జగదేవ్‌పూర్‌లో మహిళ దారుణ హత్య
Published Tue, Oct 25 2016 12:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
జగ్‌దేవ్‌పూర్: సిద్ధిపేట జిల్లా జగ్‌దేవ్‌పూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళను కర్రలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతురాలు ములుగు మండల అడవిమసీదు గ్రామానికి చెందిన పిట్టల బాలామణి(40)గా గుర్తించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement