Women murder
-
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
కర్ణాటకలో యువతిపై హత్యాచారం
బీదర్: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ప్రధాన నిందితుడైన ఆమె బంధువు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుణతీర్థవాడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల తమ కుమార్తె ఆగస్ట్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ ఒకటిన∙స్థానిక పాఠశాల వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో అదృశ్యమైన రోజున ఆమెతో ఫోన్లో మాట్లాడిన ముగ్గురిని గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరు ఆమెను ఆరోజు కలుసుకున్నట్లు తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఘటనాస్థలానికి కొద్ది దూరంలో తన ఇద్దరు మిత్రులు వాహనంతో కాపలాగా ఉండగా యువతిని రేప్ చేసి, తలపై బండరాయితో మోది చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు, ప్రధాన నిందితుడు బంధువులవుతారని బీదర్ ఎస్పీ తెలిపారు. హత్యాచారం ఘటనపై బీదర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. -
శంషాబాద్‌లో దారుణం.. కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. కాగా, పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పడేసినట్టు తెలిపారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా, మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళ 35, 36 సంవత్సరాలు వయసుగా ఉంటుంది. కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా.. -
మెదక్: పట్టపగలే దారుణం..
మెదక్ మున్సిపాలిటీ: పట్టపగలు ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. ఈ ఘటన శనివారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం కలాన్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం, సుజాత (42) దంపతులు మెదక్‌లోని పెద్దబజార్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం ఉదయం కూరగాయలు అమ్మేందుకు భార్యభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో సుజాత ఇంటికి వెళ్లి వంటచేసి భోజనం తీసుకొని వస్తానంటూ వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా భార్య రాకపోగా, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడంలేదని వెంకటేశం ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుజాతను చూసి భయాందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో వెంకటేశం మెదక్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, ఎస్ఐ మల్లారెడ్డి, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్ రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. దుండగులు సుజాత మెడను కోసి, ముఖంపై కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఆమె మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడు, చెవి కమ్మలను దోచుకెళ్లారు. -
‘మా నాన్న 70 మంది మహిళలను చంపేశాడు.. నేనే సాక్ష్యం’
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులకు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30 ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఓ మహిళ వెల్లడించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయ పడేవారమని లూసీ స్టడీ అనే మహిళ న్యూస్‌వీక్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టారో తనకు తెలుసునని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసు శునకాలు మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది. నిందితుడు డొనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలపై అతడి కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళలను హత్య చేసి వాటిని సమీపంలోని బావి, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లేందుకు తన పిల్లల సాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్లను ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది బాధితులను సమీపంలోని 100 అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోపీలవలే భావించి వాటిని తన తండ్రి దాచుకునేవారని చెప్పింది మహిళ. లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిఫ్పర్ డాగ్స్‌తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ, శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద శ్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు డొనాల్డ్ స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన 5 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే.. లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్‌గా డొనాల్డ్ స్టడీ నిలవనున్నాడని అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు. అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పింది లూసీ స్టడీ. ఇదీ చదవండి: చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..! -
రెండేళ్ల కిందట భర్త మృతి.. తర్వాత తమ్ముడే ఇలా చేస్తాడని ఆమె అనుకోలేదేమో!
తుమకూరు: కనిపించకుండా పోయిన హులియూరు పోలీస్‌స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్ హత్యకు గురైనట్లు తేలింది. ఆమె చిన్నాన్న కుమారుడు మంజునాథ్ (32) హత్య చేసి, ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకరాం.. కానిస్టేబుల్ ఎస్.సుధా (38) ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పీఎస్ నుంచి స్థానికంగా ఉన్న తన ఇంటికి బయల్దేరింది. అయితే ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు 14 సంవత్సరాల కొడుకు, 10 ఏళ్ల కూతురు ఉన్నారు. రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. ఏడాదిన్నరగా హులియూరులో పనిచేస్తున్నారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న హులియూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. హైవే పక్కన మృతదేహాం కర్ణాటక రాష్ట్రంలో హాసన్ జిల్లాలోని అరిసికెరె తాలూకాలోని అరసికెరె– తిపటూరు మధ్య జాతీయ రహదారి– 206లో మైలనహళ్ళి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం సుధా శవం కనిపించింది. అక్కడి పోలీసులు దర్యాప్తు చేయగా సుధా మృతదేహమని తెలిసింది. మరోవైపు శివమొగ్గలో ఒక లాడ్జిలో మంజునాథ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆస్తి గొడవలే కారణం? పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. సుధా, మంజునాథ్‌ల స్వస్థలం జిల్లాలోని చిక్కనాయకనహళ్లి. వీరికి డబ్బులు, ఆస్తి గొడవలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడుదామని చెప్పి సుధాను మంజునాథ్ కారులో తీసుకెళ్లి హత్య చేశాడు. అతని వద్ద డెత్‌నోటు దొరికింది, తానే సుధాను హత్య చేశానని, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
భర్తతో విడిపోయిన మీనా.. రెండో వివాహం చేసుకున్న తర్వాత..
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో రెండో వివాహం చేసుకున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ఆమె తల్లి, అన్నతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, సెయ్యంగనల్లూర్ సమీపంలోని కరుంగుళం, తాత్తాన్‌కుళంకు చెందిన సిడలై ముత్తు కుమార్తె మీనా (21). ఈమెకు ఐదేళ్ల క్రితం తాత్తాన్‌కుళం సమీపంలోని కాల్వాయ్ గ్రామానికి చెందిన ఇసక్కి పాండియన్‌తో వివాహమైంది. వీరికి కుమారుడు నిశాంత్ (04) ఉన్నాడు. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయిన మీనా నెల్లై జిల్లా పడపిల్లై పుదూర్‌కు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతనితో 10 నెలలుగా కాపురం చేస్తున్నట్లు సమాచారం. నిశాంత్ తండ్రి వద్ద ఉన్నాడు. కాగా, కుమార్తె రెండవ వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన సుడలైముత్తు కుటుంబం మీనాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం తాత్తాన్‌కుళంలో జరిగిన ఆలయ ఉత్సవాలకు మీనా తన పిన్ని పార్వతి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సడలై ముత్తు, అతని భార్య ముప్పిదాతి, కుమారుడు మాయండి, సడలై ముత్తు అన్న తలవాయ్, అతని భార్య వీరమ్మాళ్, వీరి కుమారుడు మురుగన్ మీనాతో గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహం చెందిన సడలై ముత్తు తన వద్ద ఉన్న కత్తితో మీనా పైదాడి చేశాడు. దీంతో మీనా ఘట నా స్థలంలోనే దుర్మరణం చెందింది. సెంగనల్లూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని శవ పరీక్ష కోసం నెల్లై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. -
మరదలిని తుపాకితో కాల్చిన బావ
హుకుంపేట (అరకులోయ): అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదం నేపథ్యంలో బావ తన మరదలిని తుపాకితో కాల్చి తీవ్ర గాయాలుపాలు చేసిన ఘటన విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కేంద్రంలో జరిగింది. హుకుంపేట ఎస్ఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామంలో కిల్లో కృష్ణ, కిల్లో జయరామ్ తమ తండ్రి పేరున ఉన్న భూమిని అన్నదమ్ములు పంచుకోలేదు. అయితే ఇటీవల రైతు భరోసా పథకం కింద జయరామ్ ఖాతాలో సొమ్ము జమైంది. ఈ సొమ్ము కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొనడంతో ఆదివారం ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో కిల్లో కృష్ణ తన వద్ద ఉన్న నాటు తుపాకితో కాల్పులు జరపడంతో అతని తమ్ముడి భార్య కొండమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశార -
గుడికని భర్తకు చెప్పి.. ప్రియుడి చేతిలో హతమైంది
చెన్నై: తిరుమంగై అనే మహిళను గొంతు నులిమి హత్య చేశానని ఆమె మాజీ ప్రియుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా రామపుదూర్‌కు చెందిన రమేష్, తిరుమంగై(33) ఓ హోటల్లో పనిచేసేవారు. 5నెలల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తిరుమంగై తన పిన్ని వాళ్లతో కలిసి యోగనూర్‌లోని గుడికి వెళ్లొస్తానని భర్తకు చెప్పింది. తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. గురువారం తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలో అమరావతి నది పక్కన పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా కేసును చేదించారు. సేలం అమ్మాపేటకు చెందిన ధనపాల్(24)ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి కథనం మేరకు.. నామక్కల్‌లో తిరుమంగై రాత్రివేళల్లో టిఫిన్ దుకాణం నిర్వహించేది. అప్పుడే జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనపాల్కు ఆమె పరిచయమైంది. అయితే తర్వాత రమేష్‌ను ఆమె పెళ్లిచేసుకోవడంతో ధనపాల్ కక్ష పెంచుకున్నాడు. తిరుమంగైకి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. నమ్మి వచ్చిన ఆమెను అమరావతి నది దగ్గరకు తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. నేరం అంగీకరించిన ధనపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : స్థానిక లాల్‌బహుదూర్ నగర్లో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన సోమవారం పలమనేరులో సంచలనం సృష్టించింది. పలమనేరు డీఎస్పీ గిరిధర్ కథనం.. మండలంలోని నక్కపల్లెకు చెందిన సుశీల(48)కి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త నారాయణ రెడ్డి గతంలో మృతిచెందారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి సుశీల, మరో వ్యక్తితో కలసి లాల్‌బహుదూర్ నగర్లో చెంగమ్మ ఇంటికెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అయితే ఇల్లు అద్దెకు లేదని చెప్పడంతో వారిరువురూ రాత్రయిందని, తాము ఈ పూటకి ఇక్కడే తలదాచుకుని ఉదయాన్నే వెళతామని అక్కడి వరండాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి సుశీల రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె తలపై నిందితుడు బండరాయితో మోది హతమార్చినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. ఇలా ఉండగా హత్య జరగడానికి ముందే చెంగమ్మ నిద్రించిన ఇంటితలుపుకు గడి పెట్టి∙ఉంది. ఉదయం ఆమె ఇతరులకు ఫోన్‌చేసి ఇంటిలోంచి బయటకు వచ్చిన తర్వాతే హత్యోదంతం వెలుగుచూసింది. ఇలా హతురాలు, నిందితుడు ఇద్దరూ గతంలో పట్టణంలోని ఓ క్వార్టర్స్‌లో ఉంటూ తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో మద్యం సీసా కూడా ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని పలమనేరు డీఎస్పీ, పట్టణ సీఐ శ్రీధర్ పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాస్త పొట్టిగా ఉన్న నిందితుడు హిందీ మాట్లాడుతాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
హత్య చేసి.. నగలు దోచేసి..
నెల్లూరు(క్రైమ్): ఒంటరిగా నివశిస్తున్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమెను తగులబెట్టి నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని రామలింగాపురంలోని సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నీలగిరిసంఘానికి చెందిన బి.నిర్మలాబాయి (45)కి 23 సంవత్సరాల క్రితం రమేష్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం రమేష్‌సింగ్ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె నగరంలోని బీవీనగర్‌లోని తన బంధువుల ఇంటి వద్ద ఉంటూ రామలింగాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె తిరుపతిలో ల్యాబ్‌టెక్నీషియన్ కోర్సు చదువుతోంది. సుమారు నెలన్నర నుంచి ఆమె రామలింగాపురంలో సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇల్లు స్కూల్ దగ్గరగా ఉండడంతో ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చేది. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో పని ఉందని స్కూల్ నుంచి ముందుగానే వెళ్లింది. రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకుంది. దట్టమైన పొగ రావడంతో.. సుమారు 7.45 గంటల ప్రాంతంలో నిర్మలాబాయి నివశిస్తున్న రెండో అంతస్తు ఇంట్లోనుంచి దట్టమైన పొగ బయటకు వచ్చింది. ఆమె ఇంటి పైభాగంలో నివాసం ఉంటున్న యువకులు ఈ విషయాన్ని గుర్తించి ఏం జరిగిందోనని నిర్మలాబాయి ఇంటివద్దకు పరుగులు తీశారు. తలుపు ఓరగా వేసి ఉండడంతో తెరిచి పక్కనే ఉన్న బాత్రూమ్లో నుంచి నీటిని తెచ్చి చల్లారు. దీంతో ఉమాబాయి మృతదేహం కాలుతూ కనిపించడంతో వారు అక్కడినుంచి పరుగులు తీసి చుట్టుపక్కల వారికి విషయం తెలియజేశారు. బాలాజీనగర్ ఎస్సై రమేష్‌బాబు తన సిబ్బందితో అటుగా వెళుతూ స్థానికులు గుమికూడి ఉండడం, పొగ వస్తుండటాన్ని గుర్తించి సంఘటనా స్థలానికి వెళ్లారు. నిర్మలాబాయి ఇంటివద్దకు చేరుకుని పరిశీలించారు. పరుపుపై ఆమె మృతదేహం కనిపించింది. పూర్తిగా కాలిపోయి ఉంది. ఇంట్లోనుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా గమనించిన పోలీసు సిబ్బంది వంటగదిలోకి వెళ్లి రెగ్యులేటర్‌ను ఆఫ్ చేశారు. అనంతరం జరిగిన విషయాన్ని ఎస్సై బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణల దృష్టికి తీసుకెళ్లారు. గొంతులో పొడిచారు సంఘటనా స్థలానికి చేరుకున్న నగర డీఎస్పీ, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు సంఘటన జరిగిన తీరును బట్టి తొలుత అగ్నిప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతదేహాన్ని పరిశీలించగా అగ్నిప్రమాదం కాదని తేలింది. ఆమె గొంతులో బలమైన ఆయుధం (కత్తి లేదా స్క్రూ డ్రైవర్)తో విచక్షణారహితంగా 15 పోట్లకు పైగా పొడిచి ఉండడాన్ని గుర్తించారు. చెవుల రంధ్రాలు తెగి ఉండడాన్ని బట్టి కమ్మలను సైతం దుండగులు తెంపుకెళ్లినట్లు తెలుస్తోంది. మంటల కారణంగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. తెలిసిన వారి పనే? తెలిసిన వారే ఈ దురాఘతానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఏడు గంటలకు ఇంటికి వచ్చింది. అరగంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశమే లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే మృతురాలు పెద్దగా కేకలు వేయడంతోపాటు ప్రతిఘటించేది. సంఘటనా ప్రదేశంలో పెనుగులాడిన ఆనవాళ్లు సైతం లేవు. దీనిని బట్టిచూస్తే బాగా తెలిసిన వారి పనై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఆమెను హత్యచేసి ఆపై తగులబెట్టారు. గ్యాస్‌ను లీక్ చేశారు. దీనిని బట్టిచూస్తే గ్యాస్ లీకై ప్రమాదం సంభివించి ఆమె మృతిచెందిందని నమ్మించేలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. మరోవైపు చెవుల్లోని కమ్మలు దొంగలించడాన్ని చూస్తే ఈ పని దొంగలు చేసి ఉంటారని నమ్మించే ప్రయత్నం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు మర్డర్ ఫర్ గెయిన్ కింద కేసు నమోదుచేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. బుధవారం ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లి మృతదేహాన్ని చూసిన పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఏ కారణంతో? హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసూయ, ఆర్థిక లావాదేవీలా? కుటుంబకలహాలా? నిజంగా ఆగంతుకుల పనేనా తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి ఫోన్‌కాల్ డీటైల్స్‌ను, సంఘటన జరిగిన సమయంలో టవర్ లోకేషన్ ద్వారా వివరాలను సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ తరహా నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులను సైతం విచారిస్తున్నారు. మొత్తంగా కేసులోని మిస్టరీని త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. -
భార్యపై అనుమానంతోనే హత్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపినట్లు పోలీసుల వద్ద నిందితుడు హరీశ్ అంగీకరించినట్లు పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 24న గట్టెపల్లిలో గన్నిసంచిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. కరీంనగర్లో ఫ్యాషన్ డిజైనర్‌గా రమ పని చేసిన సమయంలో శ్రీరాం చిట్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న రేవెళ్లి హరీశ్‌తో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కరీంనగర్‌లోని హజ్మత్‌పురాలో ఆరీఫ్ ఇంట్లో అద్దెకు జాడి రమ అలియాస్ లక్కీఅలియాస్ సిరివెన్నెలతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ రమ తరచూ ఫొన్లో మాట్లాడడాన్ని హరీష్ గమనించి తప్పుబట్టాడు. ఏప్రిల్ 7వ తేదీన తన భర్త వేధిస్తున్నాడని 100కి ఫోన్‌చేసి రమ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీన్ని మనుసులో పెట్టుకొని హత్య చేసినట్లు హరీశ్ ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ఈనెల 21న అద్దెకుంటున్న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి తన ద్విచక్ర వాహనంపై గట్టెపల్లిలో గన్నిసంచిలో పడేసినట్లు అంగీకరించాడని వివరించారు. సోషల్ మీడియాలో, పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు మృతురాలి కుటుంబసభ్యులు అక్క రాధా, అన్న భానేశ్, ఇంటి యజమాని ఆరీఫ్ సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండురోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. రమది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నార్వ స్వగ్రామం. నిందితుడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ నివాసి అని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ఆమె ఎవరోతెలిసింది..!
కుత్బుల్లాపూర్: దేవరయాంజాల్ రైల్వే ట్రాక్ సమీపంలో దారుణ హత్యకు గురైన మహిళ ఆచూకీ ఎట్టకేలకు కనుగొన్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గురువారం రాత్రి ఈ హత్య జరగ్గా.. హతురాలిని గుర్తించాలని పోలీసులు స్థానికులను కోరగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. దీంతో సీఐ మహేశ్ ఆయా ప్రాంతాల్లో పది బృందాలతో ఆరా తీయగా హతురాలు జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉండే ఉప్పలూరి దుర్గ (30) గా తేలింది. ఈమెతో పాటు కుమారుడు, తల్లి ఉంటున్నారు. గురువారం సాయంత్రమే ఓ వ్యక్తితో దేవరయాంజాల్ సమీపానికి దుర్గ వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. వచ్చిన వ్యక్తితో మద్యం తాగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి చంపారా.. లేదా ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అన్న విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితమే భర్తతో విడాకులు.. దుర్గకు శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం కాగా మూడేళ్ల క్రితం గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందా.?, దుర్గ తాగుడుకు బానిసైందని, ఎవరైనా ఈమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా.. అన్న కోణంలో సైతం విచారణ వేగవంతం చేశారు. -
హత్యా.. ఆత్మహత్యా..?
నల్లగొండ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘటన దేవరకొండ మండల పరిధిలోని గన్యనాయక్‌తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన సుగుణ(30)కు పాల్త్యతండాకు చెందిన శ్రీనుతో పదిహేడేళ్ల ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆరు సంవత్సరాల క్రితం సుగుణ భర్త మృతి చెందాడు. దీంతో సుగుణ తండాలోనే చిన్న కిరాణ దుకాణం నడుపుతూ కుమార్తె, కుమారుడితో జీవనం సాగిస్తోంది. కాగా, సుగుణకు ఆరేళ్ల క్రితం కొండమల్లేపల్లికి చెందిన వెంకటపతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో గురువారం తండాకు వచ్చిన వెంకటపతి శుక్రవారం మధ్యాహ్నం సుగుణ(30) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండాలోనే నివాసం ఉంటున్న సుగుణ తల్లి అస్లి ఇంట్లోకి వెళ్లి చూడగా సుగుణ మృతిచెంది ఉంది. సమాచారం అందుకున్న దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి అస్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సుగుణది హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మహిళ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం, అపోలో ఆస్పత్రికి కూతవేటు దూరం, చొప్పదండి– కరీంనగర్ ప్రధాన రహదారిపై బానాల రమణ(25)ను సిమెంట్ ఇటుకతో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రధాన రహదారిపైనే మహిళను హత్య చేయడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దారుణంగా హత్య.. నగరంలోని అపోలో రీచ్ ఆస్పత్రికి కూత వేటు దూరంలో కరీంనగర్–చొప్పదండి ప్రధాన రహదారి పక్కన సయ్యద్ యూసుఫ్ పండ్ల దుకాణం ఏర్పాటు చేసేందుకు మూడు రోజులుగా తడుకల షెడ్డు పనులు చేస్తున్నారు. షెడ్డులో ఓ మహిళ(25)ను దారుణంగా హత్య చేశారని ఉదయం 7.30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బ్రౌన్ కలర్ చీర ధరించి ఉన్న మహిళ ముఖాన్ని సిమెంట్ ఇటుకతో మోదడం తల పగిలింది. సంఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనింపించలేదు. ఆమెపై అత్యాచారం జరగలేదని శరీరంలో ఎక్క డా ఎలాంటి గాయాలు లేవని కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి ప్రకటించారు. క్లూస్ టీం పలు ఆ« దారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్ హత్య జరిగిన సంఘటన నుంచి పక్కనే ఉన్న సరస్వతినగర్ వైపు కొంతదూరం వెళ్లి ఓ ఇంటి వద్ద నిలిచింది. కొన్ని గంటల్లోనే గుర్తింపు.. హతురాలు ఎవరనేది గుర్తించేందుకు తాడికల్ హత్య కేసును విచారించిన బృందాన్ని ప్రత్యేకంగా దీని కోసం నియమించారు. వారు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా అందులో మృతురాలు మరో వ్యక్తితో కలిసి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వాటిని కరీంనగర్ సైబర్ ల్యాబ్ సహకారంతో స్పష్టమైన చిత్రాలను తయారు చేసి మీడియా, సోషల్ మిడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మృతురాలి, అనుమానితుడి వివరాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మృతురాలిని, అనుమానితుడిని గుర్తించారు. చిన్నాపైనే అనుమానం..? జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కేంద్రానికి చెందిన బానాల రమణ(25) హైదారాబాద్‌లోని కరకంటి చిన్న (27) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిని ఓ కేసులో గుంటూరు జైలుకు పంపారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరు కూడా రెండు రోజుల క్రితం గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వేకువజామున ఉదయం 2 నుంచి 4 గంటల మధ్య రమణ దారుణహత్యకు గురైంది. అమె వెంట ఉన్న చిన్నానే పథకం ప్రకారం హత్య చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో రమణ వద్ద ఒక సంచి, మరో ప్లాస్టిక్ కవర్ ఉంది. సంఘటన స్థలంలో కవర్ లభించింది. సంచి లభించలేదు. మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. హత్య సమాచారం అందుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, రూరల్ ఏసీపీ ఉషారాణి, టాస్క్ఫొర్స్ ఏసీపీ శోభన్‌కుమార్, రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి, సీసీఎస్ సీఐ కిరణ్‌కుమార్, క్లూస్ టీం ఇన్చార్జి శ్రీధర్, సైబర్ ల్యాబ్ ఇన్చార్జి మురళి, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, టాస్క్ఫొర్స్ ఏసీపీ శోభన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. -
గొంతుకోసి, ముఖంపై కత్తితో పొడిచి..
ఖమ్మంక్రైం: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఖమ్మంలో సంచలనం రేకెత్తించింది. ఖమ్మం అర్బన్ పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపురం హవేలి ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో రాజీవ్‌నగర్ గుట్ట ప్రాంతంలో నివసిస్తున్న పాలపాటి కాంతమ్మ(43) భర్త కృష్ణ 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె స్థానిక ఎస్ఎస్జీకే గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ జీవిస్తోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా చిన్నకుమారుడైన హరీష్ రాజమండ్రిలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. కాంతమ్మ ఒంటరిగా కుంటోంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న దామల్ల సుగుణ స్థానిక చర్చిలో ప్రార్థనకు హాజరై తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కాంతమ్మ తన ఇంటిముందు రక్తం మడుగులో పడి ఉండడాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు వచ్చి 108అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది పరిశీలించి ఆమె అప్పటికే మృతిచెందిదని తెలిపారు. గొంతుకోసి, ముఖంపై తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు.. కాంతమ్మ మృతదేహం పక్కన నన్నబోయిన నాగరాజు అనే యువకుడు కూర్చోని ఉన్నాడు. దీంతో నువ్వు ఇక్కడ ఎందుకు వున్నావుంటూ మొదట మృతదేహాన్ని గమనించిన సుగుణ ప్రశ్నించింది. కాంతమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపుతుండగా గట్టిగా కేకలు వేసిందని, అందుకే వచ్చానంటూ పొంతన లేకుండా మాట్లాడాడు. దీంతో స్థానికులు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైతం పొంతన లేకుండా సమాధానం చెబుతుండటంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కత్తి కూడా కాంతమ్మ చీర కొంగు కిందనే పడి ఉండటంతో పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నాగరాజు ఓ దినపత్రిక(సాక్షి కాదు)లో సర్క్యూలేషన్ విభాగంలో పనిచేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కాంతమ్మ, నాగరాజులు కొంతకాలంగా çసన్నిహితంగా ఉంటున్నారని, ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు సైతం తలెత్తుతున్నాయని తెలిసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా డాగ్ కూడా నాగరాజు వద్దకు చేరుకుని ఆగిపోవటంతో అతడిన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ వివరణ కోరగా.. హత్య సంఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఏసీపీ వెంకట్రావు సందర్శించారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడే కాలయముడు..ప్రియురాలు హత్య
వెంకటగిరి (నెల్లూరు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వెంకటగిరిలోని చింతచెట్టు సెంటర్‌కు చెందిన రజియా అలియాస్ పోలమ్మ (22)ను ఆమె ప్రియుడు పట్టణానికి చెందిన పూజారి రాంబాబు హత్యచేసి పూడ్చిపెట్టిన ఘటన గురువారం మండలంలోని యాతలూరు అటవీప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్ట్టణంలోని కైవల్యానది సమీపంలోని వీరమాతల దేవాలయం చింతచెట్టు ప్రాంతానికి చెందిన రజియా శ్రీకాళహస్తి మండలం చింతపూడికి చెందిన వెంకటేశ్వర్లు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం రజియా భర్త వెంకటేశ్వర్లు సూళ్లూరుపేటలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఈనెల 11వ తేదీన సబ్బు తీసుకువస్తానని పోలమ్మ పట్టణంలోకి వెళ్లి అప్పటినుంచి కనిపించకుండా పోయింది. రజియా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. అయితే ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె తల్లి జవ్వల మస్తానమ్మ తన కుమార్తె కనిపించడంలేదని ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పూజారి రాంబాబుపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాంబాబు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలించారు. రాయితో కొట్టి.. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం స్థానిక వీఆర్వోతో కలసి రాంబాబు పోలీసులకు లొంగిపోయాడు. అతడిని విచారించగా రజియాను హత్య పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తనకు పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడు. రజియా వివాహం చేసుకున్న తర్వాత తనతో సరిగ్గా ఉండటంలేదని 11వ తేదీన పిలిపించుకుని మండలంలోని యాతలూరు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాయితో రజియా ముఖంపై కొట్టడంతో మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. మృతదేహాన్ని సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కొండపనాయుడు, తహసీల్దార్ రాజ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడి వైద్యుడు శ్రీనివాస్ శవపరీక్ష నిర్వహించేందుకు నిరాకరించడంతో ఎస్సై చొరవతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. రాంబాబును పోలీసులు కోర్టుకు హజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
విహహేతర సంబంధమే కారణమా?
నాంపల్లి(మునుగోడు) : అనుమానం పెనుభూత మై కట్టుకున్న భార్యనే గొడలితో నరికి దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ సంఘటన మంగళవా రం రాత్రి మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడెం గ్రామాని కి చెందిన భూతం నర్సమ్మ(42), యాదయ్య దం పతులు. యాదయ్య గ్రామంలో ఫంక్చర్ దుకా ణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. తాగుడికి బానిసైన యాదయ్య నిత్యం నర్సమ్మను వేధించేవాడు. నర్సమ్మకు వివాహేతర సంబంధం అంట గడుతూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యభర్తల నడుమ గొడ వ జరిగింది. అందరూ నిద్రపోయాక రాత్రి 11:30 గంటల సమయంలో యాదయ్య గొడ్డలితో నర్సమ్మ మెడపై నరికాడు. మెడ భాగం తెగడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. చప్పుడు విన్న పిల్లలిద్దరూ లేచే సరికి యాదయ్య చంపుతానని వారిని కూడా భయపెట్టాడు. అనంరతం యాద య్య సంఘటన స్థలం నుంచి పరారీ కావడంతో పిల్లలు అరుస్తుండడంతో ఇంటి చుట్టుపక్కల వా రు వచ్చారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్ఐ మంజునాథరెడ్డి తెలిపారు. బంధువుల ఆందోళన విషయం తెలుసుకున్న నర్సమ్మ బంధువులు పెద్దఎత్తున యాదయ్య ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నర్సమ్మను అన్యాయంగా చంపి పిల్లలను అనాథులు శారని దావేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. -
తూప్రాన్‌లో యువతి దారుణ హత్య
తూప్రాన్ (మెదక్): గుర్తుతెలియని యువతిని దుండగులు అతి కిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేసేందుకు యత్నించిన సంఘటన తూప్రాన్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై కరీంగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. దీనికి సంబంధించి సీఐ లింగేశ్వర్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన కరీంగూడకు సమీపంలో గుర్తుతెలియని సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న యువతి గాయాలతో తీవ్ర రక్తస్రావమై పడి ఉండగా గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అనుమానాస్పద స్థితిలో యువతి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె తలపై బండరాయితో మోదినట్లు ఉండడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. యువతి ఎవరనే విషయం తేలాల్సి ఉందన్నారు. యువతి తలపై గుర్తుతెలియని దుండగులు దారుణంగా బండరాయితో మోదినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. యువతిని ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ హత్యా యత్నానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళ యువతిని తీసుకువచ్చిన దుండగులు అత్యాచారానికి యత్నించగా ఆమె నిరాకరించడంతోనే బండరాయితో మోది ఉంటారని పలువురు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పేర్కొంటున్నారు. మొత్తానికి యువతిని హత్య చేసేందుకు ఎవరు పాల్పడి ఉంటారనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన యువతి సాయంత్రం కన్ను మూసిందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9490617048 నంబర్‌కు ఫోన్ చేసి తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
కారు కోసం కట్టుకున్న భార్యను..
చండీగఢ్ : కారు కొనటానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను పెనంతో కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మొహలి జిల్లాకు చెందిన మమన్‌దీప్ కౌర్(28), భర్త గురుప్రీత్ సింగ్‌తో కలిసి జిరక్పూర్లో నివాసముంటోంది. గురుప్రీత్ సింగ్ 10 సంవత్సరాలు లండన్‌లో ఉండి సంవత్సరం క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. గత కొద్దినెలలుగా కారు కొనటానికి డబ్బులు కావాలని మమన్‌దీప్‌ను ఇబ్బంది పెట్టేవాడు. క్యాబ్ సర్వీస్ మొదలుపెట్టడానికి ఇంటి నుంచి డబ్బులు తెమ్మంటూ హింసించే వాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. గురువారం గొడవ తారాస్థాయికి చేరటంతో ఆగ్రహానికి గురైన గురుప్రీత్ ఆమెను పెనంతో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె సోదరుడు గురుప్రీత్‌కు ఫోన్ చేయగా.. అతని మాటలు అనుమానానికి దారితీశాయి. అనుమానంతో చెల్లెలి కోసం ఇంటికి వెళ్లి చూడగా.. సోదరి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గురుప్రీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్యలు..
సాక్షి, నెల్లూరు : మహిళల ఒంటిపై ఉన్న బంగారం కోసం దుండగులు దారుణానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని రెండు వేరు వేరు చోట్ల ఓకే తరహాలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. సోమవారం కుసుమూరులో దుండగులు గుంజి రమణమ్మ(45)అనే మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో శేషమ్మ(45) అనే మహిళను ఆత్మకూరు సమీపంలోని ఆనంతరాయని వద్ద కత్తులతో పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహిళలపై దారుణాలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
హత్య చేసి..పోలీసులతోనే తిరిగిన నిందితుడు
నస్ల్రుల్లాబాద్ : హత్య చేసి తప్పించుకుందామని అనుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వకు, బందెబోయి అనే వ్యక్తికి చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉంది. తరచూ గంగవ్వ ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే రెండు నెలలుగా గంగవ్వ బందె బోయిని దూరం పెట్టి వేరే వారితో చనువుగా ఉండటం బందె బోయి భరించలేకపోయాడు. తనను దూరంగా ఉంచడం సహించలేని బందె బోయి కంతి గంగవ్వను హత్య చేయాలని అనుకున్నాడు. అదును కోసం చూస్తున్న బందె బోయి ఆదివారం మైలారం గ్రామంలో గల కొచ్చరు మైసమ్మ ఆలయం వద్ద బంధువుల కార్యక్రమానికి వెళ్లడం గమనించాడు. ఇదే సరైన సమయమనుకుని గంగవ్వతో చనువుగా ప్రవర్తించి నస్రుల్లాబాద్ వద్ద ఉన్న కర్షగుట్ట ప్రాంతానికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా గడపాలని గంగవ్వను ప్రేరేపించగా ఆమె వారించి ఒప్పుకోలేదు. ముందుగానే చంపాలని అనుకున్న బందె బోయి కోపోద్రిక్తుడై ఇష్టారీతిన కొట్టాడు. దీంతో పెద్ద బండపై పడ్డ గంగవ్వకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్తావం అయింది. ఫలితంగా అక్కడికక్కడే మరణించింది. గంగవ్వ ఒంటిపై ఉన్న దాదాపు రూ.23వేల విలువ గల బంగారు నగలు, వెండి పట్టీలు, కడాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరిలోనే ఉంటూ, గ్రామ ప్రజలతో పాటు శవాన్ని చూసేందుకు రావడమే కాక, పోలీసులకు సహకరిస్తునట్లు ప్రవర్తించాడు. శవ పంచనామతోపాటు, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. పోలీసుల తమ విచారణలో బందె బోయితో సంబంధం ఉందన్న విషయం తెలుసుకుని అతన్ని విచారించగా నిజం ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. ఎస్ఐతోపాటు సిబ్బందికి అభినందనలు మండలంలో జరిగిన రెండు హత్య కేసులను చాకచక్యంగా తక్కువ సమయంలోనే మండల పోలీసులు ఛేదించారని సీఐ తెలిపారు. గతంలో బొమ్మన్‌దేవ్‌పల్లిలో హత్యకు గురైన కుర్మ గంగవ్వ ఎటువంటి ఆధారాలు లేని హత్య కేసులోను, ప్రస్తుత కంతి గంగవ్వ హత్య కేసులోనూ కీలక పాత్ర పోషించిన ఎస్ఐ అనిల్ రెడ్డి, పోలీసులు సంఘమేశ్వర్, సుభాష్‌ను సీఐ అభినందించారు. -
నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి...
నిజాంసాగర్(జుక్కల్) : వివాహేతర సంబంధంతో కుటుంబ పరువు తీస్తుందని భావించి కోడలిని హత్య చేసిన సంఘటన నిజాంసాగర్ మండలం ఆరేడ్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలి లా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్మ సుమలత (21) అలియాస్(రేణుక) అనే వివాహితను గొంతు నులిమి, నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి హత్య చేశారు. గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్య, సాయవ్వకు ఇద్దరు కు మారులు. పెద్ద కుమారుడు కుర్మబాబుకు మతిస్థిమితం లేదు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపేట గ్రా మానికి చెందిన రేణుకతో బాబుకు మూడున్నరేళ్ల కింద పెళ్లి చేశారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు గణేశ్ ఉన్నాడు. వారం కింద గణేశ్ పుట్టు వెంట్రు కల పండుగను ఘనంగా నిర్వహించారు. రేణుక గ్రామానికి చెందిన ఒకరితో వివాహేతర సంబం ధం కొనసాగిస్తుంది. ఈ విషయమై అత్తామామ తో రేణుక తరుచూ గొడవ పడేది. దీనిని మనస్సు లో పెట్టుకున్న అత్తామామలు పథకం ప్రకారం రేణుకను హత్య చేశారు. ఇంటి ఆవరణలో నిద్రించిన రేణుకను అర్ధరాత్రి వేళ అత్తామామ గొంతు నులిమి, నోట్లో గుడ్డలు కుక్కి, నుదిపై బాదారు. అంతటితో ఆగకుండా చేతులు, వీపు భాగంలో కర్రతో వాతలు పెట్టారు. అప్పటే రేణుక మృతిచెందడటంతో బాత్రూం వద్ద మృతదేహాన్ని పడుకోబెట్టారు. కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు నటించారు. తెల్లవారు జామున గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. గ్రామస్తుల సమాచారం మేరకు నిజాం సాగర్, పిట్లం మండలాల ఎస్ఐలు ఉపేందర్‌రెడ్డి, అంతిరెడ్డితో పాటు బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నర్సింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అత్త సాయవ్వ, మామ మల్లయ్యపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉపందేర్‌రెడ్డి తెలిపారు. అత్తామామలపై చర్యలు తీసుకోవాలి కోడలిని హత్య చేసిన అత్తామామలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి బంధువులు సంఘటన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు పోలీసులను కోరారు. దీంతో గ్రామస్తులు, నిందితుల బంధువులు కలిసి పంచాయితీ నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులకు కొంత నగదు ఇవ్వనున్నట్లు గ్రామ పెద్దలు ఒప్పుకున్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
భువనగిరి అర్బన్ : భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రావి ఉమాదేవి (73) భర్త శంకర్‌రెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందాడు. ఉమాదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు, కుమార్తె స్మీతారెడ్డి ఆమెరికాలో ఉంటున్నారు. ఉమాదేవి తన భర్త చనిపోయినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దకుమారుడు నర్సింహారెడ్డి వద్దకు వెళ్లి వస్తూ ఉంటుంది. రైతుబంధు చెక్కు తీసుకునేందుకు.. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు చెక్కు తీసుకోవడానికి ఉమాదేవి శుక్రవారం ఉదయం తన కొడుకు నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి నందనం గ్రామానికి వచ్చింది. ఉమాదేవి తనకు రావల్సిన చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను తీసుకుంది.4ఎకరాల భూమికి గాను రూ.16 వేల విలువ గల చెక్కు, పాస్‌పుస్తకాన్ని తీసుకుని గ్రామంలోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కుమారుడిని హైదరాబాద్ వెళ్లి ఉదయం రమ్మని పంపించి ఇంట్లో ఒంటరిగానే ఉంది. ఇంట్లో ఒంటరిగా.. ఉమాదేవి గ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు తోడుగా అదే గ్రామానికి చెందిన పొట్ట లక్ష్మమ్మ సహాయంగా ఉంటుంది. అయితే ఇటీవల తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్లింది. దీంతో ఉమాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. 10.30 గంటల సమయంలో.. ఉమాదేవి ఇంటి తలుపులను మూసి టీవీ చూస్తోంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుండగులు ఉమాదేవి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోనికి ప్రవేశించారు. మేడ పైనుంచి వెనుక భాగంలో ఉన్న పెంకుటింట్లోకి చొరబడ్డారు. ఎవరో ఇంట్లోకి వచ్చినట్లు అనుమానం వచ్చి పరిశీలిస్తుండగా దుండగులు ఆమెపై దాడికి తెగబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె చాలా సేపటి వరకు దుండగులతో ప్రతిఘటింటినట్టు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. దుండగులు ఆమె చీరకొంగును మెడకు ఉరివేసి అంతమొందించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, రెండు ఉంగరాలు, కాళ్ల కడియాలు, చేతి గాజులు మొత్తం 12 తులాల గల బంగారు ఆభరణాలను, ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి రూ.20 నగదును అపహరించుకపోయారు. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ నందనం గ్రామంలో జరిగిన హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కుమారుడి రాకతో.. ఉమాదేవి కుమారుడు ఉదయం 7గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో డ్రైవర్‌ను ఇంటిపైకి వెళ్లి చూడమని చెప్పాడు. అప్పటికే ఉమాదేవి విగతజీవిగా పడి ఉండడంతో గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. డీసీపీ రామచంద్రారెడ్డి స్థానికులను, కుటుంబ సభ్యులను, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాచకొండ కమిషనరేట్ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు. ఉమాదేవిని తెలిసిన వ్యక్తులే అంతమొందించి ఉంటారని గ్రామంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ తమను గుర్తుపడుతుం దన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
వృద్ధురాలు దారుణహత్య
అమరాపురం : వలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నరసమ్మ అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. నిద్రిస్తున్న ఆమెపై దుండగులు బండరాయిని తలపై వేసి కడతేర్చారు. మడకశిర సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్ఐ దిలీప్‌కుమార్, హతురాలి కుమారుడు నరసింహమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసమ్మ (77) భర్త మరియప్ప, ఈరన్న అన్నదమ్ములు. వీరు బతికున్నంతకాలం ఎటువంటి గొడవలు లేకుండా గడిపారు. అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత ఆస్తి పంపకాల విషయమై నరసమ్మ కుమారుడు నరసింహమూర్తి, ఈరన్న కుమారులు కెంచప్ప బొప్పన్న, ముద్దరాజులు గొడవ పడేవారు. రస్తా విషయంలో వాదులాడుకునేవారు. సోమవారం నరసింహమూర్తి భార్య మీనాక్షమ్మ, పొలం గట్టుపై వెళుతుంటే తమ గట్టుపై ఎందుకు వెళుతున్నావని ఈరన్న కుమారుడు ముద్దరాజు మందలించాడు. దీంతో ఈ సమస్యను గ్రామ పెద్దలకు వదిలేశారు. భూ వివాదం కేసు 2017 డిసెంబర్ నుంచి కోర్టులో నడుస్తోంది. తెల్లవారుజామున వెలుగులోకి.. సోమవారం రాత్రి యథావిధిగా నరసమ్మ, ఆమె కుమారుడు నరసింహమూర్తి, కోడలు మీనాక్షమ్మ, మనవరాలు నాగమణి, మనవడు బొప్పరాజులు ఇంటి ఆవరణలో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆవుదూడ అరుస్తున్నా నరసమ్మ లేవలేదు. నరసింహమూర్తి లేచి చూడగా అప్పటికే నరసమ్మ తలపై బండరాయి ఉంది. రాయి తీసి పలకరించినా ఆమెలో ఉలుకూపలుకూ లేదు. ఇరుగుపొరుగు వారి వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. అనంతపురం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం ప్రయత్నించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటాం నరసమ్మను హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ శుభకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.