష ల కోసం మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. చెన్నై కొత్త చాకలిపేట వివోసి నగర్ తిరువళ్లూర్ హౌసింగ్ కాలనీకి చెందిన మదనగోపాల్(68) బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఇతని కుమారుడు భాస్కర్(45). ఈయనకు భార్యరేఖ(40), కుమర్తె శ్రీనిధి(11), అవినాష్ సాయిరాం(8) అనే కుమారుడు ఉన్నారు. శ్రీనిధి ఆరో తరగతి, సాయిరాం మూడో తరగతి చదువుతున్నా రు. మంగళవారం ఇంట్లో రేఖ ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుడు రేఖ గొంతు కోసి హత్య చేశాడు.
 
ఆమె మెడలోని 13 సవర్ల నగలను లాక్కొని పారిపోయాడు. దీనికి సంబంధించి కొత్త చాకలి పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హంతకున్ని పట్టుకోవడానికి డెప్యూటీ కమిషనర్ నిజేమల్ హోడా, సహాయ కమిషనర్ దైవశిఖామని, ఎస్‌ఐ ఇసక్కి నే తృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడింది. పోలీసులు రేఖ భర్త, వారి బంధువుల వద్ద విచారణ చేపట్టారు. భాస్కర్ పిన్ని కుమార్తె సుమతి భర్త సతీష్‌కుమార్(22) ప్లంబర్‌గా ఉన్నాడు. సతీష్‌కుమార్ తరచూ భాస్కర్ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లేవాడని తెలిసింది. సతీష్‌కుమార్‌పై పోలీసులకు సందేహం రావడంతో పెరుంగళత్తూరులో ఉన్న అతన్ని మంగళవారం పట్టుకున్నారు. విచారణ చేయగా.. రేఖను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పని లేకపోవడంతో డబ్బులు కావలసిన సమయంలో తరచూ భాస్కర్ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్తుంటాడు.
 
బంధువు కావడంతో భాస్కర్ అతనికి సహాయం చేస్తూ వచ్చారు. మంగళవారం సతీష్‌కుమార్ భాస్కర్ ఇంటికి వచ్చి తాను సొంతంగా వ్యాపారం చేస్తున్నానని.. రూ.5 లక్షలు ఇవ్వాలని కోరాడు. దీంతో ఇంతవరకు తీసుకున్న డబ్బులు తిరి గి ఇవ్వాలని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. ఆగ్రహం చెందిన సతీష్‌కుమార్ ఇంటిలో ఉన్న పూలకుండీని తీసుకుని రేఖ తలపై కొట్టాడు. దీంతో స్పృహ తప్పింది. వంట గదిలో ఉన్న కత్తితో రేఖ గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మెడలోని 13 సవర్ల నగలను లాక్కొని పారిపోయాడు. సతీష్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement