కోస్గి: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన మహిళ చెట్ల పొదల్లో శవమై తేలింది. ఈ సంఘటన జిల్లాలోని కోస్గి మండలం పొతిరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆశమ్మ(29)కు పదేళ్ల కిందటే వివాహమైంది. భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో.. విడిపోయి తల్లి వద్దే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
మంగళవారం రాత్రి కిరాణాషాపుకు వెళ్లి వస్తానని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.దీంతో కుంటుంబ సభ్యులు గాలించిన లాభం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం గ్రామశివారులోని చెరువుకట్ట సమీపంలో పొదల్లో ఆమె శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతురాలి కడుపు, ఛాతీ భాగంలో యాసిడ్ గాయాలు ఉన్నట్టు సమాచారం