
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభు త్వం తీపి కబురు అందించింది. ఈ ఉద్యోగా లకు మరో మూడేళ్లపాటు వయో పరిమితిని పెంచుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత వయసుకు మూడేళ్లు సడలింపు కల్పించినట్టు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలోని ఉద్యోగాలన్నింటికి ఈ సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఈ నెల 9న ఉదయం 8 నుంచి 30వ తేదీ రాత్రి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించి ఇంగ్లిష్, తెలుగు/ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలో స్వల్ప మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ సబ్జెక్టు ప్రశ్నల్లో 25 శాతం మార్కులు ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మిగిలిన 75 శాతం వివరణ్మాతక ప్రశ్నలుంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment