మహిళ హత్య
Published Thu, Aug 4 2016 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
నర్సింగపేట (చింతూరు):
కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఉరేసి హతమార్చిన సంఘటన నర్సింగపేట గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. చింతూరు సీఐ దుర్గారావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం నర్సింగపేట గ్రామానికి చెందిన సున్నం పోలమ్మ (30) భర్త రాజు నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె భద్రాచలానికి చెందిన బాషా అనే వ్యక్తితో సహజీవనం గడుపుతోంది. బుధవారం రాత్రి వీరిద్దరి నడుమ ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలమ్మ కొడుకు, సోదరుడు జోక్యం చేసుకుని వారిద్దరిని వారించడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. వీరిద్దరికీ అనుమానం వచ్చి అర్థరాత్రి వెళ్లి చూడగా పోలమ్మ ఇంట్లో దూలానికి వేలాడుతూ కన్పించింది. వారు ఆమెను పరిశీలించగా మృతిచెందినట్టు గుర్తించారు. అ సమయంలో బాషా కూడా వారికి అక్కడ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని చింతూరు సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండడంతో ఘర్షణ అనంతరం పోలమ్మను హతమార్చి ఇంట్లో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాషా ప్రయత్నించి ఉండవచ్చని సీఐ అన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చింతూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు బాషా పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.
=========
గొల్లప్రోలులో సైబర్ నేరం
నగదు దోపిడీ, సైబర్ నేరగాళ్లు,
గొల్లప్రోలు :
సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి వివరాలు సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు కాజేస్తున్నారనడానికి తాజా ఉదాహరణ గొల్లప్రోలులో గురువారం జరిగింది. స్థానిక రైల్వేస్టేçÙన్ రోడ్డుకు చెందిన కొంతం రేవతికి స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. విదేశాల్లో ఉంటున్న ఆమె కుమారుడు తల్లి పోషణార్థం ఆమె ఎకౌంట్‌లో జమ చేస్తుంటాడు. ఆమెకు గురువారం ఉదయం 72829 24564 ఫోన్ నెంబరు నుంచి ఆధార్‌కార్డు వివరాలు కావాలని ఫోన్ వచ్చింది. దాంతో ఆమె ఆధార్‌కార్డు వివరాలను తెలిపింది. తరువాత అదే ఫోన్ నుంచి మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యింది అని చెప్పి కార్డుపై ఉన్న నెంబర్లు, పిన్ నెంబర్ల వివరాలను ఆమె నుంచి సేకరించారు. ఇంతలో ఆమె ఫోన్‌కు రూ. 5 వేలు ఏటీఎం నుంచి డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆమె ఈవిషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పడానికి వెళ్లే లోపు రూ. 9,500 ఏటీఎం పోస్ నుంచి డ్రాచేసినట్టు మళ్లీ మెసేజ్ వచ్చింది. దాంతో బ్యాంకు అధికారులు ఆమె ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. ఆమె ఖాతాలో రూ. 30వేలు ఉండగా సైబర్‌నేరగాళ్లు చాకచక్యంగా రూ. 14,500 కాజేశారు. బాధితురాలు రేవతి దీనిపై గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Advertisement
Advertisement