అదనపు కట్నం కోసం వివాహిత హత్య | husband kills wife for extra dowry | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం వివాహిత హత్య

Sep 5 2015 1:30 PM | Updated on Oct 17 2018 6:06 PM

అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త కలిసి వివాహితను హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం భవానిపేట గ్రామపంచాయతి పరిధిలోని బామనమ్మతండాలో శుక్రవారం రాత్రి జరిగింది.

లింగంపేట: అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త కలిసి వివాహితను హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం భవానిపేట గ్రామపంచాయతి పరిధిలోని బామనమ్మతండాలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సరదార్(27)కు నాలుగేళ్ల కిందట కళావతి(24)తో వివాహమైంది. పెళ్లైనప్పటినుంచి భర్తతో పాటు అత్త మామలు అదనపు కట్నం కోసం వే ధించేవారు.

తాజాగా శుక్రవారం రాత్రి అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి కళావతిని గొంతు నులిమి చంపేశారు. స్తానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement